జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) సవరణకోసం సరికొత్తగా సమాచారం సేకరించనున్నారు. 2010లో తొలిగా చేపట్టిన ప్రక్రియలో 119 కోట్ల మంది వివరాలు సేకరించారు. 2020లో చేపట్టే ఎన్.పి.ఆర్.లో అదనపు వివరాలను కోరనున్నారు. అందులో తల్లిదండ్రుల పుట్టుక ఎక్కడ? ఎప్పుడు? అనే వివరాలను కూడా పౌరులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ఇంటింటి వద్దా ధృవీకరించుకుంటారు.
2019-12-27గురువారం సూర్యగ్రహణాన్ని ప్రపంచలోని అనేక ప్రాంతాలనుంచి పెద్ద మొత్తంలో ప్రజలు వీక్షించారు. అదే సమయంలో అంతరిక్షం నుంచి అతి కొద్ది మంది భూమిపై పడిన చంద్రుని ఛాయను వీక్షించారు. గురువారం భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు ఆ నీడ నీలిగ్రహం అడుగు భాగాన పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్)లో ఉన్న వ్యోమగాములు ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించారు.
2019-12-26ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పి.ఒ.కె)లో ఏదో ఒక చర్యకు దిగుతారని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంతేహం వ్యక్తం చేశారు. ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నుంచి ద్రుష్టి మళ్ళించేందుకు మోడీ ఈ చర్యకు దిగుతారని ఇమ్రాన్ పేర్కొన్నారు. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో తమ జవాన్లు ఇద్దరు మరణించారని పాక్ సైన్యం ప్రకటించిన తర్వాత ఇమ్రాన్ మాట్లాడారు.
2019-12-26పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి)లను అమలు చేయబోమని పలు రాష్ట్రాలు ప్రకటించాయి. చివరికి (అసెంబ్లీతో కూడిన) కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్ఛేరి కూడా వ్యతిరేకించింది. ముస్లింలను విస్మరించిన సిఎఎను, ఎన్.ఆర్.సి.ని కూడా అమలు చేయబోమని పుదుచ్ఛేరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. ‘‘తర్వాత ఏమైనా కానీ’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణ స్వామి కాంగ్రెస్ నేత.
2019-12-26కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి, బిజెపి చిరకాల మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి)కి తాము వ్యతిరేకమని ప్రకటించింది. ఎన్.ఆర్.సి. ప్రక్రియ ముస్లింలలో భయాందోళనలను సృష్టించిందని అకాలీదళ్ గురువారం పేర్కొంది. ‘‘మా పార్టీ కూడా మైనారిటీలదే (సిక్కులు). మైనారిటీలను భయపెట్టే ఏ చర్యకైనా మేము వ్యతిరేకమే’’ అని అకాలీదళ్ రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ స్పష్టం చేశారు.
2019-12-26రాష్ట్ర రాజధానిని విశాఖపట్నానికి తరలించే విషయంలో ‘పార్టీ వైఖరికి నిరసన’గా... తెలుగుదేశం విశాఖపట్నం అర్బన్ అధ్యక్షుడు రెహ్మాన్ రాజీనామా చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉద్యమం చేయిస్తున్నారని రెహ్మాన్ తప్పుపట్టారు. విశాఖపట్నాన్ని రాజధానిగా స్వాగతించకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతానని రెహ్మాన్ వ్యాఖ్యానించారు.
2019-12-26ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా లేక విజయసాయిరెడ్డా?! అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. ‘‘విశాఖపట్నం పరిపాలనా రాజధాని’’గా విజయసాయిరెడ్డి గురువారం వెల్లడించిన నేపథ్యంలో తులసిరెడ్డి ఓ మీడియా సంస్థ చర్చలో ఈ ప్రశ్నను సంధించారు. గతంలో కొంతకాలం ఏపీ సిఎం కేసీఆరేమో అనే అనుమానం ఉండేదని, ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే అనుమానం వస్తోందని తులసిరెడ్డి చెప్పారు.
2019-12-26రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి. ఆయన కార్యాలయం రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుంది. సిఎంఒలో పని చేసే కార్యదర్శులు ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించి సిఎంకు అవసరమైన మేరకు వివరించి సంతకాలు తీసుకుంటారు. ఇప్పుడలాంటి కీలక వ్యవస్థలో ఫైళ్ళు కుప్పలు తెప్పలుగా పేరుకున్నట్టు సమాచారం. ఫైళ్ళు సిఎం వద్దకు వెళ్ళడమే తప్ప తిరిగి రావడంలేదని వివిధ శాఖల అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
2019-12-26 Read Moreసచివాలయం సహా పరిపాలనా వ్యవస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని జి.ఎన్. రావు కమిటీ చేసిన సిఫారసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం వెల్లడించలేదు. రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు. ఈ చర్చ, ప్రకటన జరగక ముందే... అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రాజధాని మార్పుపై ప్రకటనలు చేశారు. ‘‘విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత’’ అనే పదజాలం వాడటమే ఆశ్చర్యంగా ఉంది.
2019-12-2628వ తేదీన విశాఖ ఉత్సవంలో పాల్గొనడానికి వస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డికి 24 కిలోమీటర్ల పొడవున మానవ హారంతో ఘన స్వాగతం పలకనున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా ప్రకటించాక తొలిసారి నగరానికి వస్తున్న సిఎంకు చరిత్రలో నిలిచిపోయేలా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
2019-12-26