సంస్థ 21వ సెంచరీ ఫాక్స్ ఎంటర్ టైన్ మెంట్ వ్యాపారాన్ని డిస్నీ సంస్థ 71 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5 లక్షల కోట్లకు) సొంతం చేసుకుంది. ఈ టేకోవర్ వల్ల సిండ్రెల్లా, ద సింప్సన్స్, స్టార్ వార్స్, డాక్టర్ స్ట్రేంజ్ వంటి ప్రఖ్యాత సిరీస్ లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. డిస్నీ ప్లస్ ద్వారా త్వరలో డిస్నీ స్ట్రీమింగ్ సేవలను అందించబోతోంది. ఫాక్స్ కొనుగోలు ద్వారా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి టెక్నాలజీ కంపెనీలతో డిస్నీ పోటీ పడబోతోంది. ఫాక్స్ టీవీ ఛానళ్లు, ఎఫ్.ఎక్స్. నెట్ వర్క్స్, నేషనల్ జియోగ్రాఫిక్ ల కార్యక్రమాలు, షోలు తమ స్ట్రీమింగ్ సేవలకు ఉపయోగపడతాయని డిస్నీ యాజమాన్యం భావిస్తోంది.
2019-03-20 Read More2014లో రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్టే... 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ దక్కకుండా చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విన్నవించారు. విభజన చట్టాన్ని అమలు చేయని మోదీ, మనకు రావలసిన ఆస్తులను పంచని కేసీఆర్ లతో జగన్ కుమ్మక్కయ్యారని చంద్రబాబు విమర్శించారు. బుధవారం కృష్ణా జిల్లా నూజివీడులో ఎన్నికల సభలో చంద్రబాబు మాట్లాడారు. అగ్రరాజ్యం అమెరికా సైన్యాన్ని వియత్నాం ప్రజలంతా కలసి తరిమినట్టుగా... కేసీఆర్, నరేంద్ర మోదీ, జగన్ కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
2019-03-20కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీటును నిరాకరించిన నేపథ్యంలో ఆయన పార్టీ మారారు. బుధవారం మంత్రి ఫరూక్ తో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చిన ఐజయ్య పసుపు కండువా కప్పుకొన్నారు. కర్నూలు జిల్లాకే చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కూడా బుధవారం టీడీపీలో చేరారు. జిల్లాలో టీడీపీ అభ్యర్ధులు గెలవడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని బైరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
2019-03-20జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు బుధవారం ఆ పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానంనుంచి నాగబాబు పోటీ చేస్తారని పార్టీ వెంటనే ప్రకటించింది. తన సోదరుడని దొడ్డిదారిన కాకుండా రాజమార్గంలో ఎన్నికల రణక్షేత్రంలో నిలబెడుతున్నామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు. తన రాజకీయ గురువు అన్న నాగబాబేనని పవన్ కళ్యాణ్ చెప్పగా.. ‘‘పేరుకే పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు. పార్టీలో అందరిలాగే నాకూ నాయకుడే’’ అని నాగబాబు పేర్కొన్నారు.
2019-03-20తన అధికారానికి అడ్డు వస్తున్నారనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా చంద్రబాబు వదిలిపెట్టడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మామ ఎన్టీఆర్ ను అధికారంనుంచి దించేశాక చంపేశారని, ఇప్పుడు ఆయన ఫొటోకే దండలు వేస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఎన్నికల సభలో మాట్లాడిన జగన్ ‘‘చంద్రబాబు అధికారానికి ఎవరైనా అడ్డు వస్తారని భావిస్తే ఆ వ్యక్తిని ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. వెన్నుపోటు పొడవగలడు.. చంపేయగలడు. ప్రతిపక్ష నాయకుడిని వదిలిపెట్టడు.. రేపు ప్రధానమంత్రినైనా వదిలిపెట్టడు. మా చిన్నాన్నను చంపించింది చంద్రబాబే’’ అని జగన్ ఆరోపించారు.
2019-03-20ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ఒక్క 2018లోనే కోటి ఉద్యోగాలను నాశనం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపాల్ రాజధాని ఇంపాల్ లో బుధవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ ‘‘ఒక రోజు (మోదీ) నిద్ర లేవగానే నోట్లు రద్దు చేయాలని నిర్ణయించాడు. ఇదేమైనా హాస్యమా? ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాడు’’ అని వ్యాఖ్యానించారు. రోజుకు 27 వేల ఉద్యోగాలు మోదీ వల్ల పోయాయని, అతని అసమర్ధత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని రాహుల్ పేర్కొన్నారు.
2019-03-20 Read Moreఇండియాలో అతిపెద్ద ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ లండన్ నగరంలో అరెస్టయ్యారు. లండన్ కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసిన రెండు రోజుల తర్వాత బుధవారం అక్కడి పోలీసులు మోదీని అదుపులోకి తీసుకున్నారు. బుధవారమే ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,000 కోట్లకు పైగా ముంచిన కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. ఈ కేసులో మోదీని ఇండియాకు అప్పగించాలని కోరుతూ సీబీఐ ఓ విన్నపాన్ని భారత విదేశాంగ శాఖ ద్వారా యుకె ప్రభుత్వానికి పంపింది. నీరవ్ మోదీ లండన్ నగరంలో విలాసవంతంగా బతుకుతున్నట్టు టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించాక చర్యలు తీసుకోక తప్పలేదు.
2019-03-20 Read Moreఒక్క అవకాశం ఇస్తే తన తండ్రి రాజశేఖరరెడ్డి కంటే గొప్పగా పరిపాలిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విన్నవించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలను నమ్మవద్దని సూచించారు. ఎన్నికలు రాకపోయి ఉంటే, జగన్ హామీ ఇవ్వకుంటే పెన్షన్ మొత్తం రూ. 2000కు పెరిగేదే కాదని జగన్ ఉద్ఘాటించారు. జగనన్నను సిఎంను చేసుకుందామని ప్రతి అవ్వా తాతకు చెప్పాలని కార్యకర్తలకు చెప్పారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల సభలో జగన్ మాట్లాడారు.
2019-03-20హైదరాబాద్ నగరంలో ఆస్తులు ఉన్నవారిని బెదిరించి ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేయకుండా నిరోధిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈరోజు ఉదయం కూడా ఒకరిద్దరు అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకుంటామన్నారని ఆయన చెప్పారు. ‘‘మా ఆస్తులు పోతాయి’’ అనే భయపడే పరిస్థితి వచ్చిందంటే.. మనం ఇప్పుడే కళ్లు తెరవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆంధ్రలో తోలుబొమ్మ ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరుకుంటున్నారని విమర్శించారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ పెన్షనర్ల సంఘం సభలో చంద్రబాబు మాట్లాడారు.
2019-03-20టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ మాజీ నేత నామ నాగేశ్వరరావు మంగళవారం పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ మనుగడ ప్రశ్నార్ధకమైనందున తాను తప్పనిసరై ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వివరణ ఇచ్చారు. నామ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరతారని, ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామ 2009లో లోక్ సభకు ఎన్నికై 2014 వరకు పని చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్ధిగా ఖమ్మం అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2019-03-20