జైష్ ఎ మహ్మద్ (జెఇఎం) చీఫ్ మసూద్ అజర్ ఆస్తులను సీజ్ చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో మసూద్ పేరు చేరుస్తూ ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... పాకిస్తాన్ ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ లోనే ఉన్న మసూద్ ప్రయాణాలపైన, ఆయుధాల అమ్మకం కొనుగోళ్ళపైన నిషేధం ఉంటుంది. జెఇఎంకు ఆల్ ఖైదాతో సంబంధం ఉందన్న కారణంతో ఆ సంస్థ అధిపతి అయిన అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది ఐరాస కమిటీ.
2019-05-03 Read More‘‘ఫని’’.. అతి తీవ్ర తుపానుగా మారి శుక్రవారం భూమిపై విరుచుకుపడింది. గత రెండు దశాబ్దాల్లో ఇండియాలో ఇది రెండో అతి పెద్ద తుపానుగా నిపుణులు చెబుతున్నారు. 1999లో వచ్చిన సూపర్ సైక్లోన్ తర్వాత దాదాపు దానికి సమానమైన స్థాయిలో శక్తిని కలిగి ఉంది ‘‘ఫని’’. 1999 సూపర్ సైక్లోన్ ప్రభావానికి 10 వేల మంది మరణించారు. అప్పుడు కూడా తుపాను ఒడిషాలోని పూరి పట్టణం వద్దనే తీరం దాటింది. ఇప్పుడు దానికి సమీపంలోనే తీరం దాటింది. భువనేశ్వర్ లో నిన్న రాత్రి నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశారు. 140 రైళ్లు రద్దయ్యాయి.
2019-05-03 Read Moreఅతి తీవ్రమైన తుపానుగా మారిన ‘‘ఫని’’ శుక్రవారం ఉదయం ఒడిషాలోని పూరి వద్ద తీరం దాటింది. తుపాను ప్రభావంతో ముగ్గురు మరణించినట్టు ప్రాథమిక సమాచారం. 10 వేల గ్రామాలు, 50 పట్టణాలపై ‘‘ఫని’’ ప్రభావం ఉన్నట్టు చెబుతున్నారు. తుపాను తీరం దాటిన సమయంలో 180 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కొన్నిచోట్ల గాలి విసురు 200 నుంచి 220 కిలోమీటర్ల వరకు ఉంది. ఒడిషా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం పరిమితమైంది.
2019-05-03 Read Moreహాలీవుడ్ చిత్రం ‘‘అవెంజర్స్ ఎండ్ గేమ్’’ ఇండియాలోనూ వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. చిత్రం ఇండియాలో మొదటి వారంలోనే రూ. 260 కోట్ల నెట్ వసూలు చేసింది. గ్రాస్ రూ. 310 కోట్లుగా ఉన్నట్టు విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. గత శుక్రవారం రూ. 53.60 కోట్లు, శనివారం రూ. 52.20 కోట్లు, ఆదివారం రూ. 52.85 కోట్లు, సోమవారం రూ. 31.05 కోట్లు, మంగళవారం రూ. 26.10 కోట్లు, బుధవారం రూ. 28.50 కోట్లు, గురువారం రూ. 16.10 కోట్లు చొప్పున నెట్ వసూలు చేసింది. ఈ వారాంతంలో కూడా పుంజుకుంటునందని భావిస్తున్నారు.
2019-05-03 Read Moreప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీసిన సినిమాను లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో ‘‘పిఎం నరేంద్ర మోదీ’’ పేరిట తీసిన సినిమాను 23 బాషల్లో డబ్ చేశారు. తొలి దశ పోలింగ్ రోజైన ఏప్రిల్ 11న దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడానికే పోలింగ్ సమయంలో అన్ని బాషల్లో విడుదల చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ఈసీ స్పందించి విడుదలను అడ్డుకుంది.
2019-05-03 Read Moreప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విద్వేష ప్రసంగాలు, సైనిక కార్యకలాపాలను ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం వంటి అంశాలపై ఈ నెల 6వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. మోదీ, షాలపై ఫిర్యాదులను ఈసీ పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ నేత సుష్మితాదేవ్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ప్రసంగ పాఠాలను పరిశీలించడానికి ఎక్కువ సమయం కావాలని ఎన్నికల సంఘం కోరగా ‘‘మీకు ఈరోజు, శుక్రవారం.. ఆదివారం కూడా సమయం ఉంది. సోమవారం రండి’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఉద్ఘాటించారు.
2019-05-02 Read Moreసిబిఎస్ఇ క్లాస్ 12 పరీక్షల్లో అమ్మాయిలు అబ్బాయిలకంటే మెరుగ్గా ఫలితాలను సాధించారు. ఘజియాబాద్ అమ్మాయి హన్సిక శుక్లా, ముజఫర్ నగర్ అమ్మాయి కరిష్మా అరోరా 500 మార్కులకు గాను ఏకంగా 499 సాధించి ఉమ్మడిగా మొదటి ర్యాంకును కైవశం చేసుకున్నారు. 498 మార్కులు సాధించిన గౌరంగి చావ్లా (రిషికేష్), ఐశ్వర్య (రాయ్ బరేలి), భవ్య (జింద్) ఉమ్మడిగా రెండో ర్యాంకును సాధించారు. మొత్తంగా అమ్మాయిల్లో 88.70 శాతం పాసయితే అబ్బాయిల్లో 79.40 శాతం మాత్రమే పాసయ్యారు. గురువారం ఈ ఫలితాలు విడుదలయ్యాయి.
2019-05-02 Read Moreవస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద ఏప్రిల్ మాసంలో రూ. 1.13 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇప్పటివరకు అత్యధిక మొత్తం ఇదేనని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2018 ఏప్రిల్ తో పోలిస్తే ఇది 10 శాతం అధికం. 2019 తొలి నాలుగు మాసాల్లో లక్ష కోట్లు దాటి వసూలు కావడం ఇది మూడోసారి. డిసెంబరులో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ జరిగినా... పన్ను చెల్లించేవారి సంఖ్య పెరగడంవల్ల వసూలు అధికంగా ఉందంటున్నారు. ఏప్రిల్ వసూళ్లలో ఐజీఎస్టీ పంపిణీ తర్వాత నికరంగా కేంద్రానికి రూ. 47,533 కోట్లు, రాష్ట్రాలకు రూ. 50,776 కోట్లు రానున్నాయి.
2019-05-01 Read Moreవచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ... పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలలోనూ 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బుధవారం మధ్యప్రదేశ్ ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ, కనీస ఆదాయ పథకం (న్యాయ్) కింద రూ. 72 వేలను మహిళల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామన్నారు. ఈ పథకానికి అవసరమైన నిధులు అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మేహుల్ చోక్సీ వంటి వారినుంచి వస్తాయని రాహుల్ ఉద్ఘాటించారు.
2019-05-01 Read Moreమహారాష్ట్రలో మావోయిస్టులకు పట్టున్న గడ్చిరోలి జిల్లాలో బుధవారం ఓ ఐఇడి పేలుడులో 15 మంది జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మరణించారు. ముందు రోజు రాత్రి దాద్పూర్ గ్రామం వద్ద రోడ్డు నిర్మాణంలో పాలు పంచుకుంటున్న 36 వాహనాలను నక్సల్స్ దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో భద్రతకోసం వినియోగించిన ప్రత్యేక పోలీసు దళాన్ని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఇటీవల ఇద్దరు సీనియర్ మహిళా మావోయిస్టులను ప్రత్యేక దళాలు కాల్చి చంపిన ఘటనకు ప్రతీకారంగానే తాజా దాడి జరిగినట్టు భావిస్తున్నారు.
2019-05-01 Read More