ఏపీలో బుధవారం వరకు నమోదైన 87 ‘కరోనా’ కేసుల్లో 70 ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్ధనా సమావేశాలతో సంబంధం ఉన్నవేనని సిఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం నుంచి 1085 మంది ఢిల్లీ సమావేశాలకు వెళ్లారని, వారిలో ఇప్పటికి 585 మందికి పరీక్షలు నిర్వహించగా 70 పాజిటివ్ కేసులు తేలాయని సిఎం బుధవారం వివరించారు. మరో 500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని, 21 మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవాళ్లతో పాటు.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగినవారు డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ‘ఇదేం తప్పు కాదు. నయం కాని జబ్బూ కాదు. 104కు ఫోన్ చేస్తే వైద్యులు వచ్చి పరీక్షిస్తారు’ అని సిఎం చెప్పార
2020-04-01‘కరోనా’ కట్టడికోసం విధించిన ఆంక్షలు, దేశవ్యాప్త ‘లాక్ డౌన్’ మధ్య మార్చి నెలలో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్లు కొద్దిగా తగ్గాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రూ. 97,597 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో రూ. 1,06,577 కోట్లు సమకూరాయి. 2019 మార్చి కంటే 2020 మార్చిలో తగ్గుదల 4 శాతం ఉంటే.. మొత్తం ఆర్థిక సంవత్సంలో వసూళ్ళు 8 శాతం పెరిగాయి. 2018-19లో 12 నెలలకు రూ. 8,76,794 కోట్లు వసూలు కాగా 2019-20లో 9,44,414 కోట్లు వచ్చాయి. గత సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కూడా వసూళ్ళు తగ్గినా ఆర్థిక సంవత్సరం మొత్తంలో పెరుగుదలే నమోదైంది.
2020-04-01టెన్నిస్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ‘వింబుల్డన్’. అలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ ఈ ఏడాది ‘కరోనా వైరస్’ కారణంగా రద్దయింది. జూన్ 29 నుంచి జూలై 13 వరకు జరగాల్సిన వింబుల్డన్ ఛాంపియన్ షిప్ 2020ని రద్దు చేస్తూ.. అల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రధాన బోర్డు (ఎ.ఇ.ఎల్.టి.సి), మేనేజ్ మెంట్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. 134వ ఛాంపియన్ షిప్స్ ను 2021 జూన్ 28 నుంచి జూలై 11 వరకు నిర్వహించాలని నిర్ణయించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ‘వింబుల్డన్’ రద్దు కావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ సహా అనేక క్రీడోత్సవాలు వాయిదా పడ్డాయి.
2020-04-01యూపీలో ‘కరోనా వైరస్’తో మరణించిన తొలి వ్యక్తి వయసు కేవలం 25. సోమవారం సాయంత్రం బస్టి జిల్లాలో చనిపోయిన ఈ యువకుడికి ‘కరోనా’ సోకినట్టు బుధవారం వెల్లడైంది. ఇండియాలో ‘కరోనా’తో మరణించినవారిలో ఇతనే పిన్న వయస్కుడు. శ్వాస సమస్యతో ఆ యువకుడిని బంధువులు మార్చి 28న ఆసుపత్రికి తీసుకొచ్చారని, ఇటీవల అతను ముంబై వెళ్లి వచ్చాడన్న విషయాన్ని దాచిపెట్టి సాధారణ వార్డులో చేర్చారని డాక్టర్లు ఆరోపించారు. ఇతని నుంచి ఆ వార్డులో ఇతరులకు ‘కరోనా’ వ్యాపించి ఉండొచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అతనిని బస్టి నుంచి గోరఖ్ పూర్ లోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించాడు. మృతదేహాన్ని సాధారణ పద్ధతుల
2020-04-01కరోనా వైరస్ సోకితే ప్రాణాలపైన ఆశలు వదులుకోవలసిందేనా? ‘కోవిడ్’ లక్షణాలేంటి? వచ్చినట్టు ఎలా గుర్తించాలి.. నిర్ధారణ అయ్యాక ఏం చేయాలి? ప్రజల్లో ఉన్న సందేహాలకు సరళంగా, సవివరంగా సమాధానమిచ్చారు జన విజ్ఞాన వేదిక కార్యకర్త డాక్టర్ కె. శివబాబు. ‘కరోనా’ అనుమానిత కేసుల్లో జ్వరానికి, ఒళ్లు నొప్పులకు బ్రూఫిన్, యాస్పిరిన్ వాడొద్దని ఆయన స్పష్టం చేశారు. వైరస్ తీవ్రతను ఈ మందులు పెంచుతాయని తేలినట్టు శివబాబు చెప్పారు. హై రిస్కు కేసులు మినహా మిగిలిన ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. మైల్డ్ కేసుల్లో తగినంత విశ్రాంతి, విటమిన్ సి లభించే ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారానే రికవరీ ఉంటుందని శివబాబు చ
2020-04-01రెండు రోజుల క్రితం వరకు ‘కరోనా’ కేసులు అతి తక్కువగా నమోదైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. మంగళ, బుధవారాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 36 గంటల్లో కేసుల సంఖ్య నాలుగింతలైంది. మొన్న రాత్రికి 23.. నిన్న రాత్రికి 44.. ఈ రోజు (బుధవారం) ఉదయానికి 87.. ఏపీలో కేసుల పెరుగదల ఆందోళనకరంగా ఉంది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 43 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో ఢిల్లీ నిజాముద్దీన్ మసీదులో ప్రార్ధనలకు వెళ్లివచ్చినవారే అధికమని చెబుతున్నారు. కడపలో నిన్నటిదాకా ఒక్క కేసు కూడా లేదు. రాత్రికి రాత్రి 15 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలోనూ రాత్రికే 13 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 15కు పెరిగాయి.
2020-04-01‘కరోనా’ కష్టకాలంలో ఆందోళనకు గురై సొంత వైద్యానికి దిగడం ప్రమాదకరం. ఈ సమయంలో ప్రజలకు సరైన ఆరోగ్య సలహాలు అందించడం చాలా అవసరం. స్వచ్ఛందంగా ఈ సామాజిక బాధ్యతను చేపట్టారు కొందరు డాక్టర్లు, ఐటి నిపుణులు. ‘ప్రజా ఆరోగ్య వేదిక’ పేరిట హైదరాబాద్ కేంద్రంగా ఓ ఉచిత ‘హెల్ప్ లైన్’ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు 040 48214595 నెంబరుకు ఫోన్ చేస్తే సమస్యకు తగిన పరిష్కారాన్ని సంబంధిత డాక్టర్ల నుంచి పొందవచ్చు. ఉభయ రాష్ట్రాల్లో సేవాభావం ఉన్న డాక్టర్లు, ఐటి నిపుణులు ఈ 24 గంటల ‘హెల్ప్ లైన్’ కోసం పని చేస్తున్నట్టు ఫ్రీ సాఫ్ట్ వేర్ మూమెంట్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎంఐ) కన్వీనర్ వై. కిరణ్ చంద్ర చెప్పారు.
2020-04-01‘స్టార్ వార్స్’ సినిమా నటుడు ఆండ్రూ జాక్ ‘కరోనా వైరస్’తో యుకెలో మరణించారు. 76 సంవత్సరాల జాక్ సర్రే లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం మరణించినట్టు ఆయన ఏజెంట్ జిల్ మెక్ కల్లోగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. జాక్ స్టార్ వార్స్ ఎపిసోడ్ 7, 8 లలో నటించారు. మాండలిక శిక్షకుడిగా కూడా పని చేశారు. ఆయన భార్య గాబ్రియెలి రోజెర్స్ ఆస్ట్రేలియాలో ‘క్వారంటైన్’లో ఉన్నారు. ఆండ్రూకి రెండు రోజుల క్రితమే ‘కరోనా’ నిర్ధారణ అయింది. జాక్ థేమ్స్ నదిపైన నడిచే పురాతన హౌస్ బోట్ లో నివసించారని, ఆయన చాలా స్వతంత్రుడని ఏజెంట్ జిల్ పేర్కొన్నారు.
2020-04-01తెలంగాణ ప్రభుత్వం అందరి వేతనాల్లో కోత విధించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లింపులను వాయిదా వేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇంకా ఇలాంటి నియామకాల్లో ఉన్నవారి వేతనాలను 100 శాతం, అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాలను 60 శాతం, నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం, మిగిలిన అందరి ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం చెల్లింపులు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు. పెన్షనర్లకు కూడా ఈ వాయిదా వర్తిస్తుంది. కరోనా’ కట్టడికోసం విధించిన ‘లాక్ డౌన్’ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన
2020-04-01నిన్నటిదాకా ఒక్క ‘కరోనా’ కేసు కూడా నమోదు కాని పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మందికి వైరస్ సోకినట్టు బుధవారం ఉదయం వెల్లడైంది. ఏలూరు నగరంలో ఆరుగురు, భీమవరంలో ఇద్దరు, పెనుగొండలో ఇద్దరు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురం లలో ఒక్కొక్కరు వైరస్ బారిన పడ్డారు. జిల్లాలో 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి నెగెటివ్ తేలిందని, మరో ఆరుగురికి సంబంధించిన ఫలితాలు రావలసి ఉందని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. ఇప్పుడు ఏపీలో ‘కరోనా’ కేసుల్లో పశ్చిమ గోదావరి జిల్లానే మొదటి స్థానంలో ఉంది.
2020-04-01