కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి విధించిన అత్యవసర పరిస్థితిని ఏప్రిల్ చివరి వరకు పొడిగించనున్నట్టు ఇటలీ ఆరోగ్య మంత్రి రాబర్టో స్పెరంజా బుధవారం చెప్పారు. వైరస్ వ్యాప్తి తగ్గుతున్న సంకేతాలు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇటలీలో అత్యయిక పరిస్థితిని తొలిగా 2020 జనవరిలోనే ప్రకటించారు. పొడిగింపుల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ పరిస్థితి కలసి వస్తుంది. ఇటలీలో ఇప్పటిదాకా 23 లక్షలకు పైగా ప్రజలకు కరోనా సోకగా 79,819 మంది చనిపోయారు.
2021-01-13 Read More‘అధికారాంతమున చూడవలె అయ్యగారి సొబగులు’ అంటూ ఇప్పుడంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా ‘యూట్యూబ్’ ట్రంప్ ఛానల్ ను సస్పెండ్ చేసింది. గత వారం ట్రంప్ మద్ధతుదారులు అమెరికా కేపిటోల్ భవనాన్ని ఆక్రమించిన నేపథ్యంలో.. హింసను ప్రేరేపించినట్టు ఆరోపిస్తూ యూట్యూబ్ యజమాన్యం ఈ చర్య తీసుకుంది. దీంతో కనీసం వారం రోజులు కొత్త వీడియోలు పోస్టు చేయడానికి అవకాశం లేదు. అంటే, సస్పెన్షన్ ముగిసే (ఈ నెల20) నాటికి అయ్యగారి అధ్యక్ష పదవీ కాలం ముగుస్తుంది.
2021-01-13 Read Moreఅధ్యక్షుడిగా ఉండి అల్లర్లను ప్రేరేపించిన ఘనతను సొంతం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రికార్డులనూ సృష్టిస్తున్నారు. రెండోసారి అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో నిలిచిపోబోతున్నారు. అంతే కాదు.. పదవీ కాలం ముగియడానికి కొద్ది రోజుల ముందు అభిశంసనకు గురవుతున్న అధ్యక్షుడూ ట్రంప్ మాత్రమే. తమ 45వ అధ్యక్షుడిపై అభిశంసనకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం సిద్ధమైంది. గత ఏడాది ఓసారి ట్రంప్ అభిశంసనకు గురయ్యారు.
2021-01-13 Read Moreరక్షణ రంగంలో రష్యా సహకారంతో దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్.సి.ఎ) ‘తేజస్’కు మెరుగైన రూపం ఎల్.సి.ఎ. ఎంకె-1ఎ. ఇప్పుడీ రకానికి చెందిన 83 విమానాలను రూ. 48,000 కోట్లతో కొనుగోలు చేయడానికి భారత వైమానిక దళానికి కేంద్రం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) ఈ భారీ రక్షణ కొనుగోళ్ళకు ఆమోదం తెలిపింది. ‘తేజస్’లో స్వదేశీ సరుకు 50 శాతం ఉండగా, ‘ఎంకె-1ఎ’లో అది 60 శాతానికి పెరిగింది. ఎంకె-1కు 40 అంశాల్లో మెరుగులు దిద్దారు.
2021-01-13 Read Moreదేశంలో విద్యుత్ ఉత్పత్తిదారులకు పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిలు నవంబరులో రూ. 1,41,621 కోట్లకు పెరిగాయి. 2019 నవంబరు నాటికి ఉన్న బకాయిలు రూ. 1,04,426 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 35 శాతం అధికం. ఎక్కువ బకాయి పడిన పంపిణీ సంస్థల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్ము&కాశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, జార్ఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల సంస్థలు ఉన్నాయి. విద్యుత్ సరఫరా చేసిన 45 రోజుల్లోపు డిస్కంలు ఉత్పత్తిదారులకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ గడువు దాటాక అపరాద వడ్డీని విధిస్తారు.
2021-01-03 Read Moreసీరం ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇండియా (సిఐఐ), భారత్ బయోటెక్ కరోనా టీకాల అత్యవసర పరిమిత వినియోగానికి ఆమోదం తెలిపినట్టు డ్రగ్ కంట్రోల్ జనరల్ (డిసిజిఐ) డాక్టర్ విజి సోమాని ఆదివారం వెల్లడించారు. ఐసిఎంఆర్ తో కలసి భారత్ బయోటెక్ రూపొందించిన ‘కోవాగ్జిన్’ 70.42 శాతం సమర్ధతతో పని చేస్తోందని డిసిజిఐ చెప్పారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రా జెనెకా సంయుక్తంగా రూపొందించిన ‘కోవిషీల్డ్’ను సిఐఐ ఉత్పత్తి చేస్తోంది. కేంద్ర డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ సంస్థ (సి.డి.ఎస్.సి.ఒ) నిపుణుల కమిటీ నిన్న, మొన్న సమావేశమై చేసిన సిఫారసు మేరకు తాజా ఆమోదం లభించింది.
2021-01-03ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు తనను బెదిరిస్తున్నారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. బెదిరించినవారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిమానులు అయి ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం రాజీపడటాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో బెదిరింపులు రావడం గమనార్హం. ఈ బెదిరింపులు చాలా చూశానన్న ఉండవల్లి, ప్రభుత్వం చేయవలసిన పనులు చేశాక తనను బెదిరించాలని ఎద్దేవా చేశారు. వైఫల్యాలపై చంద్రబాబును నిలదీసిన జగన్, ప్రభుత్వంలోకి వచ్చాక చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.
2020-12-22జమ్మూ- కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత స్థానిక ఎన్నికలే కీలకమైన వేళ కేంద్రంలోని బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. జమ్మూ- కాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 20 జిల్లాల్లోని 280 సీట్లకు పోలింగ్ జరిగితే కూటమి 108 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బిజెపి 60, కాంగ్రెస్ 22 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బిజెపికి పట్టున్న జమ్మూ ప్రావిన్సులోనే 57 సీట్లలో ఆధిక్యం లభించింది. గుప్కార్ కూటమి ఇక్కడ 37, కాశ్మీర్ ప్రాంతంలో 71 సీట్లలో ముందుంది.
2020-12-22యుకెలో కరోనా కొత్త రూపాంతరం విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఆ దేశం నుంచి సాధారణ విమాన రాకపోకలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నెల 23 నుంచి 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. యుకె నుంచి ఇప్పటికే బయలుదేరి మంగళవారంలోగా చేరుకునే విమానాల ప్రయాణీకులు తప్పనిసరిగా ఆర్.టి-పిసిఆర్ పరీక్షలు చేయించుకోవలసి ఉంటుందని పౌర విమానయాన శాఖ సోమవారం ప్రకటించింది. కరోనా కొత్త రూపాంతరం పాతవాటి కంటే 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని యుకె ప్రకటించాక పలు యూరప్ దేశాలు నిన్నటికే విమానాల రాకపోకలను నిషేధించాయి.
2020-12-22కరోనా వైరస్ కొత్త రూపాంతరం ఒకటి యుకెను వణికిస్తోంది. ఈ కొత్త రూపాంతరం నియంత్రించలేని విధంగా వ్యాపిస్తోందని వెల్లడించిన యుకె, ఇళ్లలోనే ఉండాలని ప్రజలను హెచ్చరించింది. ఆదివారం ఆ దేశం విధించిన ఆంక్షలు ఇంగ్లండ్ లోని సుమారు మూడో వంతు ప్రజలను ప్రభావితం చేయనున్నాయి. దీంతో యుకె నుంచి విమాన రాకపోకలను నెదర్లాండ్స్, ఐర్లాండ్ నిషేధించాయి. జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, ఆస్ట్రియా అదే బాటలో పయనించాయి. ఇండియా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కరోనాపై ఏర్పాటైన సంయుక్త పర్యవేక్షణ గ్రూపు సోమవారం సమావేశం కానుంది.
2020-12-21