మహాత్మా గాంధీని నాథురాం గాడ్సే చంపిన చోట... తొలిసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించారు. గాంధీ తానొక సనాతన హిందువునని అనేకసార్లు చెప్పారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం చెప్పారు. గాంధీ అనేక ప్రయోగాలు చేశారని, కొన్ని విఫలమైనా...వాటికి తానే బాధ్యత తీసుకున్నారని భగవత్ పేర్కొన్నారు. ఈ రోజుల్లో నిరసనలు హింసాత్మకమైనా ఏ ఒక్కరూ బాధ్యత వహించడంలేదని పరోక్షంగా సిఎఎ వ్యతిరేక ఆందోళనకారులను ఆక్షేపించారు.
2020-02-17భారత ప్రభుత్వం ఆర్మీలో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలను నిరాకరించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కమాండ్ పోస్టింగ్స్’ ఇవ్వకపోవడానికి శారీరక పరిమితులు, సామాజిక బాధ్యతలను కారణాలుగా చూపడాన్ని తప్పు పట్టింది. మహిళలకూ ‘పర్మనెంట్ కమిషన్’ ఇవ్వాలన్న 2010 ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కేంద్రం అభ్యంతరాలను జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. తన తీర్పును అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి 3 నెలల గడువు ఇచ్చింది.
2020-02-17 Read More‘‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించజాలదు.. రాజ్యాంగ ధర్మాసనాలు ప్రజల రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తాయి. ఇది పాకిస్తాన్, ఇండియా కాదు’’- ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అథర్ మినల్లా వ్యాఖ్యలివి. పాకిస్తాన్ లోని పస్థూన్ తహఫుజ్ మూమెంట్ (పిటిఎం), అవామి వర్కర్స్ పార్టీ (ఎడబ్ల్యుపి) కార్యకర్తల బెయిల్ పిటిషన్లపై నిర్ణయం అనంతరం సోమవారం న్యాయమూర్తి ఇండియా ప్రస్తావన తెచ్చారు. అనుమతి తీసుకొని నిరసన తెలపాలని, ఇవ్వకపోతే కోర్టులు ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు.
2020-02-17 Read Moreప్రపంచ జనాభాలో 10 శాతం (76 కోట్ల మంది), చైనాలో సగానికి పైగా ‘కరోనా నిర్బంధం’లో ఉన్నారని ‘ఈనాడు.నెట్’ సోమవారం ప్రచురించింది. ‘కరోనా’ను కట్టడి చేయడానికి చైనా మావో తరహాలో సామాజిక నియంత్రణలను విధించిందన్న ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం దీనికి ఆధారంగా కనిపిస్తోంది. ‘కరోనా’ ప్రాంతాల పర్యవేక్షణకు చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ లక్షలాది మందిని నియమించాయని రాస్తూనే.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలంతా ‘నిర్బంధం’లో ఉన్నట్టు పొంతన లేకుండా రాశారు. ఆ వికృత కథనానికి కాపీ ‘ఈనాడు’ వార్త.
2020-02-17బ్రిటిష్ ఎంపీ డెబ్బీ అబ్రహమ్స్ (లేబర్ పార్టీ)ని దేశంలోకి అనుమతించడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. అది కూడా.. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత! డెబ్బీ కాశ్మీర్ పై ఏర్పాటైన ఓ బ్రిటిష్ పార్లమెంటరీ గ్రూపుకు నేతృత్వం వహించడమే ఇందుకు కారణం. గత ఆగస్టులో కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత, యు.కె.లోని భాతర హై కమిషనర్ కు అబ్రహమ్స్ ఓ లేఖ రాశారు. భారత ప్రభుత్వ చర్య కాశ్మీర్ ప్రజల విశ్వాసానికి ద్రోహం చేయడమేనని ఆమె పేర్కొన్నారు.
2020-02-17అనంతపురం జిల్లాలో సోమవారం ఉదయం ఓ చార్టర్డ్ ఫ్లైట్ అత్యవసరంగా పొలాల్లో దిగింది. సింగిల్ ఇంజన్ తో నడిచే సిర్రస్ ఎస్.ఆర్.22 (విటి-విడిఎన్) విమానం అది. కర్నాటక సరిహద్దుకు సమీపంలోని ఎరడికెర గ్రామం (బ్రహ్మసముద్రం మండలం)లోని పొలాల్లో ఈ చార్టర్డ్ విమానం దిగింది.
2020-02-17 Read More2020 కేలండర్ సంవత్సరంలో ఇండియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాను ‘మూడీస్’ ఇన్వెస్టర్ సర్వీసెస్ బాగా తగ్గించింది. ఈ ఏడాది జీడీపీ 6.6 శాతం వృద్ధి చెందుతుందని గతంలో అంచనా వేసిన ‘మూడీస్’, తాజాగా దాన్ని 5.4 శాతానికి తగ్గించింది. ఆర్థిక మందగమనం నుంచి ‘రికవరీ’ కూడా నెమ్మదిగానే జరుగుతుందని తాజాగా వెలువరించిన ‘గ్లోబల్ మేక్రో ఔట్ లుక్’లో పేర్కొంది. 2021లోనూ జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతం దాటదని పేర్కొనడం గమనార్హం. ఆ ఏడాది 6.7 శాతం ఉంటుందని గతంలో అంచనా వేసింది.
2020-02-17 Read Moreచైనాలో కరోనా కేసుల సంఖ్య 70,548కి పెరిగింది. ఇప్పటిదాకా 1,770 మంది మరణించారు. మరో 10,644 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం 105 మంది మృత్యువాత పడగా, వ్యాధి నయమై 1,425 మంది డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి వైరస్ నుంచి విముక్తులైనవారి సంఖ్య 10,844కు చేరింది. సీరియస్ కేసులు తగ్గడం (ఆదివారం 628) మరో శుభవార్త. అయితే, కొత్త కేసులు ఇంకా భారీగానే (2,048) వస్తున్నాయి. వైరస్ నిర్ధారణ అయినవారు, వారితో దగ్గరిగా మెలిగినవారు కలిపి 1,50,539 మంది వైద్య నిఘాలో ఉన్నారు.
2020-02-17‘‘కరోనా’ ఓ వైరస్ కాదు. ఓ అవతారం’’ అంటున్నాడు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు ‘స్వామి’ చక్రపాణి. మాంసాహారులను శిక్షించి, ఇతర జీవులను రక్షించడానికి అవతరించిందట! నరసింహ స్వామి రాక్షసుడిని సంహరించినట్టే.. జంతువులను హింసిస్తున్న చైనీయులకు ఓ పాఠం నేర్పడానికి ‘కరోనా’ అవతరించిందని ఈ ‘స్వామి’ చెప్పుకొచ్చాడు. ఈ పైత్యం అంతటితో ఆగలేదు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కరోనాకు ఒక విగ్రహాన్ని సృష్టించి క్షమాపణ వేడుకోవాలని కూడా చెప్పాడు ఈ స్వామి.
2020-02-16చైనాలోని 31 ప్రావిన్సులలో ‘కరోనా వైరస్’తో మరణించిన వారి సంఖ్య 1,665కు చేరింది. వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య 68,500కు పెరిగింది. వారిలో9,419 మందికి నయమై ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 11,272 మందికి వైరస్ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం 2,009 మందికి కొత్తగా వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా మరో 1,918 అనుమానిత కేసులు నమోదయ్యాయి. 142 మంది చనిపోయారు. డిశ్చార్జి అయ్యేవారి సంఖ్య రోజు రోజుకూ పెరగడం ఓ గుడ్ న్యూస్. ఆదివారం 1,323 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
2020-02-16