ఆర్థిక మాంద్యం ప్రభావంతో గిలగిలలాడుతున్న ప్రజలకు ధరల భారం అధికమైంది. జాతీయ గణాంక సంస్థ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం... డిసెంబరులో రిటైల్ ద్రవ్యోల్భణం 7.35 శాతానికి పెరిగింది. గత ఐదున్నరేళ్ళలో ఇదే అత్యధికం. 2018 డిసెంబరులో వినిమయ ధరల సూచీ (సిపిఐ) కేవలం 2.11 శాతం ఉంటే 2019 నవంబరులో 5.54 శాతంగా ఉంది. డిసెంబరుకు రిజర్వు బ్యాంకు లక్షిత స్థాయినే కాకుండా ఆర్థికవేత్తల అంచనాలను కూడా దాటిపోయింది.
2020-01-13డెన్మార్క్ అంటే గుర్తుకొచ్చే అంశాల్లో రాజధాని కోపెన్‌హాగన్‌లోని ‘లిటిల్ మెర్మైడ్’ ఒకటి. ఆ విగ్రహం నిలిపి ఉన్న రాయిపై ఈ రాత్రి రాజకీయ నినాదాలు రాయడం పెద్ద వార్త అయింది. గుర్తు తెలియని వ్యక్తులు ‘‘ఫ్రీ హాంకాంగ్’’ నినాదాన్నిరాయిపై ఎర్ర రంగుతో రాశారు. ఈ మత్స్యకన్య విగ్రహాన్ని డెన్మార్క్ వాసులు అపురూపంగా చూసుకుంటారు. చైనా టూరిస్టులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. అందుకే హాంకాంగ్ ఉద్యమకారులు లక్ష్యంగా చేకుకొని ఉంటారని భావిస్తున్నారు.
2020-01-13 Read Moreజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (14వ తేదీ) కాకినాడలో పర్యటించనున్నారు. నిన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులు జనసేన నాయకులపై దాడి చేయడంతో..అక్కడే తేల్చుకుందామని పవన్ సవాలు విసిరారు. పవన్ రేపు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి కాకినాడ వెళ్తారు. దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలు, నాయకులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడతారు.
2020-01-13పెట్రోలు లీటరుకు 10 పైసలు, డీజిల్ లీటరుకు 5 పైసలు చొప్పున ధర తగ్గింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు సడలడంతో నిన్న కూడా స్వల్పంగా ధరలు తగ్గాయి. ధరలు తగ్గాక పెట్రోలు ఢిల్లీలో రూ. 75.80 ఉంది. ముంబయిలో రూ. 81.39, కోల్ కతలో రూ. 78.38, చెన్నైలో రూ. 78.76గా ఉంది. డీజిల్ ధర ఢిల్లీలో 69.06, ముంబైలో రూ.72.42, కోల్ కతలో రూ. 71.43, చెన్నైలో రూ. 72.99గా ఉంది.
2020-01-13వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపి విజయసాయి రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కాళ్లకు నమస్కరించారు. సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకోసం ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో కలసి విజయసాయి రెడ్డి హైదరాబాద్ ప్రగతి భవనానికి వెళ్లారు. కేసీఆర్ వారికి స్వాగతం పలికి హాలులోకి తీసుకెళ్ళాక ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
2020-01-13‘రాజధాని తరలింపు’ దుమారం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ఢిల్లీలో బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి. నడ్డాను కలిశారు. మొన్న పార్టీ సమావేశం జరుగుతుండగా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని పవన్ హుటాహుటిన వెళ్ళారు. అయితే, నిన్నటిదాకా సమావేశం జరగలేదు. రాజధాని వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పవన్ సోమవారం నాటి భేటీలో కోరినట్టు సమాచారం. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా నడ్డాను కలిశారు.
2020-01-13అమరావతి ప్రాంతంలో పోలీసుల దౌర్జన్యానికి గురైన మహిళలు సోమవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 27 రోజులుగా సి.ఆర్.పి.సి.144 సెక్షన్, పోలీసు చట్టం సెక్షన్ 30 అమలును, గ్రామాల్లో పోలీసుల కవాతులను వారు సవాలు చేశారు. మీడియా రిపోర్టులను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు కూడా స్యూమోటో విచారణకు సిద్ధపడింది. పిటిషనర్ల వాదన విన్న ప్రధాన న్యాయమూర్తి కేసును శుక్రవారానికి వాయిదా వేస్తూ.. అఫిడవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
2020-01-13రాజధానిపై ప్రభుత్వ వైఖరి సరైనదనుకుంటే... 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మాజీ సిఎం చంద్రబాబు అధికార వైసీపీకి సవాలు విసిరారు. ప్రజలు అమరావతి వద్దని ఓటు వేస్తే తాను రాజకీయాలనుంచే తప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను కర్నూలుకు, సీమకు వ్యతిరేకం కాదని, తాను కూడా రాయలసీమ బిడ్డనేనని నొక్కి చెప్పారు. అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు అన్ని ప్రాంతాలవారూ ఒప్పుకొన్నారని చంద్రబాబు చెప్పారు.
2020-01-13‘అమరావతి కావాలా... విశాఖ పోతారా’ అని రాయలసీమ ప్రజలను మాజీ సిఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సోమవారం పెనుగొండలో జరిగిన అమరావతి జెఎసి సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతికోసం పోరాడుతుంటే తనను కర్నూలుకు, సీమకు వ్యతిరేకి అని వైసీపీవాళ్ళు విమర్శిస్తున్నారని, నిజానికి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడని చెప్పారు. ‘‘హైకోర్టును మూడు ముక్కలు చేసి ఒక ముక్క ఇక్కడ పెడతారట.. దానికి కూడా కేంద్రం ఒప్పుకోవాలి’’ అని చంద్రబాబు చెప్పారు.
2020-01-13ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 20, 21, 22 తేదీలలో జరగనున్నాయి. సీఆర్డీయే చట్టానికి సవరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. రాజధానిపై 10 మంత్రులతో ఏర్పాటైన హై పవర్ కమిటీ ఈలోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు, గతంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులపై చర్చించే అవకాశం ఉంది.
2020-01-13