‘‘బోఫోర్స్ నిందితుడు రాజీవ్ గాంధీ’’ పేరిట ఎన్నికల్లో పోరాడాలని సవాలు చేసిన ప్రధానమంత్రి మోదీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ధీటైన ప్రతి సవాలు విసిరారు. లోక్ సభకు చివరి రెండు దశల ఎన్నికల్లో నోట్ల రద్దు, జీఎస్టీ, మహిళల భద్రత, నిరుద్యోగం అంశాలపై పోరాడదామా? అని ప్రియాంక బుధవారం ఢిల్లీ ప్రచార సభలో మోదీని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ అమ్మాయి’’గా సవాలు చేస్తున్నట్టు చెప్పిన ప్రియాంక... మోదీ ఐదేళ్ల క్రితమే రాజధానికి వచ్చారని, తాను 47 సంవత్సరాలుగా ఇక్కడే పెరిగానని ఉద్ఘాటించారు.
2019-05-08 Read More200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 25 శాతం పన్ను వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల క్రితం చేసిన ట్వీట్ ప్రపంచ మార్కెట్లను భూమార్గం పట్టించింది. 102 పదాల ఈ ఒక్క ట్వీట్ ప్రపంచ స్టాక్ మార్కెట్ల విలువను 1.36 ట్రిలియన్ డాలర్ల మేరకు తగ్గించింది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 95,20,000 కోట్లు. అంటే ట్రంప్ ట్వీట్ లోని ఒక్కో పదానికి రూ. 91 వేల కోట్లు ఆవిరయ్యాయన్నమాట. ఈ నేపథ్యంలో గురువారం, శుక్రవారం రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలు సఫలమవుతాయా? లేక శుక్రవారంనుంచి కొత్త పన్నులు అమలవుతాయా? వేచి చూడాలి.
2019-05-08 Read Moreరిపబ్లిక్ టీవీ ఇప్పుడు ఛానల్ ఎండీ, ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్ణబ్ గోస్వామి సొంతమైంది. ఇంతకాలం ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ వాటాలను ఆర్ణబ్ కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు తర్వాత రిపబ్లిక్ టీవీ విలువ ఏకంగా రూ. 1200 కోట్లకు చేరింది. దాని యజమాని ‘‘రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్’’ మొత్తం ఇక ఆర్ణబ్ నియంత్రణలోనే ఉంటుంది. బీజేపీ ఎంపీకి చెందిన ఏసియానెట్ న్యూస్ మీడియా, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ మధ్య ఈమేరకు ఒక ఒప్పందం కుదిరింది.
2019-05-08 Read Moreప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో... బుధవారం మ్యాన్మార్ లోని యాంగాన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మరో బీతావహ ఘటన చోటు చేసుకుంది. బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి యాంగాన్ రన్ వే నుంచి జారిపోయి మూడు ముక్కలుగా విడిపోయింది. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బాంబార్డియర్ డాష్ 8 విమానంలో 29 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. విమానం కిందకు దిగే సమయంలో భారీగా గాలులు వీయడంతో అదుపు తప్పినట్టు అధికారులు తెలిపారు.
2019-05-08 Read Moreరాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను వ్యక్తిగత విహారానికి వాడుకున్నారంటూ ప్రధాని మోదీ బుధవారం మరో ఆరోపణ చేశారు. ‘‘సెలవుల్లో విహారంకోసం ఓ వ్యక్తి నేవీ యుద్ధనౌకను ఉపయోగించుకున్నారని మీరెప్పుడైనా విన్నారా? రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ‘ఐఎన్ఎస్ విరాట్’ను వ్యక్తిగత టాక్సీలా వాడుకున్నారు... నేవీ అధికారులు ఆయన సేవకులుగా పని చేయాల్సి వచ్చింది. ఇది భద్రతా బలగాలను దుర్వినియోగం చేయడం కాదా’’ అని మోదీ ఢిల్లీ రాంలీలా మైదాన్ సభలో ప్రశ్నించారు.
2019-05-08 Read Moreప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన మరో ఫిర్యాదును ఎన్నికల కమిషన్ కొట్టివేసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ‘‘నెంబర్ 1 అవినీతిపరుడు’’గా పేర్కొంటూ మోదీ చేసిన వ్యాఖ్యలోనూ ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సభల్లో మోదీ చేసిన ప్రసంగాలపై అనేక ఫిర్యాదులు రాగా గత కొద్ది రోజుల్లో ఆరు అంశాలపై ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆదివారం యూపీలో మోదీ ఓ సభలో రాజీవ్ గాంధీపై చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
2019-05-07 Read Moreఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 10వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతకు ముందు నిర్ణయించారు. అయితే, కేబినెట్ సమావేశానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవలసి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కేబినెట్ ఎజెండా ఏమిటో తెలియజేయాలని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరారు. దీంతో ఎజెండాను సీ.ఎస్.కు పంపారు. తగినంత సమయం ఉండాలనే ఉద్ధేశంతో సమావేశాన్ని 14వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం.
2019-05-07తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని పదే పదే చెబుతున్న కేసీఆర్... ఈ విషయమై వామపక్ష నేతతో భేటీ కావడం ఇదే తొలిసారి. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను... ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను ఒకే గొడుకు కిందకు తేవడంపై కేసీఆర్ ఈ సందర్భంగా చర్చించినట్టు సమాచారం. అంతకు ముందే కేసీఆర్ కుటుంబ సమేతంగా అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు.
2019-05-06భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పైన ఒక మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ‘పస’ లేదని జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే కమిటీ తేల్చింది. జస్టిస్ బాబ్డేతోపాటు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ప్యానల్ ఈ అంశంపై రహస్య విచారణ జరిపి ప్రధాన న్యాయమూర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది. ప్యానల్ తన నివేదికను ‘తదుపరి సీనియర్ జడ్జి (అరుణ్ మిశ్రా)’కి సమర్పించింది. రంజన్ గొగోయ్ తనను వేధించారని ఆరోపిస్తూ ఓ మాజీ ఉద్యోగి గత నెల 29న 22 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు అఫిడవిట్ రూపంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
2019-05-06 Read Moreమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ‘నెంబర్ 1 అవినీతిపరుడు’ అన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల సభల్లో మాట్లాడకుండా నిషేధించాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల అధికారులను కోరింది. ఈమేరకు ఆదివారం ఈసీకి లేఖ రాసింది. ‘‘ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల్ నిబంధనవాళి ఉల్లంఘనే కాదు. ఒక అమరుడైన భారతరత్నకు అవమానకరం’’ అని ఆ లేఖలో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శనివారం నాడు ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ ఘర్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ రాహుల్ గాంధీని, మరణించిన ఆయన తండ్రిని ఉద్దేశించి ఆరోపణలు చేశారు.
2019-05-06 Read More