విజిలెంట్ హ్యాకర్ ఇలియట్ ఆండర్సన్ రెండు గోవా ప్రభుత్వ వెబ్‌సైట్లలో పోర్న్ లింక్‌లను కనుగొన్నారు. ఆ రెండు వెబ్ సైట్లు ఆధార్ లింకుపైన క్లిక్ చేసిన వినియోగదారులను అశ్లీల వెబ్ సైట్లకు రీడైరెక్ట్ చేశాయి. గోవా ప్రభుత్వ అధికారిక భాష డైరెక్టరేట్, విద్యా డైరెక్టరేట్ పేజీల దిగువన ఉన్న ఆధార్ లోగోను క్లిక్ చేసినప్పుడు ‘http://www.aadharcarduidai.in/ URL’ తో అశ్లీల వెబ్‌సైట్లు ఓపెన్ అయ్యాయి. ఇలా సుమారు మూడు గంటలు జరిగాక సాయంత్రం 4:30 గంటలకు లింకులు నిలిచిపోయాయి.
2019-10-23కేసులున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ధైర్యం చేయలేరని, నిన్న జగన్ ఢిల్లీ పర్యటనతో అదే రుజువైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. సీఎంకు కేంద్ర మంత్రుల ఇంటర్వ్యూలు కూడా లభించడంలేదని, గట్టిగా మాట్లాడితే సీబీఐ కేసులు బయటకు తీస్తారని భయమని పవన్ వ్యాఖ్యానించారు. బుధవారం ప్రకాశం జిల్లా జనసేన నాయకుల సమావేశంలో పవన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి నేరాలను ప్రోత్సహించడంవల్లనే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తున్నారని పవన్ ఆరోపించారు.
2019-10-23దశ 1: విలీనం ; దశ 2: దుర్వినియోగం ; దశ 3: భారీ నష్టాలను చూపించడం ; దశ 4: క్రోనీ క్యాపిటలిస్ట్‌కు చౌకగా అమ్మడం... బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ విలీనానికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపిన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందన ఇది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించగానే రాహుల్ ఈ నాలుగు లైన్లను ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తన అత్యాశాపరులైన మిత్రులకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతున్నారని రాహుల్ నిన్న కూడా విమర్శించారు.
2019-10-23ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎమ్‌టిఎన్‌ఎల్ బిఎస్‌ఎన్‌ఎల్‌కు అనుబంధ సంస్థగా పనిచేస్తుందని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. రెండు కంపెనీలకు సహాయ ప్యాకేజీలో భాగంగా మూలధన అవసరాలకోసం రూ. 15 వేల కోట్లను సావరిన్ బాండ్ల రూపంలో సేకరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 4జి స్ప్రెక్ట్రంను 2016 రేట్లతో కేటాయించాలని, 50 శాతం ఉద్యోగులకు విఆర్ఎస్ ఇవ్వాలని నిర్ణయించారు.
2019-10-23రాష్ట్ర రాజధానిని ఎక్కడ నిర్మించాలని నిపుణుల కమిటీ నిర్దేశిస్తే అక్కడే చేపడతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ అంశంపై బొత్స బుధవారం అమరావతిలో విలేకరులతో మాట్లాడారు. అమరావతికోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు పదే పదే చెబుతున్నారని, రాజధాని ఎక్కడ నిర్మించినా లక్ష ఎకరాలు కూడా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బొత్స వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడమైనా నిర్మించారా? అని బొత్స ప్రశ్నించారు.
2019-10-23మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మళ్లీ బీజేపీలో చేరవచ్చంటూ వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని ఆయన భార్య నవజ్యోత్ కౌర్ స్పష్టం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన శాఖను మార్చడంతో సిద్ధూ గత జూలైలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవజ్యోత్ కౌర్ పార్టీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో సిద్ధూ తిరిగి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఖండించిన నవజోత్ కౌర్, తమకు సిఎం అమరీందర్ సింగ్ తో ఎలాంటి విభేదాలూ లేవన్నారు. తాను ఏ పార్టీలో లేనని కూడా స్పష్టం చేశారు.
2019-10-23‘‘హైదరాబాదులో ఏదో చేశానని అంటున్నావ్. ఏం చేశావ్’’ అని మాజీ సీఎం చంద్రబాబును ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తనకంటే ముందు పని చేసిన సీఎంలు శంకుస్థాపన చేసినవి చంద్రబాబు నిర్మిస్తే తన ఘనతగా చెప్పుకొంటారని, తాను శంకుస్థాపన చేసినవి తర్వాత ముఖ్యమంత్రులు నిర్మించినా అవీ తన ఖాతాలోనే వేసుకుంటారని బొత్స ఎద్దేవా చేశారు. ‘‘జనార్ధనరెడ్డి శంకుస్థాపన చేసిన సైబర్ సిటీని ఈయన నిర్మించాడు. సరే! ఎయిర్ పోర్టును, పీవీ ఎక్స్ ప్రెస్ వేను రాజశేఖరరెడ్డి నిర్మిస్తే అవీ నేనే కట్టానంటాడు’’ అని వ్యాఖ్యానించారు.
2019-10-23తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ నుంచి వెనక్కు తగ్గేది లేదని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. విలీనం మినహా మిగిలిన డిమాండ్లను పరిశీలించడానికంటూ ఆర్టీసీ అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి స్పందించారు. తెలంగాణ ఏర్పాటైతే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కార్మిక సంఘాల ఐక్యత దెబ్బతినదని అశ్వత్థామరెడ్డి చెప్పారు.
2019-10-23కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ఒక ఎంపికి ఉన్న విలువ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. గత రెండు రోజుల్లో సిఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. 21, 22 తేదీల్లో ఢిల్లీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సోమవారంనాడు అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకలేదు. అదే రోజు నిజామాబాద్ ఎంపీ (బిజెపి) మాత్రం అమిత్ షాను కలిశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణ ఏపీ సిఎంపై వ్యంగ్యాస్త్రం సంధించారు.
2019-10-23రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే... అధికార పార్టీకి అసాధారణ మెజారిటీ ఇచ్చి ప్రజలు తప్పు చేశారా? అనే భావన కలుగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఒంగోలు లోక్ సభా నియోజకవర్గ నేతలతో సమావేశమైన సందర్భంగా ఆయనీ అంశాన్ని ప్రస్తావించారు. కేసులు ఉన్నవాళ్లు ఢిల్లీలో ఉన్నవాళ్లతో గట్టిగా మాట్లాడలేరని పవన్ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది కాలంలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు.
2019-10-23