ఇండియాలో గత 24 గంటల వ్యవధిలో 2,411 కొత్త కేసులు, 71 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 37,776కు, మృతుల సంఖ్య 1,223కి పెరిగినట్టు ఆ శాఖ కథనం. అయితే, ఆరోగ్య శాఖ ఈ గణాంకాలు విడుదల చేశాక కొన్ని రాష్ట్రాల నుంచి అదనపు కేసులు వెల్లడయ్యాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. గుజరాత్ కేసుల సంఖ్య 4,721 కాగా, ఆ రాష్ట్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 5,054. శనివారం ఆ రాష్ట్రంలో 333 కొత్త కేసులు నమోదు కాగా 26 మంది చనిపోయారు. ఈ ఒక్క రాష్ట్రం వివరాలు కలిపితేనే దేశంలో కేసుల సంఖ్య 38,109కి, మరణాలు 1249కి పెరుగుతున్నాయి.
2020-05-02లోక్ పాల్ సభ్యుడు జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి (62) ‘కరోనా’ వైరస్ బారిన పడి మరణించారు. గత నెలలో ఆయనను పరీక్షించగా వైరస్ సోకినట్టు తేలింది. ‘ఎయిమ్స్’ లోని జైప్రకాష్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్లో చికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, అయితే స్థిరంగానే ఉన్నారని వార్తలు వచ్చాయి. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. త్రిపాఠి చత్తీస్ గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ‘లోక్ పాల్’లోని నలుగురు జ్యుడిషియల్ సభ్యులలో త్రిపాఠి ఒకరు.
2020-05-02మహారాష్ట్ర నుంచి సొంత ప్రాంతానికి వచ్చిన ఏడుగురు యూపీ వలస కార్మికులకు ‘కరోనా’ వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని బస్తి జిల్లాకు చెందిన వీరు ఈ వారం ప్రారంభంలో మహారాష్ట్ర నుంచి రాగా.. స్థానిక కాలేజీలోని ‘క్వారంటైన్’లో ఉంచారు. వైరస్ నిర్ధారణ కావడంతో ఆసుపత్రికి తరలించారు. మార్చి 24న ప్రధాని మోడీ ‘లాక్ డౌన్’ ప్రకటించాక వలస కార్మికులు లక్షల సంఖ్యలో కాలి నడకనే సొంత ప్రాంతాలకు వెళ్లగా.. మెజారిటీ ఎక్కడివారక్కడే ఉండిపోయారు. ‘కరోనా’కు పెద్ద కేంద్రంగా మారిన మహారాష్ట్రలో వలస కార్మికులూ ఈ మహమ్మారి బారిన పడటం గమనార్హం.
2020-05-02ఆంధ్రప్రదేశ్ ‘కరోనా’ బాధితుల సంఖ్య 1500 దాటింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొత్తగా నమోదైన 62తో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1525కి పెరిగింది. అందులో 441 మంది కోలుకోగా 33 మంది చనిపోయారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 436 కేసులు నమోదు కాగా 10 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో 308 కేసులకు గాను 8 మంది, కృష్ణా జిల్లాలో 258 కేసులకు గాను 8 మంది మరణించారు. నెల్లూరులో 90 కేసులకు ముగ్గురు మరణించగా, 83 కేసులు నమోదైన కడప, 80 కేసులున్న చిత్తూరులలో మరణాలు లేవు. అనంతపురంలో 71 కేసులకు గాను నలుగురు మరణించారు.
2020-05-02ఏప్రిల్ 2వ వారంలో ట్విట్టర్లో ఓ పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష నివాసం ‘శ్వేతసౌథం’.. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్లను, పిఎంఒ హ్యాండిల్ నూ ‘ఫాలో’ కావడం ప్రారంభించింది. అయితే, ఎందుకో 20 రోజుల్లోనే ‘శ్వేతసౌథం’ మనసు మారింది. మోడీ, కోవింద్, పిఎంఒ ట్విట్టర్ హ్యాండిల్స్ ను ‘అన్ ఫాలో’ చేసింది. సాధారణంగా ‘శ్వేతసౌథం’ అమెరికన్ ముఖ్యులను.. అదీ చాలా తక్కువ అకౌంట్లను ఫాలో అవుతుంది. సంప్రదాయానికి భిన్నంగా భారత నాయకులు, కార్యాలయాలను మాత్రమే ‘ఫాలో’ అయి కొద్ది రోజుల్లోనే ‘అన్ ఫాలో’ చేసింది. ‘శ్వేతసౌథం’ జాబితాలో ఇక 13 అకౌంట్లే మిగిలాయి.
2020-04-29బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) బుధవారం ఉదయం మరణించారు. పెద్ద ప్రేగులో ఇన్ఫెక్షన్ తో ఆయన మంగళవారం ముంబై కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. ఆయన తల్లి సయ్యెదా బేగం గత శనివారమే మరణించారు. తనకు ‘న్యూరోఎండోక్రైన్ ట్యూమర్’ ఉన్నట్టు 2018లో ఇర్ఫాన్ వెల్లడించారు. 2019లో కొద్ది నెలల పాటు విదేశాల్లో చికిత్స పొందారు. ఆ సమయంలో ‘అంగ్రేజీ మీడియం’ అనే ఒకే సినిమాలో నటించారు. ఇండియాలో బహు భాషా చిత్రాల్లో నటించిన ఇర్ఫాన్ ‘జురాసిక్ వరల్డ్’, ‘ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్’, ‘స్లం డాగ్ మిలియనీర్’, ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి హాలీవుడ్ సినిమాల్లోనూ ప్రతిభ కనబరిచారు.
2020-04-292020-21 భారత రక్షణ బడ్జెట్లో వేతనాలు మినహా మిగిలిన వ్యయాన్ని కనీసంగా 20 శాతం, గరిష్ఠంగా 40 శాతం తగ్గించే అవకాశం ఉందని తాజాగా ఓ వార్త. మంగళవారం ఢిల్లీలో రక్షణ వ్యవహారాల విశ్లేషకులతో మాట్లాడుతూ.. రక్షణ శాఖ అధికారి ఒకరు ఈ విషయం చెప్పినట్టుగా ‘బిజినెస్ స్టాండర్డ్’ రాసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వ్యయాన్ని కేవలం 15-20 శాతానికి పరిమితం చేయాలని మిలిటరీని ఆదేశించినట్టు ఆమె (రక్షణ అధికారి) చెప్పారు. ఏడాది మొత్తం మిలిటరీ వ్యయంలో 20 శాతం కోత విధిస్తే రూ. 40,000 కోట్లు, 40 శాతం కోత పెడితే ఏకంగా రూ. 80,000 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి.
2020-04-29 Read Moreఇండియాలో కరోనా’ మృతుల సంఖ్య 1000 దాటింది. మంగళవారం నాటికి దేశంలో 31,360 మందికి వైరస్ సోకగా.. వారిలో 1008 మంది మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే మృతుల సంఖ్య 400కి పెరిగింది. గుజరాత్ (162), మధ్యప్రదేశ్ (113) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 9318కి పెరిగింది. మంగళవారం ఒక్క రోజే 729 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాల రేటు మహారాష్ట్ర (4.29%) కంటే గుజరాత్ (4.57%), మధ్యప్రదేశ్ (4.77%) లలో ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్యలో ఇప్పుడు ఇండియా 15వ స్థానానికి చేరింది. తాజాగా ఇరాన్ 9వ స్థానానికి ఎగబాకి చైనాను దిగువకు నెట్టింది.
2020-04-29అమెరికాలో ‘కరోనా’ బాధితులు 10 లక్షలు దాటారు (10,12,399 మంది). వారిలో 58,348 మంది మరణించారు. ఫిబ్రవరి 28న తొలి మరణం నమోదయ్యాక సరిగ్గా రెండు నెలలకే ఇంతమందిని వైరస్ బలి తీసుకోవడం అమెరికన్లను కలచివేస్తోంది. ఎందుకంటే.. వియత్నాంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల కంటే ఈ సంఖ్య ఎక్కువ. వియత్నాం యుద్ధంలో 58,220 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన 31,14,659 ‘కరోనా’ కేసుల్లో అమెరికా వాటా 32.49 శాతం. మరణించినవారిలో 26.89 శాతం అమెరికన్లే! పాలకుల నిర్లక్ష్యానికి అమెరికన్ ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారు.
2020-04-29ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య 30,36,770కి పెరిగింది. అందులో దాదాపు మూడో వంతు (9,87,022 మది- 32.5%) అమెరికన్లే. పాజిటివ్ కేసులు స్పెయిన్లో 2,29,422కు పెరిగితే.. ఇటలీ కూడా 2లక్షలకు అతి సమీపంలో (1,99,414) ఉంది. మొత్తంగా 2,10,842 మంది (6.94%) మరణించారు. 8,92,291 మంది (29.37%) కోలుకున్నారు. మృతులలో 56,144 మంది (26.63%) అమెరికన్లు. మరణాల రేటు అమెరికాలో 5.69% కాగా.. అత్యధికంగా బెల్జియంలో 15.44% (మృతులు 7,207 మంది), ఫ్రాన్స్ లో 14.05% (23,327), ఇటలీలో 13.53% (26,977 మంది), యు.కె.లో 13.36% (21,092 మంది), స్పెయిన్లో 10.25% (23,521) నమోదైంది.
2020-04-28