విశాఖపట్నం మెట్రో కింద గతంలో ప్రతిపాదించిన 42.55 కి.మీ.కు మరో 37.36 కి.మీ జోడించి లైట్ మెట్రో ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 79.9 కి.మీ. పొడవున ‘లైట్ మెట్రో’కోసం సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం అధికారులను ఆదేశించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి 60.20 కి.మీ. పొడవున ట్రామ్ వ్యవస్థను నడపాలని నిర్ణయించారు.
2020-02-07ఇండియన్ ఆర్మీ మేజర్ అనూప్ మిశ్రా ప్రపంచంలోనే తొలి ‘బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్’ను సృష్టించారు. ఎకె47తో 10 మీటర్ల దూరం నుంచి కాల్చిన తూటాలను సైతం ఈ హెల్మెట్ ఆపగలదని అనూప్ చెప్పారు. ‘ప్రాజెక్ట్ అభేద్య’లో భాగంగా అనూప్ ఈ హెల్మెట్ రూపొందించారు. గతంలో స్నైపర్ బుల్లెట్ల నుంచి కాచుకోవడానికి ఓ ఫుల్ బాడీ జాకెట్ ను అనూప్ రూపొందించారు. ‘ఆర్మీ కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్’కు చెందిన అనూప్ గతంలో కాలం చెల్లిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తో కాల్పులకు గురయ్యారు.
2020-02-07 Read Moreబెంగాల్ తూర్పు మిడ్నపూర్ జిల్లా రైతులు ఏటా రూ. 100 కోట్ల విలువైన పీతలు, రూ. 2000 కోట్ల విలువైన రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. పెద్ద మొత్తంలో పీతలను చైనా చాంద్రమాన నూతన సంవత్సర ఉత్సవాల సందర్భంగా ఎగుమతి చేస్తారు. అయితే, ఈ ఏడాది ఆ సందర్భానికి ముందే ‘కరోనావైరస్’ చైనాపై పడగ విప్పింది. ఫలితంగా ఎగుమతులు నిలిచిపోయి మిడ్నపూర్ రైతులు కోట్లలో నష్టపోయారు. ఆదాయాలు దాదాపు 50 శాతం తగ్గాయని చెబుతున్నారు.
2020-02-07 Read Moreకేరళ బడ్జెట్ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీ కేంద్రానికి ఓ రాజకీయ సందేశం పంపింది. బడ్జెట్ ప్రసంగం మళయాళ కాపీ అట్టపైన ‘‘గాంధీ మరణం’’ చిత్రాన్ని ప్రదర్శించారు ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్. కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోందని చెప్పారు. ‘‘సందేశం ఇదే..మాకు గుర్తుంది. మహాత్ముడు హత్యకు గురయ్యాడు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పూజించే హిందూ మతవాదులచేత హత్యగావించబడ్డాడు. ప్రజలు మరువరు’’ అని ఇసాక్ ఉద్ఘాటించారు.
2020-02-07కరోనా వైరస్ భయం అనేక కార్యక్రమాలు, కార్యకలాపాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరగనున్న బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్ షిప్ పోటీ నుంచి భారత మహిళల జట్టు వైదొలగింది. అయితే, పురుషుల జట్టు మాత్రం పాల్గొంటోంది. ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు ఆసియా చాంపియన్ షిప్ పోటీలు జరుగుతాయి. తొలుత సైనా నెహ్వాల్, పి.వి. సింధు తప్పుకోగా... తర్వాత మొత్తం టీమ్ వైదొలగింది.
2020-02-07 Read Moreఒడిషాలోని కేంద్రపారాలో ఓ 21 సంవత్సరాల యువతి వరకట్నానికి బలైంది. రష్మితా సాహు అనే యువతి 60 శాతం కాలిన గాయాలతో కటక్ లోని ఎస్.సి.బి. మెడికల్ కళాశాల ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతోంది. గురువారం రాత్రి ఆమె మరణించినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. అత్తింటివారు ఆమెను మంచానికి కట్టేసి నిప్పు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ కేసులో బాధితురాలి అత్తమామలను, ఆడపడుచును పోలీసులు అరెస్టు చేశారు.
2020-02-07తిరుపతి అడవుల్లో ఎర్ర చందనం ‘స్మగ్లింగ్’కు పాల్పడుతున్న ఇద్దరిని శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు ఎస్.యు.వి.లను అటకాయించి 70 ఎర్ర చందనం దుంగలను, ఆయా కార్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల కొండల పాదాల వద్ద అలిపిరి సమీపంలోని ఎన్.సి.సి. ఫైర్ రేంజ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
2020-02-07ఈ నెల 13వ తేదీన నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రోజు ముందుకు మార్చింది. 12వ తేదీ (బుధవారం)నే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు అన్ని శాఖలకు శుక్రవారం సవరించిన నోటీసును పంపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రివర్గం సమావేశం కాబోతోంది.
2020-02-07చైనాలో 636 మంది మరణానికి కారణమైన ‘కరోనా వైరస్’ గబ్బిలాల నుంచి మనుషులకు సోకి ఉండొచ్చని ఇప్పటిదాకా అనుకుంటున్నారు. అయితే, పంగోలిన్ అనే క్షీరదం ఇందుకు కారణమని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం దాదాపు నిర్ధారణకు వచ్చింది. వైరస్ వ్యాప్తి నిరోధం, నియంత్రణకు తమ పరిశోధన దోహదపడుతుందని వర్శిటీ శుక్రవారం పేర్కొంది. ప్రపంచంలో అత్యధికంగా స్మగ్లింగ్ కు గురవుతున్న క్షీరదం పంగోలిన్. పంగోలిన్ పైన ఉండే పొలుసులు, మాంసానికి గిరాకీ ఎక్కువ.
2020-02-07ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ గ్రామ స్థాయి ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తున్నాడని బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ఒకప్పుడు కాశ్మీర్, బీహార్ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారని, ఇప్పుడు ఏపీ పరిస్థితి ఆయా రాష్ట్రాల కంటే ఘోరంగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ రాష్ట్రం గురించి సమీక్ష చేయవలసిన అవసరం ఉందని బైరెడ్డి అభిప్రాయపడ్డారు. సిఎంను ఉద్ధేశించి ‘‘ఈకోతి ఏపీ అనే వనాన్ని సర్వ నాశనం చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.
2020-02-07