అమెరికాలో ఓ మిలిటరీ చార్టర్డ్ విమానం (బోయింగ్ 737) ఫ్లోరిడాలో ‘రన్ వే’పై దిగబోయి నదిలోకి జారిపోయింది. ఆ సమయంలో విమానంలో 136 మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ప్రాణ నష్టం జరగలేదు కానీ, 21 మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ విమానం క్యూబాలోని ‘గ్వాంటనామో బే’ నుంచి ప్రతి మంగళవారం, శుక్రవారం జాక్సన్ విల్లే, అక్కడినుంచి నోర్ ఫ్లోక్ (వర్జీనియా) వస్తుంది. గ్వాంటనామోలో ఉన్న అమెరికా స్థావరంలో పని చేసే మిలిటరీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఈ విమానంలో ప్రయాణిస్తుంటారు.
2019-05-04 Read Moreఅస్థిర ‘డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’లో ఎబోలా వైరస్ మారణహోమాన్ని సృష్టిస్తోంది. ఇటీవల వైరస్ వ్యాప్తికి 1008 మంది ప్రజలు మరణించారని కాంగో ఆరోగ్య శాఖ శుక్రవారం రాత్రి ప్రకటించింది. 2014-16 మధ్య పశ్చిమ ఆఫ్రికా అంతటా ఎబోలా వ్యాపించి 11,300 మందిని బలి తీసుకుంది. ఇప్పుడు కాంగోలో రెండో పెద్ద మారణహోమాన్ని సృష్టించింది. అంతర్యుద్ధం, నివారణ చర్యలపై ప్రజల్లో ఉన్న నిర్లిప్తత, మరణించినవారిని జాగ్రత్తగా ఖననం చేయకపోవడం వైరస్ వ్యాప్తికి కారణాలుగా చెబుతున్నారు. 40 ఏళ్లలో కాంగోలో ఎబోలా వ్యాపించడం ఇది 10వసారి.
2019-05-04 Read Moreలోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కించడానికి ఇంకా 18 రోజుల 18 గంటల సమయం ఉంది. 7 దశల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో నాలుగు దశల పోలింగ్ ఇప్పటికి పూర్తయింది. 374 లోక్ సభ సీట్లలో పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తొలి దశలోనే (ఏప్రిల్ 11న) ముగిసింది. లోక్ సభ ఎన్నికల్లో మిగిలిన మూడు దశల పోలింగ్ మే 6, 12, 19 తేదీల్లో జరగాల్సి ఉంది. ఆ తర్వాత నాలుగు రోజులకు మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసెంబ్లీకి ఓటు వేశాక ఫలితాలకోసం ఆరువారాల పాటు వేచి చూడవలసి వస్తోంది.
2019-05-04ప్రధానమంత్రి మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ఏడు ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ గత నాలుగు రోజుల్లో కొట్టిపారేసింది. అయితే, అందులో ఐదు ఫిర్యాదుల విషయంలో క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కమిషన్ లోని ఓ అధికారి వ్యతిరేకించినట్టు సమాచారం. ఫిర్యాదులను పరిశీలించిన ‘‘ఫుల్ కమిషన్’’లో ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఉన్నారు. మోదీపై 5, ‘షా’పై 2 ఫిర్యాదులను వారు పరిశీలించారు. మోదీపై 4, ‘షా’పై 1 ఫిర్యాదుల విషయంలో ఒక కమిషనర్ మిగిలిన ఇద్దరితో విభేదించారు.
2019-05-04 Read Moreరాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో పురోగతిని ప్రధానమంత్రి కార్యాలయం ‘‘పర్యవేక్షించడం’’, ‘‘సమాంతరం సంప్రదింపులు’’ చేపట్టడంగా చూడరాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. శనివారం సుప్రీంకోర్టుకు ఇచ్చిన 13 పేజీల సమాధానంలో మోదీ ప్రభుత్వం ఈ వాదనను వినిపించింది. ప్రభుత్వం, ప్రభుత్వం మధ్య జరిగే ప్రక్రియలో ప్రధానమంత్రి కార్యాలయ పర్యవేక్షణను ‘‘జోక్యం’’ లేదా ‘‘సమాంతర సంప్రదింపులు’’గా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పిటిషనర్ల వాదన, దేశ భద్రత విషయంలో ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమేనని రక్షణ శాఖ ఆరోపించింది.
2019-05-04 Read Moreఎన్నికల ప్రచారంలో సైనిక బలగాల ప్రస్తావన తెస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై వచ్చిన మరో రెండు ఫిర్యాదులను కూడా ఈసీ తోసిపుచ్చింది. దీంతో..మొత్తం ఐదు ఫిర్యాదుల్లో మోదీకి క్లీన్ చిట్ ఇచ్చినట్టయింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై వచ్చిన రెండు ఫిర్యాదులను, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వచ్చిన ఓ ఫిర్యాదును కూడా ఈసీ శుక్రవారం కొట్టిపారేసింది. గత నెల 22న అమిత్ షా బెంగాల్ కృష్ణనగర్ ఎన్నికల సభలో ఎయిర్ ఫోర్సును ‘‘మోదీ వాయుసేన’’గా అభివర్ణించారు. గతంలో యుపి సిఎం యోగి భారత సైన్యాన్ని ‘‘మోదీ సేన’’గా వ్యవహరించడాన్ని ఈసీ తప్పు పట్టడం గమనార్హం.
2019-05-03 Read Moreఎన్నికల నిబంధనవాళి పేరు చెప్పి ఉద్యోగ నియమావళిని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ‘ఫని’ తుపాను సహాయ చర్యలపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సిఎం బదులిచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమీక్షలు చేసే అధికారం లేదని, అధికారులు తమకు రిపోర్టు చేయకూడదని ఎన్నికల నిబంధనావళిలో ఎక్కడుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వచ్చే వారం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నానని, చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
2019-05-03రూ. 9,200 కోట్లు ఖర్చు చేసింది కేవలం ఐదు పోలింగ్ స్టేషన్లలోని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించడానికా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, ప్రతి నియోజకవర్గంలోనిన 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న డిమాండ్ ను పునరుద్ఘాటించారు. 5 పోలింగ్ స్టేషన్లలో వీవీ ప్యాట్ స్లిప్పులలో లెక్క తేడా వస్తే మిగిలిన స్టేషన్లలో కూడా లెక్కించాలని ఈసీని కోరారు.
2019-05-03తుపాను ‘ఫని’ శ్రీకాకుళం జిల్లాలోని 14 మండలాలపై ప్రభావం చూపిందని, వాటిలోని 9 మండలాల్లో సాధారణ స్థితిని తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇంకా 325 గ్రామాల్లో సాధారణ స్థితిని తేవలసి ఉందని.. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈదురు గాలులకు 2,129 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, 218 సెల్ టవర్లు దెబ్బ తిన్నాయని, 553 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, 232 పునరావాస కేంద్రాల్లో 1,14,544 మందికి భోజన సదుపాయం కల్పించామని చంద్రబాబు చెప్పారు.
2019-05-03తమిళనాడులో మే 5వ తేదీన ‘ట్రేడర్స్ డే’ సందర్భంగా మెజారిటీ షాపులు మూతపడతాయి కాబట్టి ఆ రోజు పాలకు కొరత ఏర్పడే అవకాశం ఉందని పాల డీలర్లు, ఉద్యోగుల సంక్షేమ సంఘం హెచ్చరించింది. ప్రజలు శనివారం రోజే పాలను కొని నిల్వ ఉంచుకోవాలని సూచించింది. తమిళనాడులో రోజూ సుమారు కోటిన్నర లీటర్ల చొప్పున పాల వినియోగం ఉంది. అందులో ఎక్కువ భాగం షాపుల ద్వారానే అమ్మకం అవుతోంది. మే 5వ తేదీన 50 శాతం అమ్మకాలపై ‘ట్రేడర్స్ డే’ ప్రభావం ఉంటుందని అంచనా.
2019-05-03 Read More