ఆంధ్రజ్యోతి పత్రికను నడుపుతున్న ఆమోద పబ్లికేషన్స్ సంస్థకు విశాఖపట్నంలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం రద్దు చేసింది. బుధవారం అమరావతి సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రూ. 40 కోట్ల విలువైన ఒకటిన్నర ఎకరాల భూమిని గత ప్రభుత్వం 2017లో కేవలం రూ. 50 లక్షలకే ఆంధ్రజ్యోతికి ఇచ్చిందని, అక్కడ నిర్మాణాలేమీ చేపట్టకపోవడంతో ఇప్పుడు రద్దు చేశామని మంత్రి చెప్పుకొచ్చారు.
2019-10-16హోంగార్డులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 600 దినసరి వేతనాన్ని రూ. 710కి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం బుధవారం అమరావతి సచివాలయంలో సమావేశమైంది. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న రూ. 1000ని రూ. 3000కు పెంచాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బార్ అసోసియేషన్ లో నమోదైన జూనియర్ న్యాయవాదులకు (3 ఏళ్ల లోపు) నెలకు రూ. 5,000 చొప్పున స్టై ఫండ్ చెల్లించాలని కేబినెట్ తీర్మానించింది.
2019-10-16చేనేత మగ్గంపై ఆధారపడిన కుటుంబాలకు ఏటా రూ. 24 వేల చొప్పున ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఈమేరకు ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ అనే కొత్త పథకానికి బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేటపై నిషేధం ఉన్నందువల్ల... ఆ కాలంలో మత్య్సకార కుటుంబాలకు రూ. 10 వేలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ‘వైఎస్ఆర్ మత్స్యకారుల వేట నిషేధ సహకారం’ పేరిట ఈ సాయం అందిస్తారు.
2019-10-16అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు రాక ముందే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మందిర నిర్మాణంపై ప్రకటన చేశారు. ఆ స్థలంలో రామమందిర నిర్మాణం డిసెంబర్ 6వ తేదీన ప్రారంభమవుతుందని సాక్షి మహారాజ్ ప్రకటించారు. 1992లో డిసెంబర్ 6నే బాబ్రీ మసీదును కూల్చివేసిన విషయం తెలిసిందే. అదే రోజు రామందిర నిర్మాణం ప్రారంభం కావడం విశేషమని సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. బాబర్ భారతీయ ముస్లింల పూర్వీకుడు కాడని, ఒక ఆక్రమణదారుడని సాక్షి వ్యాఖ్యానించారు.
2019-10-16 Read Moreఅయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. బుధవారంతో వాదనలు ముగిశాయి. లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించడానికి మరో మూడు రోజులు గడువు ఇచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసే (నవంబర్ 17వ తేదీ) లోగా అయోధ్య వివాదంపై తీర్పు ఇవ్వాలన్న నిశ్చయం సుప్రీంకోర్టులో కనిపిస్తోంది. అందుకే రోజువారీ విచారణ చేపట్టి 40 రోజుల్లో వాదనలు విన్నది.
2019-10-16 Read Moreదేశం సుభిక్షంగా ఉందని నేతలు చెబుతున్నారు. ఆహారధాన్యాలు పుష్కలంగా ఉన్నాయి... విదేశాలకు సాయం చేయమని కొందరు సిఫారసు చేస్తున్నారు. అదే సమయంలో... ఆకలి రాజ్యాల్లో ఇండియా ఒకటని తాజాగా వెల్లడైన ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2019’ చెబుతోంది. 117 దేశాలకు ర్యాంకులు ఇస్తే ఇండియా 102వ ర్యాంకుతో అట్టడుగు దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ దేశంలో ఆకలి సమస్య తీవ్రంగా ఉందని ఈ రిపోర్టు తేల్చింది. శ్రీలంక (ర్యాంకు 66), నేపాల్ (73), బంగ్లాదేశ్ (88), పాకిస్తాన్ (94) మనకంటే చాలా మెరుగ్గా ఉన్నాయి.
2019-10-15 Read Moreఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 25 వేల మంది హోంగార్డులను ఒక్క వేటుతో తొలగించింది. మరో 99 వేల మంది హోంగార్డులు కూడా నెలలో 10 రోజుల చొప్పున ఉపాధి కోల్పోనున్నారు. నెలకు 25 రోజులు ఉపాధి లభించే వారందరికీ ఇకపైన 15 రోజులే అవకాశం ఉంటుంది. హోంగార్డులకు కూడా కానిస్టేబుళ్ళతో సమానంగా వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో... రూ. 500 దినసరి వేతనాన్ని రూ. 672కు పెంచారు. సుప్రీం ఆదేశాన్ని పాటిస్తున్నట్టు చూపిస్తూ ఏకంగా ఉద్యాగాలనుంచే తొలగించారు.
2019-10-15 Read More‘‘మేఘ’’ కంపెనీకి సంబంధించిన సోదాల్లో భాగంగా... ఆదాయ పన్ను శాఖ అధికారులు హైదరాబాద్ బాలానగర్ ఆంధ్రా బ్యాంకులోని లాకర్ల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత శుక్రవారం ‘మేఘ’లో మొదలైన సోదాలు మంగళవారం వరకు కొనసాగాయి. బాలానగర్ లోని కంపెనీ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న ఆంధ్రా బ్యాంకు బ్రాంచిలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు. రూ. 2,45,31,160 విలువైన బంగారు ఆభరణాలకు బ్యాంకు అధికారులు లెక్క చెప్పకపోవడంతో...‘మేఘ’ పేరుతో సీజ్ చేశారు.
2019-10-15 Read Moreతెలంగాణ గవర్నరుగా ఇటీవలే నియమితురాలైన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం తీరుపై గవర్నర్ ఓ నివేదికను కేంద్రానికి సమర్పించినట్టుగా స్థానిక మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అయితే... రాజ్ భవన్ చేపట్టిన ప్లాస్టిక్ వాడకం, యోగా తరగతులు, రక్తదానం కార్యక్రమాలపై గవర్నర్ నివేదిక సమర్పించినట్టు తెలంగాణ సమాచార-ప్రజా సంబంధాల శాఖ తెలిపింది.
2019-10-15ప్రపంచవ్యాప్తంగా 5జి నెట్వర్క్ అభివృద్ధికోసం 60 కాంట్రాక్టులను కుదుర్చుకున్నట్టు చైనా టెలికం దిగ్గజం ‘హువావే టెక్నాలజీస్’ మంగళవారం వెల్లడించింది. అమెరికా నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ గ్లోబల్ టెలికాం క్యారియర్స్ చైనా కంపెనీపై చూపుతున్న విశ్వాసానికి ఈ కాంట్రాక్టులే నిదర్శనమని కంపెనీ 5జి ఉత్పత్తుల అధ్యక్షుడు యాంగ్ చావోబిన్ అభిప్రాయపడ్డారు. మొత్తం ఒప్పందాలలో 32 యూరప్ నుండి, 11 మధ్యప్రాచ్యం నుండి, 10 ఆసియా-పసిఫిక్ నుండి, 7 అమెరికా నుండి, 1 ఆఫ్రికా నుండి ఉన్నట్టు చెప్పారు.
2019-10-15 Read More