సుమారు 6,000 ఏళ్లపాటు నిద్రాణంగా ఉన్న ఓ అగ్నిపర్వతం బద్ధలు కావడం అరుదైన పరిణామం. ఐస్ ల్యాండ్ దేశ రాజధాని సమీపంలోని ‘మౌంట్ ఫాగ్రాడల్స్ఫ్జాల్’ వేల ఏళ్లపాటు తనలోనే నిక్షిప్తం చేసుకున్న లావాను వెదజల్లింది. ఇటీవల దేశంలో కొన్ని వేల భూ ప్రకంపకనలు నమోదయ్యాయి. దీంతో అగ్నిపర్వతాల విస్ఫోటనాన్ని ముందే ఊహించారు. అయినా, దేశ దక్షిణ భాగంలోని రేక్‌జానెస్ ద్వీపకల్పంలో ఉన్న ‘మౌంట్ ఫాగ్రాడల్స్ఫ్జాల్’ విస్ఫోటనం ఆశ్చర్యపరిచింది. ఈ ద్వీపకల్పంలో 781 ఏళ్ల తర్వాత మళ్లీ అగ్నిపర్వతం పేలింది.
2021-03-20భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద పెంపులో సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, విద్యుత్... ఇలా అన్నిటినీ ఆక్రమిస్తున్న ఈ అభినవ కుబేరుడు 2021లో ఇప్పటిదాకా $ 16.2 బిలియన్ అదనంగా సంపాదించారు. ప్రపంచ కుబేరుల్లో ఈ ఏడాది అత్యధికంగా లాభపడిన వ్యక్తి అదానీ కావడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన జెఫ్ బెజోస్, ఎలోన్ ముస్క్ ఈ విషయంలో అదానీ ముందు దిగదుడుపే. తాజా లాభంతో అదానీ సంపద 50 బిలియన్ డాలర్లు దాటింది.
2021-03-12డిఎంకె దిగ్గజం కరుణానిధి మనవడు, పార్టీ ప్రస్తుత అధినేత ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ‘చెపాక్-తిరువల్లికేని’ నియోజకవర్గం నుంచి ఉదయనిధి రంగంలోకి దిగారు. శుక్రవారం డిఎంకె అభ్యర్ధుల జాబితా వెల్లడైంది. గతంలో చెపాక్ నియోజకవర్గం నుంచి కరుణానిధి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో చెపాక్-తిరువల్లికేని ప్రాంతాలు విలీనమయ్యాయి. తొలుత సినిమా రంగంలోకి వెళ్లిన ఉదయనిధి స్టాలిన్, ప్రస్తుతం డిఎంకె యువజన నాయకుడిగా ఉన్నారు.
2021-03-12తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలపై ధీమాగా ఉన్న డిఎంకె, తాను పోటీ చేస్తున్న అన్ని స్థానాలకూ ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించింది. 234 సీట్లలో మిత్రులకు కేటాయించిన సీట్లు పోను డిఎంకె అధికారికంగా 173 చోట్ల పోటీ చేస్తోంది. శుక్రవారం ఆ 173 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ సారథి ఎంకె స్టాలిన్ ‘‘ఇది కేవలం అభ్యర్థుల జాబితా కాదు. విజేతల జాబితా’’ అని వ్యాఖ్యానించారు. డిఎంకె హేమాహేమీలు, ప్రస్తుత ఎంఎల్ఎలలో మెజారిటీ తిరిగి సీటు దక్కించుకున్నారు. స్టాలిన్ కొలత్తూరు నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.
2021-03-12ఎన్నికలకు ఏడాది ముందు ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ పదవికి రాజీనామా చేశారు. నిన్న బిజెపి అగ్ర నేతలను కలసిన రావత్, వారి సూచనల మేరకు మంగళవారం రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 2017లో బిజెపి ఘన విజయం తర్వాత పదవిని చేపట్టిన రావత్, మరో 9 రోజులు ఉంటే సిఎంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకునేవారు. కొత్త సిఎం ఎవరన్నది బుధవారం జరిగే శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయిస్తామని రావత్ రాజీనామా అనంతరం బిజెపి నేతలు తెలిపారు.
2021-03-09ముస్లింలతో ఐక్యతా ప్రక్రియను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు విచ్ఛిన్నం చేశారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఐక్యతా మార్గం నుంచి ముస్లింలను వేరు చేయడానికి వారిలో వేర్పాటు భావనను ఔరంగజేబు కల్పించారని భగవత్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం ‘ఐతిహాసిక కాలజ్ఞానం: ఒక భారతీయ వివేచన’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భగవత్ హాజరయ్యారు. భారతీయ దృక్పథం నుంచి దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ‘మేధో యోధులు’ అవసరమని భగవత్ పేర్కొన్నారు.
2021-02-21కోవిడ్19 చికిత్స కోసం తాము ఏ సంప్రదాయ ఔషదానికీ ఆమోదం తెలపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. యోగా గురువు రాందేవ్ కంపెనీ పతంజలి ఆయుర్వేద తన ‘కరోనిల్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించిందని పేర్కొన్న నేపథ్యంలో డబ్ల్యుహెచ్ఒ స్పందించింది. డబ్ల్యుహెచ్ఒ సర్టిఫికేషన్ పథకం ప్రకారం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లోని ఆయుష్ విభాగం నుంచి ‘కరోనిల్’కు సర్టిఫికెట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ (సిఒపిపి) అందిందని పతంజలి ప్రకటించింది. కరోనాకు మందుగా పేర్కొంటూ 2020 జూన్ 23న ‘కరోనిల్’ను పతంజలి విడుదల చేసింది.
2021-02-21గాల్వన్ లోయ ఘర్షణలో మరణించిన పిఎల్ఎ సైనికులను అవమానించారంటూ ముగ్గురు వ్యక్తులను చైనా నిర్బంధించింది. అరెస్టయినవారిలో కియు జిమింగ్ (38) అనే జర్నలిస్టు ఉన్నారు. గాల్వన్ లోయలో గత ఏడాది జూన్ 15న జరిగిన ఘర్షణలో 21 మంది భారత సైనికులు మరణించగా, ప్రభుత్వం అప్పుడే వెల్లడించింది. అయితే, తమ వైపు నలుగురు మరణించినట్టు చైనా మొన్ననే వెల్లడించింది. ప్రకటనకు 8 నెలలు ఎందుకు పట్టిందని ‘వీబో’లో ప్రశ్నించిన జిమింగ్, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
2021-02-21కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతు సంఘాలు తలపెట్టిన దేశ వ్యాప్త రహదారుల దిగ్బంధం (చక్కా జామ్) ప్రశాంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు చేపట్టిన ఈ కార్యక్రమం నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లను మినహాయించారు. మిగిలిన ఉత్తర భారతంలో అనేకచోట్ల రాస్తారోకోలు జరిగాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ప్రధాన రహదారులను రైతులు దిగ్బంధించారు. ఆయా రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక లలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
2021-02-06కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమించిన రైతు సంఘాలకు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్.ఎల్.డి) నేత అజిత్ సింగ్ మద్ధతు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దులో శిబిరం నిర్వహిస్తున్న భారతీయ్ కిసాన్ యూనియన్ (బికెయు) నేత నరేష్ తికాయత్ తో శుక్రవారం అజిత్ సింగ్ మాట్లాడినట్టు ఆయన కుమారుడు జయంత్ చౌదరి వెల్లడించారు. ‘‘ఇది రైతులకు జీవన్మరణ సమస్య. అయినా ఆందోళన వద్దు. ఈ విషయంలో అందరూ కలసి, ఐక్యంగా ఉండాలి.. ఇది చౌదరి సాహెబ్ (అజిత్ సింగ్) సందేశం’’ అని జయంత్ తెలిపారు.
2021-01-29 Read More