* దేశవ్యాప్తంగా బీజేపీకి 236 సీట్లు వస్తాయని ఐఎఎన్ఎస్-సి ఓటర్ సర్వే అంచనా వేసింది. 2014 ఎన్నికల్లో కంటే ఈ సంఖ్య 46 తక్కువ. కాంగ్రెస్ పార్టీకి గతంలో 44 సీట్లు మాత్రమే రాగా ఈసారి 80కి పెరుగుతాయని సి ఓటర్ అంచనా. బీజేపీ మిత్రపక్షాల్లో జె.డి.యు, ఎల్.జె.పి.లకు కలిపి 20, శివసేనకు 15, ఎఐఎడిఎంకె-మిత్రపక్షాలకు 10 వస్తాయని ఆ సంస్థ పేర్కొంది. * ఎబిపి-నీల్సన్ సర్వే ప్రకారం బీజేపీకి 218 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 81 సీట్లు రావచ్చు. ఎన్డీయేకు మొత్తంగా 267 సీట్లు, యుపిఎకు 127 సీట్లు రావచ్చని ఈ సంస్థ అంచనా.
2019-05-19‘‘టుడేస్ చాణక్య’’ కూడా ఆంద్రప్రదేశ్ లో విజయం తెలుగుదేశం పార్టీదేనని చెబుతోంది. రాష్ట్రంలోని లోక్ సభ సీట్లలో తెలుగుదేశం పార్టీకి 17 (ప్లస్ లేదా మైనస్ 3), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 (మైనస్ లేదా ప్లస్ 3) రావచ్చని ఆ సంస్థ పోల్ వెల్లడించింది. లోక్ సభ సీట్ల ప్రకారం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయం!! లగడపాటి రాజగోపాల్ ప్రకారం.. ఏపీలో టీడీపీకి 15 లోక్ సభ సీట్లు (ప్లస్ లేదా మైనస్ 2), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 (ప్లస్ లేదా మైనస్ 2) రావచ్చు. ఆదివారం లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ తర్వాత వివిధ సంస్థలు తమ సర్వేల వివరాలను వెల్లడించాయి.
2019-05-19కేంద్రంలో ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రిపబ్లిక్ టీవీ-సి ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీయేలోని పార్టీలకు 287 సీట్లు, యుపిఎకు 128, ఇతరులకు 127 సీట్లు రావచ్చు. అయితే, రిపబ్లిక్-జన్ కీ బాత్ సర్వే ఎన్డీయేకు 305, యూపీఎకు 124, ఇతరులకు 113 సీట్లు ఇచ్చింది. టైమ్స్ నౌ-విఎంఆర్ సర్వే ఎన్డీయేకు 306, యుపిఎకు 142, ఇతరులకు 94 సీట్లు ఇచ్చింది. న్యూస్ ఎక్స్-నేత సర్వే ఎన్డీయేకు 298, యుపిఎకు 118, ఇతరులకు 126 సీట్లు ఇచ్చింది. లోక్ సభలో మెజారిటీకి 272 సీట్లు అవసరం కాగా గత ఎన్నికల్లో బీజేపీ సొంతగానే 282 సీట్లు సాధించింది.
2019-05-19ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని సెఫాలజిస్టుగా మారిన రాజకీయ నేత లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఆర్.జి. ఫ్లాష్ టీమ్ సర్వేల వివరాలను ఆయన ఆదివారం తిరుపతిలో వెల్లడించారు. టీడీపీకి 100 సీట్లు (10 ప్లస్ లేదా మైనస్), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72 సీట్లు (7 ప్లస్ లేదా మైనస్), ఇతరులకు (జనసేనతో కలిపి) 3 సీట్లు (2 ప్లస్ లేదా మైనస్) వస్తాయని తమ అంచనాగా తెలిపారు. కొద్దిగా అటూ ఇటూగా... టీడీపీకి 43 శాతం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 శాతం, జనసేనకు 11 శాతం ఓట్లు వస్తాయని లగడపాటి సర్వే చెబుతోంది.
2019-05-19ప్రధాని నరేంద్ర మోదీ కేదారనాథ్ దేవాలయంలో రెడ్ కార్పెట్ పైన ప్రదక్షిణలు చేస్తున్న చిత్రం సామాజిక మాథ్యమాల్లో వైరల్ అయింది. మోదీ సంప్రదాయ డిజైనర్ డ్రెస్సును కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనే నటీమణుల దుస్తులతో పోలుస్తూ, ఆయనను అతిపెద్ద యాక్టరుగా సంభోదిస్తూ ట్వీట్లు వెల్లువెత్తాయి. ‘జీవితంలో ఎక్కువ భాగం సన్యాసిగా గడిపానని చెప్పుకొనే వ్యక్తికి కేదార్ నాథ్ బాబా దేవాలయంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఎందుకు?’ అని ఒకరు ప్రశ్నిస్తే..దేవుడి ఎదుట అందరూ సమానమేనని మరొకరు గుర్తు చేశారు.
2019-05-19 Read Moreఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నిర్ణయాలు తీసుకోవడానికి నిర్వహించే సమావేశాలకు హాజరు కాబోనని ఈసీ సభ్యుడు అశోక్ లావాసా చెప్పినట్టు శనివారం వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు క్లీన్ చిట్ ఇచ్చిన ఐదు సందర్భాల్లో తన అభ్యంతరాలను నమోదు చేయకపోవడంతో లావాసా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఫుల్ కమిషన్ లో ఉన్న ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్ సుశీల్ చంద్ర ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇవ్వగా లావాసా వ్యతిరేకించారు.
2019-05-18 Read More‘‘మీరు షోలే సినిమాలో అస్రానీ పాత్ర చూశారా? అందులో ఆయన ఎప్పుడూ ‘బ్రిటిష్ వాళ్ల కాలంలో...’ అంటుంటాడు. అలాగే మోదీ జీ ఎప్పుడూ జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతుంటారు’’ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ ఎన్నికల సభలో మాట్లాడిన ప్రియాంక, ‘‘గత ఐదేళ్లలో ఆయన (మోదీ) చేసిన పనిగురించి ఎందుకు మాట్లాడరు?’’ అని ప్రశ్నించారు.
2019-05-18 Read Moreఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను రష్యానుంచి కొనుగోలు చేయడం ఖాయమని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ శనివారం స్పష్టం చేశారు. దాంతోపాటు ఎస్-500 రక్షణ వ్యవస్థలను మాస్కోతో కలసి సంయుక్తంగా తయారు చేస్తామని ఆయన ప్రకటించారు. అమెరికా మిసైళ్ళకు బదులు రష్యా ఎస్-400 కొనుగోలు చేయాలన్న టర్కీ నిర్ణయంపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. అలా అయితే తమ ఎఫ్-35 భాగస్వామ్యం చెడుతుందని హెచ్చరిస్తోంది. కాగా, అమెరికా ఎఫ్-35 విమానాలను సరఫరా చేసి తీరుతుందని టర్కీ అధ్యక్షుడు చెబుతున్నారు.
2019-05-19 Read More‘‘మా చేతుల్లో ఆయుధాలతో అమెరికా రాకకోసం వేచి చూస్తున్నాం’’- వెనెజులా లోని అరగువా రాష్ట్రంలో సైనికులు వినిపించిన సమరనాదం ఇది. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు విధేయత చూపుతూ శుక్రవారం సైన్యం ఓ ర్యాలీని నిర్వహించింది. సైనికులు, మిలిటరీ వాహనాలు వెంటరాగా అధ్యక్షుడు మదురో స్వయంగా కొంతదూరం నడిచారు. అమెరికా మద్ధతుతో ప్రతిపక్ష నేత జువాన్ గాయిడో తనను తాను ‘‘మధ్యంతర అధ్యక్షుడు’’గా ప్రకటించుకున్న తర్వాత వెనెజులా ఉద్రిక్తంగా మారింది.
2019-05-18 Read Moreటీవీ9 వాటాల వివాదంలో తెలంగాణ పోలీసులు నిందితునిగా పేర్కొన్న సినీ నటుడు శివాజీ శనివారం గళం విప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, వడదెబ్బ తగలడంవల్ల విశ్రాంతి తీసుకుంటున్నానని చెబుతూ ఓ వీడియోను మీడియాకు పంపారు. తెలంగాణ పోలీసులు శివాజి, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ లకు లుకవుట్ నోటీసులు పంపించిన నేపథ్యంలో శివాజీ స్పందించారు. తనపై అలంద మీడియా పెట్టింది ఓ సిల్లీ కేసు అని, సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చి కుట్ర చేస్తున్నారని శివాజీ విమర్శించారు.
2019-05-18