ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్ధి సంఘం (జె.ఎన్.యు.ఎస్.యు) అధ్యక్షురాలు అయిషా ఘోష్ పై ఆదివారం దాడి జరిగింది. ఆమె తలకు తీవ్రమైన గాయాలతో రక్తస్రావమైంది. ముసుగు ధరించిన గూండాలు తనపై దాడికి పాల్పడ్డారని, తీవ్రంగా కొట్టారని ఘోష్ చెప్పారు. ఎ.బి.వి.పి. నేతలే ఈ దాడి చేయించారని జె.ఎన్.యు.ఎస్.యు. నేతలు చెబుతున్నారు. ముసుగులో ఉన్న దుండగులు శబర్మతి హాస్టల్ లోకి చొరబడి విద్యార్ధులను కర్రలతో కొట్టారు.
2020-01-05 Read Moreటీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన పాలకమండలి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం గతంలోలా రెండు రోజులే అమలు చేయాలని నిర్ణయించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. ధనుర్మాస కైంకర్యాలు పూర్తయిన తర్వాత ఈ తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. వీవీఐపీల మహా లఘుదర్శనం పూర్తయిన తర్వాత సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు.
2020-01-05టాటా సన్స్ ఛైర్మన్ పదవి లేదా టిసిఎస్ డైరెక్టర్ పదవి తీసుకోవడానికి తాను ప్రయత్నించడంలేదని సైరస్ మిస్త్రీ ఆదివారం ప్రకటించారు. మిస్త్రీ తొలగింపునకు వ్యతిరేకంగా జాతీయ కంపెనీల లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్.సి.ఎల్.ఎ.టి) ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ ఉత్తర్వులను టాటా సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హియరింగ్ జరగాల్సి ఉండగా... మిస్త్రీ ఈ ప్రకటన చేశారు. అయితే, మైనారిటీ వాటాదారుల హక్కుల పరిరక్షణకోసం పని చేస్తానని మిస్త్రీ పేర్కొన్నారు.
2020-01-05‘‘అమెరికా ఇటీవలే మిలిటరీ పరికరాలపై 2 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ప్రపంచంలో మేమే అతి పెద్ద, ఇప్పటికీ గొప్ప శక్తి. ఇరాన్ ఒక అమెరికా స్థావరంపైన లేదా ఏ ఒక్క అమెరికన్ పైన దాడి చేసినా... మా సరికొత్త అందమైన ఆయుధాలు పంపుతాం. ఏ మాత్రం సంకోచం లేకుండా...’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం హెచ్చరించారు. ఇరాన్ టాప్ కమాండర్ సులేమానీని డ్రోన్ క్షిపణులతో హతమార్చిన నేపథ్యంలో ప్రతిదాడి తప్పని అంతా భావిస్తున్నారు.
2020-01-05రాజధానిని అమరావతి నుంచి తరలించే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు. లేకుంటే ఇదే నిర్ణయం ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర రాజకీయాల్లో తొలిసారి కులం ప్రాతిపదికన నిర్ణయాలు ఉంటున్నాయని వడ్డే ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇచ్చినవారు ఒకే కులం అని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.
2020-01-05దేశీయంగా రూపొందిన తేలికపాటి యుద్ధ విమానం ‘‘తేజస్’’ భవిష్యత్ రూపం వెల్లడైంది. రెండు ఇంజన్లతో కూడిన ఈ మోడల్ ఇప్పటినుంచి 12 సంవత్సరాల్లో మిగ్-29 జెట్ల స్థానాన్ని భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందుతోంది. నౌకాదళంలో విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి ‘డబుల్ ఇంజన్ తేజస్’ ఫైటర్లు పని చేస్తాయి. తేజస్ ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ (టి.ఇ.డి.బి.ఎఫ్), ఓమ్ని రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఒ.ఆర్.సి.ఎ) డిజైన్లను అధ్యయనం చేస్తున్నారు.
2020-01-05 Read More2016లో డీమోనెటైజేషన్ తరువాత 625 టన్నుల కొత్త కరెన్సీ నోట్లను భారత వైమానిక దళం రవాణా చేసిందని మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా తాజాగా వెల్లడించారు. 2016 నవంబర్ 8 రాత్రి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించాక కొత్త కరెన్సీని యుద్ధ ప్రాతిపదికన తరలించారు. "కోటి రూపాయలు ఒక 20 కిలోల సంచిలో వస్తే, మేము ఎన్ని కోట్లు తరలించామో నాకు తెలియదు." అని ముంబైలో ఓ కార్యక్రమంలో ధనోవా పేర్కొన్నారు.
2020-01-05 Read Moreరాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. ఫలితంగా అభివృద్ధిపై వ్యయాన్ని ప్రభుత్వం నిలిపేసింది. రాష్ట్ర ఆదాయం ఏటా పెరగవలసింది పోయి ఈసారి గత ఏడాది కంటే భారీగా తగ్గుదల నమోదైంది. 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో (నవంబర్ వరకు) వివిధ రూపాల్లో రాష్ట్ర ఖజానాలో పడిన సొమ్ములు రూ. 1,08,700 కోట్లు కాగా, 2019-20లో కేవలం రూ. 98,790 కోట్లు. గత ఏడాది కంటే ఇంత తగ్గడం ఆందోళనకరం.. ఆశ్చర్యం కూడా!
2020-01-05"సైనిక చర్యకు ప్రతిస్పందన సైనిక చర్యే" అని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి మాజిద్ తఖ్త్-రావంచీ స్పష్టం చేశారు. తమ దేశ టాప్ మిలిటరీ కమాండర్, భద్రత-ఇంటెలిజెన్స్ వ్యూహకర్త సులేమానీని అమెరికా హతమార్చిన నేపథ్యంలో మాజిద్ స్పందించారు. ‘‘అమెరికా 2018 మేలో ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభించింది. ఇప్పుడు మా టాప్ జనరల్స్ లో ఒకరిపై ఉగ్రవాదానికి పాల్పడి మిలిటరీ యుద్ధానికి శ్రీకారం చుట్టింది...మేము స్పందించక తప్పదు. స్పందిస్తాం’’ అని మాజిద్ చెప్పారు.
2020-01-05 Read Moreఇరాన్ టాప్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చిన నేపథ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. దేశ రాజధాని వాషింగ్టన్ సహా సుమారు 70 నగరాల్లో శనివారం యుద్ధ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి అమెరికా దాడిని, మద్యప్రాచ్యానికి 3,500 మంది సైనికులను పంపాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. అధ్యక్ష నివాసం ‘శ్వేతసౌధం’ నుంచి ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
2020-01-05 Read More