నిరసన దేశభక్తికి గొప్ప నిదర్శనమని బాలీవుడ్ నటి పూజా భట్ ఉద్ఘాటించారు. సిఎఎ, ఎన్.ఆర్.సి.లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్ధులు, మన గొంతులను పెంచాల్సిన సమయం వచ్చిందన్న సందేశాన్ని ఇచ్చారని భట్ పేర్కొన్నారు. సోమవారం ముంబైలో పర్చమ్ ఫౌండేషన్, ‘వియ్ ద పీపుల్ ఆఫ్ మహారాష్ట్ర’ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూజా భట్ మాట్లాడారు. ‘‘సిఎఎ, ఎన్.ఆర్.సి. నా ఇంటిని విభజిస్తున్నందున నేను మద్ధతు ఇవ్వను’’ అని పూజా భట్ స్పష్టం చేశారు.
2020-01-27‘కరోనా వైరస్’తో మరణించినవారి సంఖ్య 106కు చేరినట్టు చైనా ప్రకటించింది. ఇప్పటిదాకా 4,193 మందికి వైరస్ సోకగా 58 మంది కోలుకున్నారని తెలిపింది. వైరస్ వ్యాపించిన దేశాల్లో థాయ్ లాండ్ (8 కేసులు), జపాన్ (4), దక్షిణ కొరియా (4), అమెరికా (5), వియత్నాం (2), సింగపూర్ (5), మలేషియా (4), నేపాల్ (1), ఫ్రాన్స్ (3), ఆస్ట్రేలియా (5), కెనడా (1), జర్మనీ (1), కాంబోడియా (1) ఉన్నాయి. కాగా, సోమవారం ఒక్క రోజే చైనాలోని హుబి ప్రావిన్సులో 1291 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 మంది మరణించారు.
2020-01-28ప్రభుత్వ భవనాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులను పులమడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల్లో ఆయా రంగులను తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు పార్టీల రంగులు వేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు మందలించింది. తీసుకున్న చర్యలపై ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఎన్నికల్ కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిలను ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
2020-01-28పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను వ్యతిరేకిస్తున్నవారిపై బిజెపి నేతల విద్వేష ప్రచారం తారా స్థాయికి చేరింది. నిరసనకారులను ‘‘దేశ ద్రోహులు’’గా అభివర్ణిస్తూ అనుకూల ర్యాలీలలో ‘‘కాల్చి చంపండి’’ అని నినాదాలివ్వడం చూశాం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో సాక్షాత్తు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీ అనుయాయులతో అదే నినాదాన్ని చేయించారు. ‘దేశ్ కే గద్దారోంకో’ అని ఠాకూర్ అంటే.. సభికులు ‘గోలీమారో సాలోంకో’ అని నినదించారు.
2020-01-28ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ను 100 అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కొనుగోలు చేసినవారికి ఎయిర్ ఇండియాలో 100 శాతం ఈక్విటీతో పాటు... ఆ సంస్థకు ఎ.ఐ.ఎక్స్.ఎల్.లో ఉన్న 100 శాతం, ఎ.ఐ.ఎస్.ఎ.టి.ఎస్.లో ఉన్న 50 శాతం వాటాలు కూడా దక్కుతాయి. బిడ్లు దాఖలు చేయడానికి మార్చి 17ను ‘డెడ్ లైన్’గా నిర్దేశించారు. బిడ్లు దాఖలు చేసే సంస్థల నికర విలువ రూ. 3,500 కోట్లు ఉండాలి.
2020-01-28ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్ళు 2019 ఏప్రిల్-2020 జనవరి 25 మధ్య 5.4 శాతం పడిపోయాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ సమయానికి రూ. 7.7 లక్షల కోట్లు వసూలు కాగా ఈ ఏడాది పెరగకపోగా రూ. 7.3 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. స్థూల వసూళ్ళు 1.27 శాతమే (రూ. 9.11 నుంచి రూ. 9 లక్షల కోట్లకు) తగ్గినా రిఫండ్స్ తర్వాత ఈ వ్యత్యాసం పెరిగింది. 2019-20 బడ్జెట్లో స్థూల వసూళ్ళ లక్ష్యం 13.35 లక్షల కోట్లుగా నిర్దేశించుకున్నారు.
2020-01-28మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన తెలంగాణ రాష్ట్ర సమితి...110 పురపాలక సంఘాలను, మొత్తం 9 నగర పాలక సంస్థలనూ కైవశం చేసుకుంది. ఛైర్మన్, మేయర్ పదవులకు సోమవారం పరోక్ష పద్ధతుల్లో ఎన్నిక జరిగింది. 118 మున్సిపల్ ఛైర్మన్ పదవులకు ఎన్నిక జరిగితే 110 టిఆర్ఎస్, 4 కాంగ్రెస్, 2 బిజెపి, 2 ఎంఐఎం గెలుచుకున్నాయి. 9 మేయర్ పదవులూ టిఆర్ఎస్ వశమయ్యాయి. 28 చోట్ల ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో ఛైర్మన్, మేయర్ స్థానాలను టిఆర్ఎస్ దక్కించుకుంది.
2020-01-28సీబీఐ, ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలన్న విన్నపాన్ని హైదరాబాద్ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి తిరస్కరించడంతో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు తన బదులు తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ న్యాయస్థానం తన పిటిషన్ ను తిరస్కరించడాన్ని హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై హైకోర్టు రేపు విచారించనున్నట్టు సమాచారం.
2020-01-27శాసన మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి వెళ్ళి.. పార్లమెంటు ఆమోదం తర్వాత రాష్ట్రపతి రద్దు చేయడానికి కనీసం ఏడాది పడుతుందని ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ చెప్పారు. అప్పటిదాకా మండలి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధికి మండలి అడ్డుగా ఉందన్న వాదనను జంధ్యాల తోసిపుచ్చారు. మండలి మొదటి సెషన్లో 19 బిల్లులు వస్తే అన్నీ ఆమోదం పొందాయని, రెండో సెషన్లో 20 బిల్లులు వస్తే రెంటికి మాత్రం సవరణలు సూచించారని, తిరస్కరించలేదని చెప్పారు.
2020-01-27ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకోసం శాసన సభ తీర్మానం చేసింది. తీర్మానంపై జరిగిన ఏకపక్ష ఓటింగ్ లో 133 మంది సభ్యులు మద్ధతు తెలిపారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ముందుగానే శాసనసభ సమావేశాన్ని బహిష్కరించడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. శాసనసభలో మండలి రద్దు తీర్మానాన్ని సప్లిమెంటరీ ఎజెండాగా తీసుకున్నారు. శాసనసభ సమావేశాలు బుధవారంతోనే ముగియాల్సి ఉండగా మండలి రద్దు యోచనతోనే గురువారం, సోమవారం సమావేశాలను పొడిగించారు.
2020-01-27