డ్రైవింగ్ రానివాడికి వాహనం ఇస్తే యాక్సిడెంట్ తప్పదని, అలాగే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ప్రమాదాలు జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం చీరాల నియోజకవర్గ టీడీపీ నేతలతో మాట్లాడిన ముఖ్యమంత్రి ‘‘ఆటో డ్రైవర్లంతా నన్ను డ్రైవర్ నెంబర్ 1 అంటున్నారు. రాష్ట్రాన్ని నడపగలిగే డ్రైవర్ చంద్రబాబు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి డ్రైవింగే రాదు. డ్రైవింగ్ స్కూలుకు వెళ్లలేదు’’ అన్నారు.
2019-02-23 Read Moreబెంగళూరు ఏరో ఇండియా 2019 సందర్భంగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం పార్కింగ్ స్థలంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఏకంగా 300 కార్లు దగ్ధమయ్యాయి. కాల్చి పడేసిన ఓ సిగరెట్ ముక్క ఈ ప్రమాదానికి కారణమన్నది ప్రాథమిక సమాచారం. షో ప్రారంభానికి ముందు రోజు.. విమాన విన్యాసాల రిహార్సల్స్ సమయంలో రెండు జెట్లు కూలిపోయి ఓ పైలట్ మరణించిన సంగతి తెలిసిందే. కార్లకు ఉన్న డ్రై గ్లాసెస్, భారీ గాలుల కారణంగా ప్రమాద తీవ్రత పెరిగినట్టు పోలీసు అధికారి ఎంఎన్ రెడ్డి చెప్పారు.
2019-02-23 Read Moreఏపీకి ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలకంటే అదనంగానే కేంద్రం సాయం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన రైల్వే జోన్ అంశంపై చర్చించేందుకు కన్నా శనివారం ఇతర బీజేపీ నేతలతో కలసి న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర హామీల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలలో 90 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని కన్నా పేర్కొన్నారు.
2019-02-23 Read Moreఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే ఈ గడ్డపై అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పష్టం చేశారు. శనివారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఆయనీ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ దేశం మొత్తానికి ఇచ్చినదని, ఐదేళ్లు హోదాను తొక్కి పట్టి బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. మార్చి 1న ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ..మా హక్కులు ఎందుకు నెరవేర్చలేదంటూ నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
2019-02-23 Read Moreతాను అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను మొత్తాన్ని రూ. 3000కు పెంచుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పింఛనును రూ.2000కు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకటన చేసిన నేపథ్యంలో జగన్ ఈ విధంగా స్పందించారు. బుధవారం తిరుపతిలో నిర్వహించిన శంఖారావం సభలో జగన్ ఈ అంశంపై మాట్లాడారు. 2014కు ముందు పింఛను మొత్తం రూ. 200 ఉండగా ఆ ఏడాది అక్టోబర్ నుంచి రూ. 1000 ఇస్తున్నారు.
2019-02-06 Read More‘ప్రజల మనోభావాలను గౌరవించాం. వారి ఆకాంక్షమేరకే కేంద్రంపై పోరాడుతున్నాం. పేదల సంక్షేమం చూస్తున్నాం. ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు?’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలను నిలదీశారు. ‘రాజశేఖరరెడ్డి ఒక్క పరిశ్రమను తెచ్చాడా? మనం తెచ్చిన ఓక్స్ వ్యాగన్ కంపెనీని వాళ్ళు తరిమేశారు. మనం కియా కంపెనీని తెచ్చాం. దీనిపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రతినిధులు ప్రచారం చేయాలి’ అని గురువారం మధ్యాహ్నం జరిగిన టీడీఎల్పీ సమావేశేంలో చంద్రబాబు సూచించారు.
2019-01-31 Read Moreవిమానాల తయారీలో ధిగ్గజ సంస్థ బోయింగ్ వ్యాపార రంగంలో అత్యున్నత దశకు చేరింది. 102 ఏళ్ల సంస్థ చరిత్రలో తొలిసారిగా 2018లో 100 బిలియన్ డాలర్ల మేరకు అమ్మకాలను సాధించింది. గత ఏడాది కాలంలో బోయింగ్ 806 విమానాలను ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలకు సమకూర్చింది. 2019లో ఆ సంఖ్య మరింత పెరగనుంది. ఈ సంవత్సరం 895 నుంచి 905 విమానాలను సమకూర్చనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
2019-01-31 Read Moreలోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సర్వేల హడావిడి ఊపందుకుంది. ఇటీవల ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ లోక్ సభ ఎన్నికలపై ఒపీనియన్ పోల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా టైమ్స్ నౌ టీవీ సర్వే ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 23 లోక్ సభ సీట్లు (మొత్తం 25) వస్తాయని టైమ్స్ నౌ అంచనా. గత ఎన్నికల్లో 15 సీట్లు గెలిచిన టీడీపీకి ఈసారి కేవలం రెండు సీట్లు వస్తాయని ఈ సర్వే చెబుతోంది.
2019-01-30 Read More10 కాదు.. 20 కాదు.. 30 కాదు.. 140 సంవత్సరాలు.. #10YearChallenge పేరిట నడుస్తున్న పోస్టులకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందు’ స్పందన ఇది. 1878లో ప్రారంభించిన హిందూ పత్రిక గత ఏడాది 140 వసంతాలు పూర్తి చేసుకుంది. 1878 నుంచి స్థిరంగా, విశ్వసనీయమైన వార్తలను వెలువరిస్తున్నట్టు మంగళవారం #100YearChallenge పేరిట ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టింది.
2019-01-29 Read Moreప్రధాని నరేంద్రమోడీ వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు కియా కార్ల పరిశ్రమ వచ్చిందని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటుకోసం గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలను సూచించగా... కియా మాత్రం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుందని ఆయన చెప్పారు.
2019-01-29 Read More