120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమతి ఆధిపత్యాన్ని చాటింది. 2727 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల వివరాలివి. టి.ఆర్.ఎస్.కు 1352, కాంగ్రెస్ పార్టీకి 429, బిజెపికి 197, ఎంఐఎంకు 53 వార్డులు దక్కగా.. ఇతరులు, ఇండిపెండెంట్లు 267 వార్డులు కైవశం చేసుకున్నారు. 100కు పైగా మున్సిపాలిటీలలో గులాబి జెండా ఎగరనుంది.
2020-01-25శీతాకాల సెమిస్టర్ ఫీజులను పాత హాస్టల్ మాన్యువల్ ప్రకారమే చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు విద్యార్ధులకు సూచించింది. ఇప్పటిదాకా చెల్లించని వారికి వారం రోజులు గడువు ఇచ్చింది. జె.ఎన్.యు. అధికారులు ఫీజులు పెంచడంపై విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్, ఇతర నేతలు కోర్టును ఆశ్రయించారు. వారి విన్నపంపై విచారణ జరిపిన హైకోర్టు...ప్రభుత్వం ఉన్నత విద్య నుంచి వైదొలగరాదని, ప్రభుత్వ విద్యకు రాజ్యమే నిధులు సమకూర్చాలని స్పష్టం చేసింది.
2020-01-25‘‘అధిక పన్నులు ప్రభుత్వం ద్వారా ప్రజలకు జరిగే సామాజిక అన్యాయం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే వ్యాఖ్యానించారు. ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ 79వ వార్షికోత్సవ సందర్భంగా జస్టిస్ బాబ్డే శుక్రవారం ఢిల్లీలో ఓ సభలో మాట్లాడారు. పన్ను ఎగవేతను సాటి పౌరుల పట్ల చేసే సామాజిక అన్యాయంగా ఆయన అభివర్ణించారు.
2020-01-25 Read Moreటర్కీ తూర్పు భాగంలో కొద్దిసేపటి క్రితం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.8గా నమోదైంది. భూమికి కేవలం 2 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. డొగన్యోల్ పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.
2020-01-24‘కరోనా వైరస్’ బాధితులకోసం చైనా యుద్ధ ప్రాతిపదికన ఓ ఆసుపత్రిని నిర్మిస్తోంది. కేవలం ఆరు రోజుల్లో పూర్తి చేసేలా వుహాన్ నగరంలో సరికొత్త ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించింది. వైరస్ సోకిన అందరినీ ఈ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వసతులతో చికిత్స అందిస్తారు. వుహాన్ నగరం నుంచే ‘కరోనా వైరస్’ వ్యాపించింది. శుక్రవారం ఉదయం వరకు 870 మందికి సోకినట్టు నిర్ధారించారు. వుహాన్ సహా 3 కోట్ల జనాభా గల 10 నగరాల నుంచి మిగిలిన చైనాకు రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు.
2020-01-24ఇండియాలో 5జి ఫోన్ ఈ ఫిబ్రవరిలోనే మార్కెట్ లోకి రానుంది. అయితే, అది చైనా కంపెనీ ‘ఐకూ’ ద్వారా కావడం విశేషం. 2020లో 10 లక్షల 5జి స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విక్రయించాలన్న లక్ష్యాన్ని ‘ఐకూ’ నిర్దేశించుకుంది. ఆన్ లైన్లో విక్రయించే ఈ 5జి ఫోన్ ధర ఎంతో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అత్యాధునిక ఫీచర్లతో 5జి, 4జి రకాలను ‘ఐకూ’ విడుదల చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత ప్రభుత్వం ఏప్రిల్-జూన్ కాలంలో 5జి స్పెక్ట్రం వేలాన్ని నిర్వహించనుంది.
2020-01-24‘కరోనా వైరస్’ చైనాలో శుక్రవారం వరకు 26 మందిని బలి తీసుకుంది. 800 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 10 నగరాలకు రవాణా సౌకర్యాలను నిలిపివేసింది. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలను, చారిత్రక ప్రదేశం ‘ఫర్బిడెన్ సిటీ’ని, ‘చైనా మహా కుఢ్యం’లో కొంత భాగాన్ని మూసివేసింది. చైనా చాంద్రమాన నూతన సంవత్సర వేళ కోట్లాది మంది ప్రయాణాలు సాగిస్తారు. ఈ సందర్భంగా వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది.
2020-01-24 Read More2019-20లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 2018-19 కంటే 10% తగ్గుతాయని ఆదాయ పన్ను శాఖ అంచనా వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుదేలైన తరుణంలో కార్పొరేట్ పన్ను రాయితీ ఇవ్వడం ఇందుకు కారణం. ఏటేటా పెరుగుతున్న ఆదాయం క్రితం ఏడాది కంటే తగ్గడం.. రెండు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి! 2018-19లో ప్రత్యక్ష పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 11.5 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది రూ. 13.5 లక్షల కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా..జనవరి 23 వరకు కేవలం రూ. 7.3 లక్షల కోట్లు వచ్చాయి.
2020-01-24 Read Moreఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, అచ్ఛెన్నాయుడు గవర్నరును కలసినవారిలో ఉన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులపై అణచివేత చర్యలు, శాసన మండలి ఛైర్మన్.. ఇతర సభ్యుల పట్ల మంత్రులు వ్యవహరించిన తీరు తదితర పరిణామాలను గవర్నరుకు వివరించారు.
2020-01-24తన స్వార్ధంకోసం చంద్రబాబు కౌన్సిల్ ప్రతిష్ఠను మంటగలిపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి విమర్శించారు. విజయసాయి శుక్రవారం వివిధ ట్వీట్లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ‘‘ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నాడు. పప్పునాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. యనమల లాంటి తిరస్కృతులకు చరమాంకం చేదు జ్ఞాపకంగా మిగులుతుంది’’ అని విజయసాయి పేర్కొన్నారు.
2020-01-24