‘‘ఇందిరాగాంధీ తరహాలోనే...ఓరోజు నా వ్యక్తిగత భద్రతా అధికారులతోనే బీజేపీ నన్ను హత్య చేయిస్తుంది’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం సంచలన ఆరోపణ చేశారు. పంజాబ్ లో ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేజ్రీవాల్.. తన భద్రతా అధికారులు బీజేపీకి రిపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ ర్యాలీలో సెక్యూరిటీ సిబ్బంది ఉండగానే ఓ వ్యక్తి ప్రచార వాహనంపైకి ఎక్కి కేజ్రీవాల్ ను చెంప దెబ్ కొట్టారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఆరోపణ ప్రాధాన్యతను సంతరించుకుంది.
2019-05-18 Read Moreఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులపాటు హిమాలయ దేవాలయాలకు వెళ్ళారు. శనివారం కేదార్ నాథ్ లో కొద్దిసేపు పూజలు చేసిన మోదీ, తర్వాత దగ్గరల్లోని ఓ గుహకు వెళ్ళారు. గుహలో మోదీ కాషాయ శాలువా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు మీడియాకు విడుదలయ్యాయి. మోదీకోసం అధికారులు కేదార్ నాథ్ దేవాలయంలో రెడ్ కార్పెట్, గుహలో పరుపు పరిచారు. సాధారణ భక్తులను అనుమతించలేదు. ఆదివారం మోదీ బద్రీనాథ్ వెళ్ళనున్నారు.
2019-05-18 Read More‘‘గాడ్సే..గాంధీ దేహాన్ని చంపితే ప్రగ్యా ఠాకూర్ వంటివాళ్ళు ఆయన ఆత్మను, అహింసను, శాంతిని, సహనాన్ని, మొత్తంగా భారతీయాత్మను చంపుతున్నారు’’- నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి వ్యాఖ్య ఇది. గాంధీ హంతకుడు గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించిన బీజేపీ భోపాల్ అభ్యర్ధి ప్రగ్యాఠాకూర్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధర్మాన్ని పాటించాలని బీజేపీ నాయకత్వానికి హితవు పలికారు. అధికారానికి, రాజకీయాలకు గాంధీ అతీతుడని కైలాష్ సత్యార్థి ఉద్ఘాటించారు.
2019-05-18 Read Moreఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు అనుబంధంగా ‘వీవీప్యాట్’లను ఏర్పాటు చేయించిన క్రెడిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు నవీన్ చావ్లా, ఎస్.వై. ఖురేషి చెప్పారు. శనివారం ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియపై జరిగిన వర్క్ షాపులో వారు మాట్లాడారు. ఎన్నికల సంస్కరణలకోసం చంద్రబాబు ప్రయత్నాలను హర్షిస్తూ. ఎక్కువ వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ ఆయన చేస్తున్న పోరాటంలో మద్ధతుగా ఉంటామని ఆ ఇద్దరూ చెప్పారు.
2019-05-18 Read Moreఇండియాకు బలమైన ప్రధానిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికల్లో రాయబరేలి నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. 2014లో వారణాసి నుంచి ఎన్నికై తిరిగి పోటీ చేస్తున్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితి కూడా అలాగే అవుతుందా?! ఆ అవకాశం ఉందని బి.ఎస్.పి. అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. మోదీ భవిష్యత్తుపై ప్రజలు తీర్పు చెప్పడానికి ఒక్క రోజు ముందు మాయావతి ఈ వ్యాఖ్య చేయడం ఆసక్తికరం. ఆదివారం ఆఖరి దశలో భాగంగా వారణాసిలో పోలింగ్ జరగబోతోంది.
2019-05-18టీవీ9 యాజమాన్య వివాదంలో అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఈవో రవిప్రకాష్, సినీనటుడు శివాజీలకు తెలంగాణ పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. వారిని అరెస్టు చేయడానికి నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. విదేశాలకు వెళ్తారనే ఉద్ధేశంతో దేశంలోని ఎయిర్ పోర్టులనూ అలర్ట్ చేశారు. విచారణకు హాజరు కావాలని ఇంతవరకు మూడుసార్లు నోటీసులు పంపినా హాజరు కాకపోవడంతో..సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి లుకవుట్ నోటీసులు పంపారు.
2019-05-18 Read Moreతృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ‘‘పరువు నష్టం’’ నోటీసు పంపించారు. ఈ నెల 15వ తేదీన మోదీ డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘‘అత్త, మేనల్లుడి జోడీకి రాష్ట్రాన్ని లూటీ చేయడంపైనే ఆసక్తి... దందా రాకెట్ ను నడుపుతున్నారు’’ అని ఆరోపించారు. డైమండ్ హార్బర్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ బెనర్జీ తిరిగి అక్కడినుంచే పోటీ చేస్తున్నారు.
2019-05-18 Read Moreప్రభుత్వం మారినా కీలక విధానాలు రివర్స్ కావని, అలాగే అమరావతి నగర నిర్మాణమూ ముందుకు సాగుతుందని సెఫాలజిస్టు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఇంద్రప్రస్థ నగరాన్ని (ఢిల్లీని) మించిన రాజధాని నిర్మాణానికి ఇక్కడ మంచి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఐదేళ్ళలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా ముఖ్యమని, రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలపై ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉంటే మంచిదని పేర్కొన్నారు. గత ఐదేళ్ళలో రాయలసీమలో పరిశ్రమలు వచ్చాయని, ఈసారి అమరావతి ప్రాంతంలోనూ వస్తాయని ఆకాంక్షించారు.
2019-05-18జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని సెఫాలజిస్టుగా మారిన రాజకీయ నాయకుడు లగడపాటి రాజగోపాల్ నొక్కి వక్కాణించారు. 2019 ఎన్నికల్లో మూడో శక్తిగా ముందుకొచ్చి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న జనసేనాని విశాఖపట్నంలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేశారు. ఎక్కడినుంచి గెలుస్తారన్న విషయం లగడపాటి చెప్పలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన అసెంబ్లీ సీట్లకంటే ఇప్పుడు జనసేనకు తక్కువే వస్తాయని పేర్కొన్నారు.
2019-05-18ఏపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశాలు లేవని, తెలుగు ప్రజల తీర్పు స్పష్టంగానే ఉంటుందని సెఫాలజిస్టు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. లోక్ సభ ఎన్నికల తుది దశ పోలింగ్ ఆదివారం ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను తిరుపతిలో విడుదల చేస్తానని ఆయన తెలిపారు. లగడపాటి శనివారం సాయంత్రం అమరావతిలో విలేకరులతో మాట్లాడారు. ఈసారి మూడో పార్టీ రంగంలో ఉన్నందువల్ల ప్రధాన పార్టీలకు ఓటింగ్ శాతం తగ్గుతుందని లగడపాటి చెప్పారు.
2019-05-18