కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియాకు మోడీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. సింధియా యూపీఎ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆయనను బిజెపి తరపున రాజ్యసభకు ఎంపిక చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన సింధియా గ్రూపు నేతల్లో ఒకరికి... మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వవచ్చని సమాచారం. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో కమలనాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి సిద్ధమవుతోంది.
2020-03-10కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలసిన తర్వాత సింధియా తన రాజీనామా లేఖను (నిన్నటి తేదీతో) ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆయనకు మద్ధతుగా నిన్ననే బెంగళూరు క్యాంపులోకి చేరిన 19 మంది ఎమ్మెల్యేలు మంగళవారం తమ రాజీనామా లేఖలను గవర్నరుకు పంపించారు. కమలనాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింధియా బీజేపీతో కలసినట్టు ఈ పరిణామాలతో స్పష్టమైంది. గత ఏడాది ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్ సిఎం అవుతాననుకున్న సింధియా ఆశలకు కమలనాథ్ గండికొట్టారు.
2020-03-10 Read Moreకడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఇంత కాలం వైఎస్ కుటుంబానికి ప్రత్యర్ధిగా ఉన్న సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసిన ఓడిపోయిన సతీష్ రెడ్డి, ఇప్పుడు వైసీపీ గూటికే చేరబోతున్నారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లపై పోటీ చేసినందుకు సతీష్ రెడ్డికి టీడీపీ ఎం.ఎల్.సి. సీటుతో పాటు వైస్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. అయితే, తనకు సరైన ఆదరణ లభించలేదని సతీష్ రెడ్డి మంగళవారం తన అనుచరుల వద్ద వాపోయారు.
2020-03-10మొన్నటివరకు ఆసియాలోనే అతి పెద్ద సంపన్నుడు మన ముఖేష్ అంబానీ. నిన్న (మార్చి 9న) స్టాక్ మార్కెట్ పతనం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను 11 శాతం పడేయడంతో ఇప్పుడా సీటు పోయింది. ఆసియా నెం1 సంపన్నుడిగా తిరిగి చైనా టెక్ దిగ్గజం ‘జాక్ మా’ అవతరించాడు. నిన్న ఒక్క రోజే అంబానీ సంపద 5.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 43 వేల కోట్లు) హరించుకుపోవడంతో సంపన్నుల ర్యాంకులు తారుమారయ్యాయి. ‘కరోనా’ ప్రభావం కొనసాగుతుండగా.. నిన్న ప్రపంచ మార్కెట్లను చమురు ధరల పతనం కుదిపేసింది.
2020-03-10 Read Moreఅధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడుతుంటే మీ కళ్లు కనిపించడంలేదా? అని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఇసి)ని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఆయన అనుచరులు ఇతరులను నామినేషన్లు వేయవద్దంటూ బెదిరించారని, చంద్రబాబు సోమవారం ఓ వీడియోను ప్రదర్శించారు. ‘మంత్రికి సిగ్గుందా’ అని ప్రశ్నించారు. 90 శాతం స్థానాలు రాకపోతే మంత్రి పదవి ఉండదని సిఎం జగన్ బెదిరించడంతో అడ్డగోలుగా అక్రమాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
2020-03-09గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నందున ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల్లో మద్యం పంపిణీని నియంత్రించాలని ప్రభుత్వం ఆదేశించగా, చిత్తశుద్ధి ఉంటే షాపులు మూసివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ప్రభుత్వం, ఆ డిమాండుకు అనుగుణంగా స్పందించింది. ఎంపిటిసి, జడ్.పి.టి.సి.లకు ఈ నెల 21న, మున్సిపాలిటీలకు 23న, పంచాయతీలకు 27, 29 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది.
2020-03-09సోమవారం భారత స్టాక్ మార్కెట్ రికార్డు పతనానికి ‘ఎస్’ బ్యాంకు కుంభకోణం ఓ కారణం. అయితే, బిఎస్ఇ సెన్సెక్స్ 1,941 పాయింట్లు పతనమైన రోజే ‘ఎస్’ బ్యాంకు షేరు విలువ 30.96 శాతం పెరిగింది. సోమవారం లాభాలతో ముగిసిన స్టాక్స్ లో ‘ఎస్’ బ్యాంకు అగ్ర స్థానంలో ఉండటం విశేషం. కుంభకోణాలతో సంక్షోభంలో కూరుకుపోయిన ఈ ప్రైవేటు బ్యాంకు నుంచి.. డిపాజిట్ల ఉపసంహరణపై గత వారం రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించింది. అప్పుడు భారీగా పడిపోయిన షేరు విలువ, ప్రభుత్వ అభయం తర్వాత తిరిగి పుంజుకుంటోంది.
2020-03-09శాసన మండలి రద్దయితే మంత్రి పదవులు కోల్పోయే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ లకు ముందస్తు బహుమతి ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ ఇద్దరినీ రాజ్యసభ అభ్యర్ధులుగా ఎంపిక చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వారిద్దరూ ఓడిపోగా ఎమ్మెల్సీలను చేసి మంత్రి పదవులు ఇచ్చారు. రాజధాని బిల్లులను ఆపినందుకు మండలిపై మండిపడ్డ జగన్, ఆ సభ రద్దుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయించిన సంగతి తెలిసిందే. వైసీపీ తరపున పారిశ్రామికవేత్తలు అయోధ్యరామిరెడ్డి, పరిమల్ నత్వానిలను కూడా రాజ్యసభ అభ్యర్దులుగా ఎంపిక చేశారు.
2020-03-09మహా సంపన్నుడు ముఖేష్ అంబానీ సిఫారసులకు తిరుగులేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. అంబానీ సన్నిహిత పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేశారు. కొద్ది రోజుల క్రితం నత్వానితో కలసి అంబానీ రాష్ట్రానికి వచ్చి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ వేశారు. బీజేపీ సూచనతో జరిగిన ఈ భేటీకి రాజకీయ, ఆర్థిక కోణాల్లో ప్రాధాన్యత ఉంది. రాజశేఖరరెడ్డి మరణంలో సోనియాగాంధీ, అంబానీ పాత్ర ఉందంటూ జగన్ అనుయాయులు ఆరోపణలు చేశారు.
2020-03-09అమెరికా ఆయుధాల ఎగుమతులు అసాధారణంగా పెరుగుతూనే ఉన్నాయి. 2010-14, 2015-19 మధ్య కాలంలో అమెరికా ఎగుమతులు 23% పెరిగాయి. అదే కాలంలో రష్యా ఎగుమతులు 18% శాతం తగ్గాయి. ఇండియా మార్కెట్ పోవడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా ‘సిప్రి’ తాజా నివేదిక విశ్లేషించింది. ఆయుధ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా వాటా 31% నుంచి 36%కి పెరిగితే... రెండో స్థానంలో ఉన్న రష్యా వాటా 27% నుంచి 21% శాతానికి తగ్గింది. ఫ్రాన్స్ వాటా 4.8% నుంచి గణనీయంగా (7.9%) పెరిగింది. అమెరికా ఆయుధాలను కొన్న దేశాల సంఖ్య 96కు పెరిగింది.
2020-03-09 Read More