భారత వాయుసేన రష్యా నుంచి 21 మిగ్-29 యుద్ధ విమానాలను, ఆ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) తయారు చేసే 12 ఎస్.యు-30 ఎంకెఐ ఫైటర్లను కొనుగోలు చేయనుంది. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి) గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఇండియా వద్ద ఉన్న 59 మిగ్-29 యుద్ధ విమానాలను ఆధునీకరించనున్నారు. 21 మిగ్-29ల కొనుగోలు, 59 మిగ్-29ల ఆధునీకరణకు కలిపి రూ. 7,418 కోట్లు అవుతాయని అంచనా. 12 ఎస్.యు-30 ఎంకెఐల ఖరీదు రూ. 10,730 కోట్లు.
2020-07-02తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే హెచ్-1బి వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తానని డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ప్రకటించారు. ఆసియన్ అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసుల అంశాలపై వాషింగ్టన్ లోని డిజిటల్ టౌన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో బిడెన్ ప్రసంగించారు. ఇండియన్లు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్-1బి, ఇతర వర్క్ వీసాలపైన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నవంబరు నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నిక జరగనుండగా.. అమెరికన్ల ఓట్లకు గాలం వేస్తూ ట్రంప్ డిసెంబరు వరకు వీసాలను సస్పెండ్ చేశారు. ‘ఆయన (ట్రంప్) ఈ ఏడాది చివరి వరకే వీసాలు సస్పెండ్ చేశారు. అది నా పాలనల
2020-07-02జివికె గ్రూపు కంపెనీల ఛైర్మన్ గునుపాటి వెంకటకృష్ణా రెడ్డి, ఆయన కుమారుడు జివి సంజయ్ రెడ్డి లపై సిబిఐ కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం జాయింట్ వెంచర్ నుంచి రూ. 705 కోట్లు మళ్ళించారన్నది ఆరోపణ. ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా ముంబై విమానాశ్రయం ఆధునీకరణ, నిర్వహణ కోసం జివికె ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ తో కలసి జాయింట్ వెంచర్ (ఎంఐఎఎల్)ను ఏర్పాటు చేసింది. సంజయ్ రెడ్డి ఈ సంస్థకు ఎండి. 9 కంపెనీలకు బోగస్ కాంట్రాక్టులతో 2017-18లో 310 కోట్లు స్వాహా చేశారని, ఎంఐఎఎల్ రిజర్వు నిధులు రూ. 395 కోట్లను తమ గ్రూపు కంపెనీలకు మళ్ళించారని సిబిఐ గుర్తించింది.
2020-07-02‘కరోనా’ వేడిలో మోడీ ప్రభుత్వం రైల్వేలలో ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది. 109 రూట్లలో 151 రైళ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రైల్వే శాఖ బుధవారం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్స్ (ఆర్.ఎఫ్.క్యూ)ను ఆహ్వానించింది. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఆధునిక రైళ్ళను ప్రవేశపెట్టాలని, ఒక్కో రైలుకు కనీసంగా 16 బోగీలు ఉండాలని నిర్దేశించింది. 109 రూట్లలో ప్రారంభ స్థలం, గమ్యస్థానం.. రెండువైపుల నుంచీ సర్వీసులను నడిపే అవకాశం ప్రైవేటు వ్యక్తులకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ. 30,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
2020-07-01ఇండియాలో ‘కరోనా’ వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య బుధవారం 6 లక్షలు దాటింది. ‘వరల్డోమీటర్స్’ తాజా సమాచారం ప్రకారం పాజిటివ్ కేసులు 6,03,051కి పెరిగాయి. నిన్నటికి 5,85,493 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. రోజూ 20 వేల కొత్త కేసులు నమోదయ్యే స్థితికి ఇండియాలో ‘కరోనా’ ప్రస్థానం చేరింది. ఇవి అధికారికంగా వెల్లడవుతున్న కేసులు మాత్రమే. దేశమంతటా ‘కరోనా’ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహిస్తే మరికొన్ని వేల కేసులు తోడవుతాయి. ఈ రోజు ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం 17259 మందికి పాజిటివ్ ఫలితం వచ్చింది.
2020-07-01చిన్న దేశమైనా భూటాన్ ఓ పాఠం చెబుతోంది. యోగా గురువు రాందేవ్ ‘కరోనా’కు మందు అంటూ విడుదల చేసిన ‘కరోనిల్’ను అనుమతించేది లేదని ఆ దేశం స్పష్టం చేసింది. ‘కరోనా’కు ఇంతవరకు మందు లేదని భూటాన్ డ్రగ్ రెగ్యులేటరీ అధారిటీ (డిఆర్ఎ) గుర్తు చేసింది. ‘కరోనా’ను తగ్గిస్తుందని చెప్పే ఏ మందునూ తమ దేశంలోని మందుల షాపులలో అనుమతించబోమని తేల్చి చెప్పింది. జలుబు మందు పేరిట ‘కరోనిల్’కు ఉత్తరాఖండ్ లో అనుమతి పొందిన రాందేవ్ కంపెనీ, ‘కరోనా’ను ఖాయంగా తగ్గిస్తుందంటూ భారీగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారు.
2020-06-30ఎస్-400.. అత్యంత శక్తివంతమైన రష్యన్ తయారీ క్షిపణి రక్షణ వ్యవస్థ. అమెరికా ఆంక్షలు విధిస్తానన్నా ఆ దేశాన్ని ఒప్పించి మరీ ఇండియా ఈ వ్యవస్థకోసం రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇంకా ఇండియా చేతికి అందలేదు. కానీ, చైనా ఇప్పటికే ఎస్-400 క్షిపణి వ్యవస్థలను సరిహద్దుల వద్ద మోహరించింది. దానికంటే ముందు రష్యా రూపొందించిన ఎస్-300, చైనా దేశీయంగా రూపొందించిన ఎల్.వై-80 వ్యవస్థలు కూడా రెడీగా ఉన్నట్టు సమాచారం. సరిహద్దులకు దగ్గరగా ఎక్కువ వైమానిక స్థావరాలు ఉండటం ఇండియాకు సానుకూల అంశమైతే.. క్షిపణి రక్షణ వ్యవస్థలు బలంగా ఉండటం చైనా సానుకూలత.
2020-06-30చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఇజ్రాయిల్ తయారీ స్పైస్-2000 బాంబులు మరిన్ని కొనుగోలు చేయాలని భారత వైమానిక దళం యోచిస్తోంది. ఒక్కో ప్రాజెక్టు విలువ రూ. 500 కోట్ల లోపు ఉండేలా ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం త్రివిధ దళాధిపతులకు అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అధికారాలతో స్పైస్-2000 బాంబులను పెద్ద మొత్తంలో సమకూర్చుకోవాలని వైమానికదళం భావిస్తోంది. భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే ఈ బాంబులు ఉన్నాయి. గత ఏడాది పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపైన దాడికి ఈ బాంబులను వినియోగించారు.
2020-06-30టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సంస్థ ‘అమరరాజా ఇన్ఫ్రాటెక్’కు కేటాయించిన భూమిలో సుమారు సగం వెనుకకు తీసుకుంటూ జగన్ ప్రభుత్వం మంగళవారం జీవో ఎంఎస్ 33ని జారీ చేసింది. 2009లో చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలో ఈ కంపెనీకి 483.27 ఎకరాలు కేటాయించారు. అందులో 229.66 ఎకరాలు మాత్రమే వినియోగించారంటూ.. మిగిలిన 253.61 ఎకరాలను వెనుకకు తీసుకోవడానికి ఎపిఐఐసికి జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తన తండ్రి రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా కేటాయించిన భూములను జగన్ వెనుకకు తీసుకోవడం విశేషం. జయదేవ్ తల్లి అరుణ అప్పుడు వైఎస్ ప్రభుత్వం (కాంగ్రెస్)లో మంత్రి.
2020-06-302020-21 ఆర్థిక సంవత్సరం తొలి రెండు మాసాల్లో ‘లాక్ డౌన్’ దెబ్బ ఆర్థిక వ్యవస్థపై చాలా బలంగా పడింది. ఫలితంగా ఏప్రిల్, మే లలో కేంద్రానికి కేవలం రూ. 45,498 కోట్లు ఆదాయం రాగా వ్యయం రూ. 5,11,841 కోట్లుగా లెక్క తేలింది. అంటే.. ఖర్చు చేసిన మొత్తంలో పదో వంతు కూడా రాబడి లేదు. కేవలం 8.89 శాతం ఆదాయం, 91.11 శాతం (రూ. 4,66,343 కోట్ల) అప్పులతో రెండు నెలలు భారంగా గడిచాయి. రెండు నెలలకే రూ. 4,11,968 కోట్ల రెవెన్యూ లోటు తేలింది. రూ. 4,66,343 కోట్ల ద్రవ్య లోటును పూడ్చుకోడానికి అధికంగా అప్పులు చేయడం తప్ప మరో గత్యంతరం లేకపోయింది.
2020-06-30