రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ భద్రతను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా 1+1గా ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని 4+4కి పెంచారు. నిన్న (మార్చి 18న) రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసినట్టుగా ఉన్న ఓ లేఖలో భద్రతపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఈ లేఖ అంశమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లతో సమావేశమయ్యారు. రమేష్ కమార్ కుటుంబానికి భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.
2020-03-19సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ గురువారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జస్టిస్ రంజన్ గొగోయ్ ని రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకార సమయంలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. రంజన్ గొగోయ్.. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం, బాబ్రీమసీదు- రామజన్మభూమి వివాదం వంటి ముఖ్యమైన అంశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, బిజెపి రాజకీయ ఎజెండాకు అనుకూలంగా తీర్పులు ఇచ్చారన్న తీవ్రమైన విమర్శలు ఉన్నాయి.
2020-03-19‘కరోనా’ భయాల మధ్య తెలంగాణలో పదో తరగతి పరీక్షలు గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఎక్కువ మంది గుమి కూడే అన్ని ప్రాంతాలనూ మూసివేసి, ఈవెంట్లను నియంత్రిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. టెన్త్ పరీక్షలను మాత్రం అనేక జాగ్రత్తలతో నిర్వహిస్తోంది. ప్రభుత్వ సూచనతో విద్యార్ధులు పెద్ద సంఖ్యలో మాస్కులతో హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద డాక్టర్లను, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. జలుబు, దగ్గుతో వచ్చే విద్యార్ధుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.
2020-03-19స్టాక్ మార్కెట్ల పతనం ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసికి భారీ నష్టాలను తెచ్చిపెడుతోంది. లిస్టెడ్ కంపెనీలలో జీవిత బీమా కార్పొరేషన్ ఈక్విటీ పెట్టుబడుల విలువ 2019 డిసెంబరు చివరికి రూ. 6.02 లక్షల కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ. 4.14 లక్షల కోట్లకు తగ్గింది. రూ. 1.88 లక్షల కోట్లు (31 శాతం) తగ్గింది. 209 కంపెనీలను అధ్యయనం చేసినప్పుడు.. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలలో రూ. 56,810 కోట్లు నష్టం తేలింది. తర్వాత ఆయిల్ & గ్యాస్ (రూ. 36,020 కోట్లు), సిగరెట్ కంపెనీలు (రూ. 17,374 కోట్లు), ఐటి (రూ.15,826 కోట్లు), మెటల్స్ (రూ.12,045 కోట్లు), ఆటోమొబైల్ (రూ.11,329 కోట్లు) రంగాలు ఎక్కువ నష్టాలను మిగిల్చాయి.
2020-03-19 Read Moreరోజువారీ పతనంతో నిన్న 30 వేల పాయింట్ల దిగువకు పడిపోయిన బిఎస్ఇ సెన్సెక్స్, గురువారం మరింత దిగజారింది. ఓ దశలో 1870 పాయింట్లు పడిపోగా ప్రస్తుతం 1600 పాయింట్ల నష్టంతో 27,270 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. గత 38 నెలల్లో ఇదే కనిష్ఠం. ఎన్ఎస్ఇ నిఫ్టీ 8000 పాయింట్ల దిగువకు (7,900) పతనమైంది. 2016 డిసెంబర్ 27 తర్వాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే ప్రథమం. బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ అత్యధికంగా 13 శాతం పడిపోయాయి. కోటక్ మహీంద్రా, ఇండస్ ల్యాండ్ బ్యాంక్ 10 శాతం, హెచ్.డి.ఎఫ్.సి. ద్వయం 7 శాతం చొప్పున తగ్గిపోయాయి.
2020-03-19 Read More‘కరోనా వైరస్’ యువతలో వ్యాప్తి చెందుతోందని ఇటలీ, ఫ్రాన్స్ నుంచి వస్తున్న రిపోర్టులపై శ్వేతసౌథం ఉన్నతాధికారి డాక్టర్ డెబోరా బిర్క్స్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం శ్వేతసౌథంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కరోనా వైరస్’ ప్రభావం వృద్ధులపైనే ఎక్కువని, యువతపై అంతగా ఉండదని ఇప్పటిదాకా నమ్ముతున్నారు. అయితే ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో కొంతమంది యువత వైరస్ సోకి తీవ్రంగా జబ్బుపడ్డారని, ఐసియులలో ఉన్నారని డెబోరా చెప్పారు. 25-39 వయసు గ్రూపులో ఉన్నవారు తెలియకుండానే ‘కరోనా’ను ఇతరులకు వ్యాపింపజేస్తూ ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు.
2020-03-19‘కరోనా వైరస్’ కరాళ నృత్యం 18 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని ‘అమెరికా ప్రభుత్వ కోవిడ్19 ప్రతిస్పందన ప్రణాళిక’లో నిపుణులు హెచ్చరించారు. వైరస్ వ్యాప్తి, తీవ్రతలను అంచనా వేయడం కష్టమంటూనే.. దఫదఫాలుగా విరుచుకుపడవచ్చని పేర్కొన్నారు. ఈ 100 పేజీల ప్రణాళిక కాపీ అందిన రోజే (మార్చి 13న) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘జాతీయ ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. కోవిడ్19 దీర్ఘ కాలం కొనసాగితే దేశంలో వినియోగదారులకు సరుకుల కొరత ఏర్పడటంతో పాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూడా దెబ్బ తింటుందని ప్రణాళికలో పేర్కొన్నారు.
2020-03-19స్థానిక ఎన్నికల వాయిదాను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పును సిపిఎం స్వాగతించింది. ‘కరోనా’ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రభుత్వ బాధ్యతను ఈ తీర్పు సూచిస్తున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని కదిలించి ‘కరోనా’ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే పనులు కోల్పోయిన కూలీలు, వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు ఇళ్ల వద్దనే ఉండవలసిన పరిస్థితుల్లో ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని మధు ప్రభుత్వాన్ని కోరారు.
2020-03-19పంగోలిన్ పొలుసులను దొంగ రవాణా చేస్తూ పట్టుబడిన ఓ చైనా మహిళకు ఏడేళ్ళు జైలు శిక్ష పడింది. 2017లో నవంబర్ 26, 2018 మే 18 తేదీల్లో లి అనే మహిళ ఇతరులతో కలసి పంగోలిన్ పొలుసులతో విదేశాల నుంచి షాంగై ప్రయాణించింది. పుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 110.45 కేజీల పొలుసులను స్వాధీనం చేసుకున్నారు. ‘కరోనా వైరస్’ పంగోలిన్ల నుంచి మనుషులకు సంక్రమించి ఉండొచ్చని చైనా పరిశోధకులు ఈ మధ్యనే పేర్కొన్నారు. ఈ స్మగ్లింగ్ సమయానికి ‘కరోనా వైరస్’ అనేది ఉందని తెలియకపోయినా.. శిక్ష విధింపులో మాత్రం ఆ ప్రభావం ఉన్నట్టు భావిస్తున్నారు.
2020-03-19‘ఈ నెల 13న ఓ ‘కరోనా’ పేషెంట్ రైలు నెం. 12708లో ఢిల్లీ నుంచి రామగుండం ప్రయాణించారు. ఆ రోజు సంపర్క్ క్రాంతి రైలు ఎస్9 బోగీలో ప్రయాణించినవారు పరీక్ష చేయించుకోండి’.. బుధవారం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన అలర్ట్ ఇది. ఆ బోగీలో ప్రయాణించిన 82 మంది వివరాలను కేంద్ర రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. ఆ పేషెంట్ ఓ 10 మందితో కలసి ప్రయాణించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. రైల్వే బోగీల శుద్ధి, ప్రయాణీకుల థర్మల్ స్క్రీనింగ్ వంటి చర్యలపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి పెట్టింది.
2020-03-19 Read More