అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనల మధ్య... గురువారం ఓ సానుకూల పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో పరస్పరం విధించుకున్న దిగుమతి సుంకాలను దశలవారీగా ఎత్తివేయడానికి ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్టు చైనా వాణిజ్య శాఖ గురువారం తెలిపింది. అయితే, ఎప్పటిలోగా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంకోసం జరుగుతున్న చర్చల్లో సుంకాల రద్దు ప్రధానంగా ఉంది.
2019-11-07 Read Moreబొగ్గు గని ప్రమాదాల్లో మరణించినవారికి ఇస్తున్న పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నిర్ణయం ‘కోల్ ఇండియా’, దాని అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న 3.5 లక్షల మందికి వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఒడిషాలోని మహానది బొగ్గు గనుల (ఎంసిఎల్) వద్ద గురువారం మంత్రి బొగ్గు గని కార్మికులను ఉద్ధేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా... మహానది కోల్ ఫీల్డ్స్ పరిధిలోని తాల్చేరు బొగ్గు గనుల వద్ద మంత్రి విహంగ వీక్షణం చేశారు.
2019-11-07 Read Moreప్రధాన కార్యదర్శి స్థానం నుంచి తప్పించిన తర్వాత బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా బాధ్యతలు స్వీకరించడానికి సీనియర్ ఐఎఎస్ అధికారి విముఖంగా ఉన్నారు. నెల రోజుల పాటు సెలవు పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. డిసెంబర్ 6 వరకు సెలవులో ఉంటారని తెలిసింది. ఎల్.వి.ని సీఎస్ స్థానం నుంచి తప్పిస్తూ... సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ విభాగం బాధ్యతలు (అదనపు) నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మొన్న ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.
2019-11-06మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లో చేరితేనే ఉద్యోగం ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే హెచ్చరికలు చేసినా ఆర్టీసీ కార్మికులు లెక్క చేయలేదు. డెడ్ లైన్ ముగిసేలోగా కేవలం 217 మంది విధుల్లో చేరినట్టు ఆయన సొంత పత్రిక ‘నమస్తే తెలంగాణ’ తెలిపింది. చేరినవారందరూ కూడా కార్మికులు కాదని సంఘాలు చెబుతున్నాయి. సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సుమారు 48 వేల మందిలో పట్టుమని 0.5 శాతం కూడా కేసీఆర్ హెచ్చరికలకు జడిసి విధుల్లో చేరకపోవడం గమనార్హం.
2019-11-06ఇటీవల మరణించిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాదీ సోదరి రస్మియా అవద్ ను అరెస్టు చేసినట్టు టర్కీ నిర్ధారించింది. బాగ్దాదీకి రస్మియా పెద్ద సోదరి. అలెప్పోకు ఉత్తరాన ఆమెతో పాటు ఆమె భర్తను, కోడలిని, ఐదుగురు పిల్లలను టర్కీ బంధించినట్టు వార్తలు వచ్చాయి. అస్మియాకు ఇస్లామిక్ స్టేట్ సమాచారం చాలా తెలుసని, ఆమె నోరు విప్పితే ఉగ్రవాద సంస్థకు చెందిన మరికొంతమంది కీలక వ్యక్తులను మట్టుపెట్టవచ్చని టర్కీ అధ్యక్ష కార్యాలయంలో కమ్యూనికేషన్ డైరెక్టర్ ఫహ్రెటిన్ అల్తున్ చెప్పారు.
2019-11-05 Read Moreఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5 శాతానికి క్షీణించిన నేపథ్యంలో... జీడీపీ గణనకు ప్రామాణిక సంవత్సరాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జీడీపీ కొత్త సిరీస్ ప్రామాణిక సంవత్సరాన్ని 2011-12 నుంచి 2017-18కి మార్చే అంశంపై కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కొద్ది నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. 2017-18ను కొత్త బేస్ ఇయర్‌గా ప్రభుత్వం పరిశీలిస్తున్నా, నిపుణుల కమిటీలు తమ అభిప్రాయాన్ని ఖరారు చేయడానికి ముందు మరికొంత డేటా కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.
2019-11-05 Read Moreఅథ్లెట్లు ఉత్ప్రేరకాలు స్వీకరించి పట్టుబడినప్పుడు నిషేధానికి గురైన సందర్భాలు అనేకం చూశాం... కానీ, డచ్ ఒలింపిక్ అథ్లెట్ మాడియా ఘఫూర్ ఏకంగా డ్రగ్స్ రవాణా కేసులో జైలు శిక్షకు గురయ్యారు. మాడియా (27)కు ఓ జర్మన్ కోర్టు మంగళవారం ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జూన్ నెలలో సరిహద్దు తనిఖీల సందర్భంగా మాడియా కారులో 50 కేజీల ఎకస్టసీ, రెండు కేజీల క్రిస్టల్ మెథ్ గుర్తించారు. 2016 ఒలింపిక్ క్రీడలలో నెదర్లాండ్స్ తరపున పాల్గొన్న మాడియా, తాను ఉత్ప్రేరకాలను తీసుకెళ్తున్నట్టు అనుకున్నానని వాదించింది.
2019-11-05ఐరిష్ జాతీయ టీవీ, రేడియో సంస్థ ‘ది లేట్ లేట్ షో’ అనే పేరిట 1962 జూలై 5న ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బాగా పొద్దుపోయిన తర్వాత వచ్చే ఈ కార్యక్రమాన్ని కొన్ని వారాలు నిర్వహించాలని మొదట అనుకున్నారు. అయితే, అది ఇప్పటిదాకా కొనసాగింది. దానికి కారణం ఆ షోను జర్నలిస్టు గే బైర్న్ నిర్వహించిన తీరు!. అలాంటి ప్రముఖ టివి వ్యాఖ్యాత 85 సంవత్సరాల వయసులో మరణించారు. 57 ఏళ్ల కెరీర్ తో గే ఐరిష్ టీవీపై చెరగని ముద్ర వేశారు. అత్యంత సుదీర్ఘ కాలం నడిచిన రాత్రి టీవీ చర్చలలో ‘ది లేట్ లేట్ షో’ది రెండవ స్థానం.
2019-11-05 Read Moreసమాచార దోపిడీ, దుర్వినియోగం ప్రాతిపదికనే బడా టెక్నాలజీ కంపెనీల వ్యాపార నమూనా రూపొందిందని ప్రపంచ ప్రఖ్యాత విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పారు. సోమవారం పోర్చుగల్ లోని లిస్బన్ నగరంలో ప్రారంభమైన ‘వెబ్ సమ్మిట్’లో రష్యానుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్నోడెన్ మాట్లాడారు. డేటా ప్రమాదరహితం కాదని, అది ప్రజల గురించి అయినప్పుడు డేటా కేవలం ఒక సంగ్రహం కాదని పేర్కొన్నారు. అసలు సమస్య సమాచార భద్రత కాదని, సమాచార సేకరణేనని తేల్చి చెప్పారు.
2019-11-05 Read Moreభూమి గుండ్రంగా ఉందా... బల్లపరుపుగానా? ఈ ప్రశ్నకు ఇప్పుడు అందరూ చెప్పే సమాధానం ఒక్కటే. మరి విశ్వం ఎలా ఉంటుంది? ప్లాంక్ స్పేస్ అబ్జర్వేటరీ కొలతలు విశ్వం ఒక ఫ్లాట్ షీట్ లాగా కాక గోళం ఆకారంలో ఉండవచ్చని సూచిస్తున్నాయి. దీంతో.. విశ్వంపై ఇంతకు ముందున్న అవగాహనను మార్చుకోవాలా? అన్న ప్రశ్న ఉదయించింది. బిగ్ బ్యాంగ్ మిగిల్చిన కాంతి సముద్రం వంటి కాస్మిక్ మైక్రోవేవ్ నేపథ్యాన్ని... ప్లాంక్ అబ్జర్వేటరీ 2009 నుంచి 2013 వరకు మ్యాప్ చేసింది.
2019-11-05 Read More