ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే పరస్పర విమర్శలు, ఆరోపణలతో దద్దరిల్లింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ అడుగు ముందుకు వేసి ‘చంద్రబాబు పదవికి రాజీనామా చేసి పోతాడా’ అని ప్రశ్నించడంతో సభ మరింత వేడెక్కింది. చంద్రబాబును సవాల్ చేస్తున్నానంటూ.. ‘2014 నుంచి 19 దాకా సున్నా వడ్డీ పథకం కింద చంద్రబాబు అనే వ్యక్తి రూపాయి కూడా ఇవ్వలేదు. రికార్డులు తెప్పిద్దాం. ఈ మాట వాస్తవమైతే చంద్రబాబు పదవికి రాజీనామా చేసి పోతాడా?’ అని జగన్ ప్రశ్నించారు.
2019-07-11240.. సాధారణ పరిస్థితుల్లో అయితే పెద్ద ఛేజింగ్ స్కోరు కాదు. కానీ, మంగళవారం వర్షం పడి మ్యాచ్ ఆగిపోగా.. బుధవారం పిచ్ బౌలర్లకు సహకరించింది. న్యూజీలాండ్ బౌలర్ల ధాటికి ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 100 పరుగులకే ఇన్నింగ్స్ ముగుస్తుందా.. అన్న ఆందోళన మధ్య మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, రవీంద్ర జడేజా 7వ వికెట్ భాగస్వామ్యానికి 100 పరుగులు పైగా సాధించి పరువు నిలబెట్టారు. ఆ వెంటనే వారిద్దరూ ఔట్ కావడంతో న్యూజీలాండ్ విజయం ఖాయమైంది.
2019-07-102019 క్రికెట్ ప్రపంచ కప్ సమరం నుంచి ఇండియా నిష్క్రమించింది. బుధవారం న్యూజీలాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ పోటీలో చెమటోడ్చినా ఫలితం లేకపోయింది. మంగళవారం వర్షం కారణంగా న్యూజీలాండ్ బ్యాటింగ్ చివరి దశలో ఆగిపోవడంతో... ఆగినచోటనుంచే ఆటను బుధవారం కొనసాగించారు. 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజీలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2019-07-10మోదీ 1.o ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంతో పోలిస్తే రెండో సంవత్సరం రైతు ఆత్మహత్యల సంఖ్య భారీగా పెరిగింది. 2014లో దేశవ్యాప్తంగా 5,650 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2015లో ఈ సంఖ్య 8007కు పెరిగింది. లోక్ సభ సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు మంగళవారం కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 2015లో రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
2019-07-092014, 2015 సంవత్సరాల్లో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉంది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం.. తెలంగాణలో 2014లో 898 మంది, 2015లో 1358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అవే సంవత్సరాల్లో మహారాష్ట్రలో 2,568 మంది, 3030 మంది ఆత్మహత్య చేసుకొన్నారు. రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్రదే అగ్రస్థానం. కాగా, ఏపీలో 2014లో 160 మంది, 2015లో 516 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
2019-07-09చంద్రబాబు హయాంలో ప్రగతిపై సందేహాలు.. వైఎస్ హయాంలో ప్రగతిపై ప్రశంసలు.. బుధవారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రం సారాంశమిదే! 2014-19 (చంద్రబాబు ప్రభుత్వ) కాలంలో సగటున 10.36 శాతం వృద్ధిరేటు సాధించినట్టు పేర్కొంటూనే...దాని వాస్తవికతపై బుగ్గన తీవ్రస్థాయిలో సందేహాలు వ్యక్తం చేశారు. 2004-09 (వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ) కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ సగటున 9.56 శాతం పెరిగినట్టు పేర్కొంటూ.. అదే అత్యధిక వృద్ధిరేటుగా స్పష్టం చేశారు.
2019-07-102014-19 కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 7 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ ఐదేళ్లలో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 391 కుటుంబాలకు మాత్రమే పరిహారం చెల్లించారని జగన్ పేర్కొన్నారు. మిగిలిన కుటుంబాలకు రూ. 7 లక్షల మొత్తాన్ని కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే కలసి వెళ్లి అందించాలని ఆదేశించారు. రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని వేరొకరు తీసుకోకుండా చట్టాన్ని తెస్తామని జగన్ వెల్లడించారు.
2019-07-10ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో 2014-19 బ్యాడ్ పీరియడ్ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకు రాష్ట్ర విభజన, చంద్రబాబు పాలన కారణాలుగా పేర్కొన్నారు. బుధవారం బుగ్గన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తూ విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ళలో ఫిషరీస్ రంగంలో గ్రోత్ బాగుందని చూపిస్తూ మొత్తం వ్యవసాయ రంగం బాగా పెరిగినట్టు చూపించారని, నిజానికి ఆ కాలంలో వ్యవసాయ రంగం దెబ్బ తిన్నదని బుగ్గన చెప్పారు. అదే సమయంలో అప్పులు, ద్రవ్యోల్భణం బాగా పెరిగాయని పేర్కొన్నారు.
2019-07-10చంద్రయాన్-2.. చందమామపైకి ఇండియా రెండో ప్రయోగం.. చంద్రుడిపై పరిశోధనలకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఒక రోవర్ ను జూలై 15వ తేదీన పంపబోతోంది. ఈ నేపథ్యంలో ‘ఇస్రో’ ఛైర్మన్ కె. శివన్ తన కుటుంబంతో సహా ఆదివారం కర్నాటక రాష్ట్రం ఉడుపిలోని శ్రీక్రిష్ణ మఠానికి వెళ్లి పూజలు చేశారు. మఠాధిపతి దర్శనం చేసుకొని ఆశీర్వాదం కోరారు. ‘చంద్రయాన్ 2‘ ల్యాండర్ సెప్టెంబర్ 6వ తేదీన చందమామ దక్షిణధృవాన వాలనుంది.
2019-07-07కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి జ్యోతిరాదిత్య సింథియా, ముంబై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మిలింద్ దేవొరా ఆదివారం రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన కొద్ది రోజుల తర్వాత వారిద్దరూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యానికి బాధ్యత తీసుకున్నట్టు అటు రాహుల్, ఇటు సింథియా చెప్పారు. మిలింద్ దేవొరా మాత్రం జాతీయ స్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నట్టు సంకేతాలిచ్చారు.
2019-07-07