రాష్ట్రాలకు ‘ప్రత్యేక కేటగిరి హోదా’ ఇచ్చే ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్ సభలో స్పష్టం చేశారు. గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.సి) ఐదు అంశాల సమగ్ర పరిశీలన ఆధారంగా కొన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రణాళికా సాయంకోసం ప్రత్యేక కేటగిరిలో చేర్చిందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఎన్.డి.సి. మంజూరు చేసిన ప్రత్యేక కేటగిరి హోదాలో పారిశ్రామికాభివృద్ధికోసం ఎలాంటి ప్రత్యేక చర్యలూ లేవని నిర్మల చెప్పారు.
2019-06-24మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరపాలని ఆయన కుమారుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూలై 8వ తేదీన వైఎస్ 70వ జయంతి. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇకపైన రైతు దినోత్సవం పేరిట అధికారికంగా వైఎస్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
2019-06-24ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ప్రక్కనున్న ‘ప్రజావేదిక’లో తొలి కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసిన కొత్త సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆ భవనంలో జరిగే చివరి భేటీ అదేనని ప్రకటించారు. కృష్ణా నది కరకట్టకు లోపల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వమే నిర్మించిన ‘ప్రజావేదిక’ను రేపటి సమావేశాల తర్వాత ఎల్లుండినుంచి కూల్చివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా కూర్చున్న భవనం అక్రమ నిర్మాణమని చాటడానికే కలెక్టర్ల సమావేశం అక్కడ ఏర్పాటు చేయాలని సూచించినట్టు జగన్ చెప్పారు.
2019-06-24ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ్ కప్ పోటీలో పాకిస్తాన్ 49 పరుగుల తేడాతో గెలిచింది. వరుస ఓటములతో విమర్శలను ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టుకు ఈ విజయం స్వాంతన చేకూర్చగా దక్షిణాఫ్రికా ఫైనల్ ఆశలు కల్లలయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ జట్టులో హారిస్ 59 బంతుల్లో చేసిన 89 పరుగులు కీలకంగా మారాయి.
2019-06-23రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చకోసం 12 ప్రతిపక్ష పార్టీలు నోటీసు సమర్పించాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీ, బి.ఎస్.పి, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, సిపిఐ, కేరళ కాంగ్రెస్ (ఎం), ఐయుఎంఎల్, ఎన్.సి.పి. నేతలు ఈ నోటీసుపై సంతకాలు చేశారు. ఎన్నికల ముందు వరకు ప్రధానంగా చర్చించిన ఇవిఎంల అంశాన్ని మాత్రం నోటీసులో పేర్కొనలేదని సమాచారం.
2019-06-22బీజేపీలోకి రావాలని తాను ఎవరినీ బొట్టు పెట్టి పిలవబోనని తాజాగా టీడీపీ నుంచి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలను బీజేపీలో చేర్పించబోతున్నారా అని ఓ టీవీ ఛానల్ న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు చౌదరి పరస్పర భిన్నమైన సమాధానాలు ఇచ్చారు. ‘బొట్టు పెట్టి పిలవను..ఈ పరిస్థితుల్లో నాతో ఎవరూ టచ్ లో లేరు’ అంటూనే, ‘నేను సింపుల్ కాల్ ఇస్తే వచ్చేవాళ్లు వస్తారు. నేను వెళ్లాను కదా’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ సిద్దాంతాలు, విధానాలు నచ్చినవాళ్లు రావాలన్నారు.
2019-06-23ఇండియన్ మహిళా రగ్బీ టీమ్... ఏర్పాటై కేవలం ఏడాదే అయింది. ఇప్పటిదాకా మూడు మ్యాచులు మాత్రమే ఆడింది. శనివారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సింగపూర్ జట్టుతో జరిగిన పోటీలో మొదటి అంతర్జాతీయ విజయాన్ని (21-19) నమోదు చేసింది. ఆసియా మహిళా రగ్బీ టోర్నమెంటులో గత వారం ఫిలిప్పీన్స్ చేతిలో కొద్దిపాటి తేడా (32-27)తో ఓడిపోయింది. ఫిలిప్పీన్స్ జట్టును 68-0 తేడాతో చిత్తుగా ఓడించిన చైనా బంగారు పతకాన్ని సాధించగా, ఇండియాకు కాంస్యం ఖరారైంది.
2019-06-22ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల సమస్యను ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) మరింత పెంచుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరం చివరికి బకాయిల మొత్తం రూ. 7,277 కోట్లు కాగా 2018-19 చివరికి రూ. 16,481 కోట్లకు పెరిగింది. ఎన్.పి.ఎ. జాబితాలో అకౌంట్ల సంఖ్య 2018 మార్చి 31 నాటికి 17.99 లక్షలు కాగా, 2019 మార్చి31కి 30.57 లక్షలకు పెరిగింది. అకౌంట్ల సంఖ్యలో పెరుగుదల 69.93 శాతం (12.58 లక్షల అకౌంట్లు)గా ఉంటే ఎన్.పి.ఎ.ల మొత్తం ఏకంగా 126.48 శాతం పెరిగింది.
2019-06-23 Read Moreమెదడువాపు వ్యాధితో 100 మందికి పైగా పిల్లలు చనిపోయిన నేపథ్యంలో వివాదాస్పదమైన బీహార్ శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ ఆసుపత్రి (ఎస్.కె.ఎం.సి.హెచ్) మరో కారణంతో శనివారం వార్తలకు ఎక్కింది. ఆసుపత్రి పోస్టుమార్టం విభాగం సమీపంలోని చెత్తకుప్పల్లో పిల్లల కంకాళాలు విసిరేసినట్టు కనిపించడం కలకలం రేపింది. మెదడు వ్యాధులతో మరణించిన పిల్లల శవాల్లో ఎవరూ తీసుకెళ్ళనివాటిని పోస్టుమార్టం తర్వాత ఖననం చేయకుండా విసిరేయడం వివాదాస్పదమైంది.
2019-06-22 Read Moreబహుజన సమాజ్ పార్టీ (బి.ఎస్.పి) అధినేత్రి మాయావతి తన సోదరుడు ఆనంద్ కుమార్, మేనల్లుడు ఆకాష్ ఆనంద్ లను జాతీయ ఉపాధ్యక్షుడు, సమన్వయకర్తలుగా నియమించారు. మరో నేత రాంజీ గౌతంను కూడా మరో జాతీయ సమన్వయకర్తగా నియమించారు. ఆదివారం లక్నోలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమ్రోహా ఎంపి డానిష్ ఆలి లోక్ సభలో పార్టీ నేతగా, నగీనా ఎంపి గిరీష్ చంద్ర చీఫ్ విప్ గా నియమితులయ్యారు.
2019-06-23 Read More