ఇటీవల మరణించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పవన్ శనివారం నంద్యాల వెళ్లి ఎస్పీవై రెడ్డి ఇంటి ఆవరణలో ఉన్న ఆయన సమాధి వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఎస్పీవై రెడ్డి తనదైన ముద్ర వేశారని పవన్ ఈ సందర్భంగా కొనియాడారు. రూపాయికి పప్పు, రొట్టె, మజ్జిగ, ఒక్క రూపాయి అద్దెతోనే సాగునీటి పైపులు, బిందు సేద్యానికి సగం ధరకే సామాగ్రి వంటి కార్యక్రమాలను ఒక పారిశ్రామికవేత్త చేయడం గొప్ప విషయమని పవన్ ప్రస్తుతించారు.
2019-05-11 Read Moreపాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న గ్వాదర్ పట్టణంలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. భారీగా ఆయుధాలు ధరించిన ముగ్గురు దుండగులు శనివారం సాయంత్రం 5:15 గంటలకు గ్వాదర్ లోని పెరల్ కాంటినెంటల్ (పిసి) హోటల్ లోకి ప్రవేశించారు. తర్వాత కాల్పుల శబ్దం వినిపించినట్టు హోటల్ బయట ఉన్నవారు చెప్పారు. కాగా హోటల్ లో ఉన్న విదేశీ, దేశీయ అతిధులను క్షేమంగా బయటకు తెచ్చినట్టు బలూచిస్తాన్ సమాచార శాఖ మంత్రి జహూర్ బులేది చెప్పారు. భద్రతా దళాలు హోటల్ లోకి ప్రవేశించాయి.
2019-05-11‘‘భారత ప్రధాన విభజనకారుడు’’ అనే శీర్షికతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ‘‘టైమ్’’ పత్రిక ప్రచురించిన కథనానికి బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ కథనం... మోదీ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి చేసిన ఓ ప్రయత్నమని, రాసిన జర్నలిస్టు పాకిస్తానీ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా దుయ్యబట్టారు. ప్రముఖ ఇండియన్ జర్నలిస్టు తవ్లీన్ సింగ్, లేటు పాకిస్తానీ రాజకీయవేత్త సల్మాన్ తశీర్ కుమారుడైన ఆతిష్ తశీర్ ‘‘టైమ్’’ తాజా కథనాన్ని రాశారు. ఆ రచయిత పాకిస్తానీ ఎజెండాను ఫాలో అవుతున్నారని సంబిత్ ఆరోపించారు.
2019-05-11మహాకూటమిలోని నేతలు వరదల్లో వచ్చే పాములు, కప్పలు, తేళ్ళలా ప్రవర్తిస్తున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ను ఔరంగజేబుతో పోల్చారు. తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజేబు తరహాలో తండ్రిని పదవినుంచి దించిన వ్యక్తి (అఖిలేష్) బద్ధ శత్రువు (మాయావతి)తో చేతులు కలిపాడని, మే 23 తర్వాత వాళ్లిద్దరూ ఒకరినొకరు ధూషించుకుంటారని యోగి శనివారం ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.
2019-05-11 Read Moreఇండియాలో ఒక ప్రావిన్సును ఏర్పాటు చేసినట్టు ఇస్లామిక్ స్టేట్ మొదటిసారిగా ప్రకటించింది. దానికా ఉగ్రవాద సంస్థ పెట్టిన పేరు ‘‘విలయా ఆఫ్ హింద్’’. కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా అంషిపోరా పట్టణంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించినట్టు భద్రతా దళాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన చేసింది. అంషిపోరాలో భారత సైనికులను చంపినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇరాక్, సిరియాలలో ఉగ్రవాద సైన్యాన్ని నడిపిన ఐఎస్, అక్కడ ఓటమి పాలయ్యాక ఇండియాలో ‘ప్రావిన్సు’ ప్రకటన చేయడం గమనార్హం.
2019-05-11 Read More‘‘ఐటిసి’’ ఛైర్మన్ వై.సి. దేవేశ్వర్ (72) శనివారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. కంపెనీకి ఆయన రెండు దశాబ్దాలకు పైగా నేతృత్వం వహించారు. 1968లో ఐటిసిలో చేరిన దేవేశ్వర్ 1984లో డైరెక్టర్ అయ్యారు. 1996 జనవరి 1న చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా, ఛైర్మన్ గా నియమితులయ్యారు. 2017లో ఆయన ఎగ్జిక్యూటివ్ పాత్ర నుంచి తప్పుకొని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆర్.బి.ఐ. సెంట్రల్ బోర్డు, ఎయిర్ ఇండియా బోర్డులలో డైరెక్టర్ గా పని చేసిన దేవేశ్వర్ 2011లో పద్మభూషణ్ అవార్డు పొందారు.
2019-05-11 Read Moreఎన్నికల నిర్వహణకు 73 రోజులు తీసుకుంటున్న ఈసీ, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకుంటే అభ్యంతరం ఏముందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ‘‘50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఈసీని ప్రతిపక్షాలు అడిగితే మోదీకి ఏం సంబంధం..ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు?’’ అని చంద్రబాబు శనివారం ట్వీట్ చేశారు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కాదని, అధికారుల వివక్ష, పక్షపాత ధోరణులపైనేనని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలపై ఎన్నికల కోడ్ అమలు చేయకపోవడంపైనే పోరాటమని చంద్రబాబు చెప్పారు.
2019-05-11 Read Moreభారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా న్యూస్ మేగజైన్ ‘‘టైమ్’’ కవర్ పేజీపై చోటు సంపాదించారు. ‘‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’’ శీర్షికతో ప్రచురించిన ఓ కథనంలో మోదీ గత ఐదేళ్ళలో దేశంలో ‘‘విషపూరిత మత జాతీయవాద’’ వాతావరణాన్ని సృష్టించారని జర్నలిస్టు ఆశిష్ తశీర్ రాశారు. మోదీ హయాంలో దేశంలో మైనారిటీలు, దళితులు దాడులకు గురయ్యారని... వ్యవస్థలు, వర్శిటీలు, కార్పొరేట్లు, మీడియా విశ్వసనీయత కోల్పోయాయని పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మరో ఐదేళ్లు మోదీ ప్రభుత్వాన్ని భరించగలదా’’ అని రచయిత ప్రశ్నించారు.
2019-05-11 Read Moreఅమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రమైంది. అమెరికాకు దిగుమతి అవుతున్న చైనా ఉత్పత్తులలో 200 బిలియన్ డాలర్ల విలువైనవాటిపై ఇంతకు ముందున్న 10 శాతం పన్నుకు బదులు 25 శాతం విధించాలని డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆదేశించారు. వెంటనే కొత్త పన్ను అమల్లోకి వచ్చింది. అంతేకాదు.. మిగిలిన మొత్తం చైనా ఉత్పత్తులపైనా పన్ను పెంచే ప్రక్రియను ప్రారంభించాలని కూడా ట్రంప్ ఆదేశించారు. మిగిలిన ఉత్పత్తుల విలువ మరో 300 బిలియన్ డాలర్లు ఉంటుందని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాబర్ట్ లైథైజర్ తెలిపారు.
2019-05-11 Read Moreటీవీ9 తెలుగు ఛానల్ సీఈవోగా రవిప్రకాష్ ను తప్పించినట్టు ప్రకటించిన నూతన యాజమాన్యం ఆయన స్థానంలో టీవీ9 కన్నడ ఎడిటర్ మహేంద్ర మిశ్రాను తాత్కాలికంగా నియమించింది. కొత్తగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) పోస్టును సృష్టించి ఆ స్థానంలో గొట్టిపాటి సింగారావును నియమించింది. సింగారావు ప్రస్తుతం 10టీవీ సీఈవోగా పని చేస్తున్నారు. శుక్రవారం ఏబీసీఎల్ బోర్డు సమావేశం అనంతరం నూతన డైరెక్టర్లు విలేకరులతో మాట్లాడారు. ఏబీసీఎల్ లో అలంద మీడియాకు 90.5 శాతం వాటా ఉందని, అయినా తమను అడ్డుకోవడానికి రవిప్రకాష్ ప్రయత్నించారని వారు ఆరోపించారు.
2019-05-10