ఇంటర్నెట్ ద్వారా భావ వ్యక్తీకరణ చేసే స్వేచ్ఛ రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఇంటర్నెట్ మాథ్యమం ద్వారా భావ వ్యక్తీకరణ, వాణిజ్యం లేదా ఇతర వృత్తి బాధ్యతలు నిర్వర్తించే హక్కుకు 19(1)(ఎ), 19(1)(జి) అధికరణల కింద రాజ్యాంగ రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు ఎన్.వి. రమణ, సూర్యకాంత్, బి.ఆర్. గవాయ్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కాశ్మీర్లో ఇంటర్నెట్ నిలిపివేతపై విచారణ జరిపింది.
2020-01-10 Read Moreఅమరావతి ఉద్యమాన్ని అణచివేసే చర్యల్లో పోలీసులు శుక్రవారం మరో అడుగు ముందుకు వేశారు. మహిళలపైనా ముందు రోజులకంటే మరింత కఠినంగా వ్యహరించారు. ధూషణ, చేయి చేసుకోవడంతో పాటు వివిధ పోలీసు స్టేషన్లలో పెట్టి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టారు. శుక్రవారం విజయవాడలో అమరావతికోసం ర్యాలీ చేసిన మహిళలను అరెస్టు చేసి రాత్రైనా వదిలిపెట్టలేదు. దీంతో జెఎసి నాయకులు వారి విడుదలకోసం ఆందోళనకు దిగారు.
2020-01-10అమరావతి ఉద్యమానికి మద్ధతుగా విజయవాడలో మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. బందురు రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. బెంజ్ సర్కిల్ వద్దకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకోవడంతో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో... చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి. చివరికి అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ర్యాలీలోనూ పోలీసులు చేతులు వేయడంపై మహిళలు మండిపడ్డారు.
2020-01-10ఏపీ సిఎం జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో ఒకటైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో అనుబంధ ఛార్జిషీటును కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, రిటైర్డ్ అధికారులు వీడీ రాజగోపాల్, శామ్యూల్ కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఉమ్మడి ఏపీలో పెన్నా సిమెంట్స్ కు గనుల కేటాయించినప్పుడు గనులు, రెవెన్యూ మంత్రులుగా సబిత, ధర్మాన పని చేశారు.
2020-01-10అమరావతి రైతుల ఆవేదన వర్ణనాతీతం. ప్రాణసమానమైన భూములను రాజధానికోసం ఇచ్చి.. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ జీవితాలు ఏమవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం మరో రైతు గుండె ఆగింది. వెంకటపాలెం గ్రామానికి చెందిన నందకుమారి (56) గుండెపోటుతో చనిపోయింది. ఆమె రాజధాని ఆందోళనల నేపథ్యంలోనే ఒత్తిడికి గురైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే 10 మంది రైతులు, కూలీలు మరణించారు.
2020-01-10రాజధాని అమరావతి పరిరక్షణకోసం జరగుతున్న ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శుక్రవారం తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గ గుడికి పాదయాత్ర తలపెట్టిన మహిళలను అడ్డుకొని, ముందుకు సాగుతున్నవారిపై లాఠీలు ఝళిపించారు. ధర్నాకు కూర్చున్న వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. వయో, లింగ భేదాలు లేకుండా అందరిపైనా దాష్ఠీకం ప్రదర్శించారు. గాయపడిన మహిళలను కూడా వదలకుండా పోలీసు స్టేషన్లకు తరలించారు.
2020-01-10వ్యక్తిగత హాజరు నుంచి మినహాయంపు ఇవ్వడానికి సీబీఐ కోర్టు గత వారం నిరాకరించడంతో ఈ శుక్రవారం కోర్టుకు వచ్చిన జగన్, మరోసారి మినహాయింపు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విన్నపాన్ని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యతిరేకించింది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వరాదని వాదించింది. ఈ అంశంపై కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 24న వెలువరించనుంది. అప్పటివరకు మరో రెండుసార్లు జగన్ కోర్టుకు హాజరు కాక తప్పదు.
2020-01-10రాజధాని గ్రామాల్లో పరామర్శలకు వెళ్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ ప్రకాశం జిల్లానుంచి వస్తుండగా కాజ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదని ఓ నోటీసు అందించారు. పార్టీ కార్యాలయానికి వెళ్తానన్నా వినకుండా లోకేష్, కళా వెంకట్రావులను అదుపులోకి తీసుకొని వారి వాహనంలోనే తెనాలివైపు తరలించారు.
2020-01-10అక్రమ ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. సిఎం అయ్యాక ఆయన కోర్టుకు రావడం ఇదే తొలిసారి. వ్యక్తిగత హాజరు నుంచి పదే పదే మినహాయింపు కోరిన జగన్ 30 వారాల పాటు కోర్టు హాజరు కాలేదు. ఇక మినహాయింపులు కుదరవని గత వారం కోర్టు స్పష్టం చేసింది. దీంతో, వివిధ కేసుల్లో ఎ1గా ఉన్న జగన్, ఎ2గా ఉన్న విజయసాయిరెడ్డి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు.
2020-01-10రాజధాని అమరావతి పరిధిలో పోలీసుల నిర్భంధం పెరిగింది. నిన్న కొన్ని గ్రామాల్లో కవాతు నిర్వహించిన పోలీసులు, శుక్రవారం వేకువజాము నుంచి ఊరూరా ఇంటింటికీ తిరిగారు. గ్రామాల్లో ప్రతి చోటా కంచెలు దర్శనమిస్తున్నాయి. నిరసనలకు ఎవరూ పోగవకుండా ఎక్కడికక్కడే నిర్భంధించారు. గుడికి వెళ్తామంటూ బయటకు వచ్చిన మహిళలను అడ్డుకొని బలవంతంగా పోలీసు వాహనాల్లో తరలించారు. ఈ సందర్భంగానే కొంతమందిపై చేయి చేసుకున్నారు.
2020-01-10