తెలుగుదేశం పార్టీ ఇక ఆంధ్రప్రదేశ్ గతంలోనే ఉంటుందని, వర్తమానంలో ఆ పార్టీ నుంచి నేతలంతా తమవద్దకు చేరుతున్నారని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాంమాధవ్ ‘ఏపీ గతం టీడీపీ.. వర్తమానం వైసీపీ.. భవిష్యత్తు బీజేపీ’ అని గంటాపథంగా చెప్పారు. భారతదేశపు వర్తమానం, భవిష్యత్తు కూడా నరేంద్ర మోదీయేనని ఉద్ఘాటించారు.
2019-07-24ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి బుధవారం బీజేపీలో చేరిన సందర్భంగా రాంమాధవ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడవక ముందే ముఖ్యమంత్రి (జగన్) వీరంగం వేస్తున్నారని రాంమాధవ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రజలు భయపడే రోజులు వస్తున్నాయనిపిస్తోందని పేర్కొన్నారు.
2019-07-24‘ఫేస్ బుక్’ 2019 రెండో త్రైమాసికంలో ఏకంగా 16.62 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.18 లక్షల కోట్లు) ఆదాయాన్ని సంపాదించింది. అందులో రూ. 1.16 లక్షల కోట్లు వాణిజ్య ప్రకటనల ఆదాయమే. వ్యయం 12.26 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 88 వేల కోట్లు) కాగా పన్ను చెల్లింపుల తర్వాత నికర ఆదాయం 2.6 బిలియన్ డాలర్లుగా (రూ. 15 వేల కోట్లక పైనే) తేలింది. గత ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే మొత్తం ఆదాయంలో 3.6 బిలియన్ డాలర్లు (28 శాతం) పెరుగుదల ఉండటం విశేషం.
2019-07-25 Read More‘కష్టకాలంలో ఆదుకునేవాడే కామ్రేడ్’ అని నటుడు విజయ్ దేవరకొండ చెప్పారు. ఈ యువ సంచలనం నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఈ నెల 26వ తేదీన దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ విడుదల కానుంది. చిత్రం ప్రమోషన్లో భాగంగా విజయ్ దేవరకొండ, కథానాయిక రష్మిక మందన బుధవారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన సభలో విజయ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా మీ అందరికీ అంకితమిస్తున్నా..నా కామ్రేడ్లకు..’’ అని అభిమానులతో చెప్పారు.
2019-07-24‘‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో కాశ్మీర్ అంశంపై చర్చే రాలేదు. ఆ అంశంపై మధ్యవర్తిత్వం ప్రశ్నే లేదు’’ అని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం లోక్ సభలో స్పష్టం చేశారు. ట్రంప్ చెప్పిన విషయంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టిన కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసి వెళ్లిపోయాక, రాజ్ నాథ్ సింగ్ ఈ అంశంపై మాట్లాడారు.
2019-07-24 Read Moreఆంధ్రప్రదేశ్ గవర్నరుగా బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ (ఇంతకు ముందు సిఎం క్యాంపు కార్యాలయం)లో బిశ్వభూషణ్ చేత ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేయించారు. సిఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విభజిత ఏపీకి బిశ్వభూషణ్ తొలి పూర్తి స్థాయి గవర్నర్. ఇదివరకు ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి గవర్నరుగా నరసింహన్ వ్యవహరించారు.
2019-07-24 Read Moreప్రపంచ బ్యాంకు తర్వాత ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు (ఎఐఐబి) కూడా అమరావతి సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుకు రుణాన్ని నిరాకరించింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు తమ పరిశీలనలో లేదని ఎఐఐబి అధికార ప్రతినిధి లారెల్ ఓస్ట్ ఫీల్డ్ మంగళవారం రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు $300 మిలియన్లు, ఎఐఐబి $200 బిలియన్లు రుణం ఇవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను విరమించుకోవడంతో రెండు బ్యాంకులూ తప్పుకొన్నాయి.
2019-07-23కర్నాటకలో అధికార కాంగ్రెస్- జెడిఎస్ కూటమినుంచి 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశాక నెలకొన్న రాజకీయ సంక్షోభానికి మంగళవారం తెరపడింది. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి విశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో మంగళవారం రాత్రి నిర్వహించిన విశ్వాస పరీక్షలో కుమారస్వామికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు నమోదయ్యాయి. ఓటమి తర్వాత గవర్నర్ వాజూభాయ్ వాలాను కలసిన కుమారస్వామి రాజీనామా సమర్పించారు.
2019-07-23కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మన ప్రధాని నరేంద్ర మోదీ కోరలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు. నిన్న ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో చెప్పిన మాటకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. ట్రంప్ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలన వార్తగా మారగా.. దేశీయంగా భారత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జైశంకర్ మంగళవారం పార్లమెంటులో వివరణ ఇచ్చారు.
2019-07-23మంగళవారం స్వాతంత్ర సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు జాతి నివాళి అర్పించినట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) పేర్కొంది. అయితే, ట్విట్టర్లో ఈ సంక్షిప్త సమాచారానికి భగత్ సింగ్ ఫొటోను జోడించి షేర్ చేసింది. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్.. అసాధారణ సాహసం, త్యాగాలతో దేశమంతటా స్వాతంత్ర కాంక్షను రగిలించారు. అలాంటి యోధులను గుర్తు పట్టలేని స్థితిలో భారత సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన పిఐబి ఉండటమే ఇక్కడ విషాధం.
2019-07-23