విభజన హామీలలో ఒక్కటీ అమలు చేయకుండా వైసీపీకి సాయం చేయడానికే నరేంద్ర మోదీ ఇప్పుడు నిస్సిగ్గుగా రాష్ట్రానికి వస్తున్నాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. చంద్రబాబుతోనే బంగారు భవిష్యత్తు (2014లో) అన్న నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసి ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ తిరోగమనంలో ఉందన్న ప్రధాని ట్వీట్ కు చంద్రబాబు ఘాటుగా బదులిచ్చారు. రైతులను, యువకులను, మైనారిటీలను, ఆర్థిక వ్యవస్థను మోదీ సంక్షోభంలోకి నెట్టాడని దుయ్యబట్టారు.
2019-03-29రాజధాని అమరావతి పేరిట అమరేశ్వరస్వామి భూములు కొల్లగొట్టారని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. రాజధాని ఏదంటే గ్రాఫిక్స్ చూపిస్తున్నారని, ఆ ప్రాంతంలో 40 దేవాలయాలు కూల్చేశారని విమర్శించారు.
2019-03-29 Read Moreఅవినీతి, బలహీనమైన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో విమర్శించారు. ప్రధానమంత్రి ట్విట్టర్ హ్యాండిల్ పై శుక్రవారం ఉదయం తెలుగులో కొన్ని సందేశాలు దర్శనమిచ్చాయి. తెలంగాణ, ఆంధ్ర పర్యటనలకు వస్తున్న సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలను ఉద్ధేశించి ఈ ట్వీట్లు పెట్టారు. సాయంత్రం కర్నూలులో ఒక సభలో మాట్లాడనున్నట్టు ప్రధాని తెలిపారు. మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి మోసపూరితంగా పాలిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
2019-03-29 Read More‘‘చంద్రబాబుకు ఓటు వేస్తే లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసినట్టే’’, ‘‘జగన్మోహన్ రెడ్డికి ఓటు వేేయడం అంటే గ్రెనేడ్ పిన్ను పీకి దానిమీద కూర్చోవడమే’’... ఇవీ జనసేన పార్టీ తాజా నినాదాలు. చంద్రబాబు తన కొడుకు భవిష్యత్తుకోసం, జగన్ సిఎం కావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రాష్ట్రంకోసం కాదని పవన్ కళ్యాణ్ మరోసారి ఉద్ఘాటించారు. తాను మాత్రం యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దడానికే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని శుక్రవారం కర్నూలు జిల్లా నందికొట్కూరు సభలో పవన్ చెప్పారు.
2019-03-29బీహార్ మహాకూటమిలో భాగంగా తమ పార్టీ 19 లోక్ సభ సీట్లకు పోటీ చేస్తుందని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్.జె.డి) నేత తేజశ్వి యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 9 లోక్ సభ సీట్లకు, కూటమిలో మరో భాగస్వామి ఆర్.ఎల్.ఎస్.పి. 5 సీట్లకు పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఆర్.జె.డి. పోటీ చేసే సీట్లలో భాగల్పూర్, బంకా, మధ్యపురా, దర్భంగా ఉన్నట్టు యాదవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో పాట్నా సాహిబ్ ఉంది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీజేపీ నేత శత్రుఘ్న సిన్హాకు ఆ సీటు కేటాయించనున్నారు.
2019-03-29వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఉద్ఘాటించారు. శుక్రవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘వారసత్వ రాజకీయాలు నా సమస్య కాదు. అవి దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని విమర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను దుయ్యబట్టారు. బాలాకోట్ వైమానిక దాడులను ప్రశ్నించడం మూర్ఖత్వమని మోదీ మండిపడ్డారు.
2019-03-29‘రాజకుమారుడు’ అంటూ రాహుల్ గాంధీని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు అభివర్ణిస్తుంటారు. అయితే, వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పోటీ పడుతోందని ఓ అధ్యయనం తేల్చింది. 1999 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున 36 మంది వారసులు ఎంపీలుగా ఎన్నికైతే, బీజేపీ నుంచి 31 మంది ఎంపికయ్యారు. 2009లో కాంగ్రెస్ (11 శాతం)ను బీజేపీ (12 శాతం ఎంపీలు) మించిపోయింది. 1952 నుంచి ఎన్నికైన 4,807 మంది ఎంపీల సమాచారాన్ని హార్వర్డ్, మన్హేమ్ యూనివర్శిటీల పరిశోధకులు క్రోడీకరించారు.
2019-03-29 Read Moreయాంటీ శాటిలైట్ మిసైల్ (ఎఎస్ఎం)ను ప్రయోగించినట్టు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డీడీలో జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తమ అనుమతి కోరలేదని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం తమకు సమాచారం ఇవ్వడంగానీ, అనుమతి కోరడంగానీ చేయలేదని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా గురువారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ అంశంపై కొంతమంది అధికారులతో కూడిన కమిటీ దూరదర్శన్, ఆలిండియా రేడియో ఇచ్చిన వివరణలను పరిశీలిస్తోందని సక్సేనా తెలిపారు.
2019-03-28పేద కుటుంబాలకు ఏటా రూ. 72 వేలు బ్యాంకు అకౌంట్లలో వేస్తామని ప్రకటించిన రెండు రోజుల తర్వాత రాహుల్ వ్యాపారాలకు వరాలు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నియంత్రణా వ్యవస్థలనుంచి అనుమతులు లేకుండానే వ్యాపారాలు ప్రారంభించుకునే వెసులుబాటును మూడేళ్లపాటు ఇస్తామని, స్టార్టప్ కంపెనీలపై వేస్తున్న వివాదాస్పద ఏంజెల్ ట్యాక్సును రద్దు చేస్తామని గురువారం ప్రకటించారు. ఈ ప్రతిపాదనలను కూడా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తామని రాహుల్ పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
2019-03-28 Read Moreబీజేపీ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఏప్రిల్ 6వ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరనున్నటక్టు సమాచారం. గత ఎన్నికల్లో బీహార్ లోని పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానంనుంచి బీజేపీ తరపున ఎన్నికైన సిన్హాకు ఈసారి సీటు ఇవ్వలేదు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు సిన్హా కాంగ్రెస్ తరపున మహాకూటమి అభ్యర్ధిగా ‘పాట్నాసాహిబ్’ నుంచే పోటీ చేయబోతున్నారు.
2019-03-28