పూర్వపు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలతో ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తెలంగాణ యూటీఎఫ్ అభ్యర్ధి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తెలంగాణ పీఆర్టీయూ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓడిపోయారు. ఈ ఎన్నికలు పార్టీలవారీగా జరగకపోయినా... అనుబంధ సంఘాలు లేదా అనుకూలురకు వివిధ పార్టీలు మద్ధతు ఇచ్చాయి. సీపీఎం మద్ధతుతో నర్సిరెడ్డి బరిలోకి దిగారు. నియోజకవర్గంలో మొత్తం 18,885 ఓట్లు పోల్ కాగా... అందులో నర్సిరెడ్డి 8,976, పూల రవీందర్ 6,279 ఓట్లు సాధించారు.
2019-03-26దేశంలోని 20 శాతం జనాభాకు వర్తించే తమ కనీస ఆదాయ పథకాన్ని ‘‘పేదరికంపై కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్’’గా రాహుల్ గాంధీ అభివర్ణించారు. సోమవారం తాను ప్రకటించిన పథకాన్ని ‘‘బిగ్ బ్యాంగ్’’తోనూ పోల్చారు. మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాజస్థాన్ లోని గంగానగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధనికులు, బడా పారిశ్రామికవేత్తలకు డబ్బు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ పేదలకు సేవ చేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. ‘‘వాళ్ళు పేదలను నిర్మూలించడానికి పని చేశారు. మేము పేదరికాన్ని నిర్మూలిస్తాం’’ అని ఉద్ఘాటించారు.
2019-03-26 Read Moreఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఓ బాంబు పేల్చారు. తండ్రి మరణం తర్వాత తనను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ అధిష్ఠానానికి రూ. 1,500 కోట్లు ఇస్తానని జగన్ చెప్పారని ఫరూక్ వెల్లడించారు. అప్పట్లో జగన్ తనకు చెప్పిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేయదలచుకున్నానని ఫరూక్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆయన చంద్రబాబుతో కలసి టీడీపీ ఎన్నికల సభలో మాట్లాడారు. ‘‘అతనికి అంత సొమ్ము ఎలా వచ్చింది? దోపిడీ ద్వారా వచ్చిన ఖజానా ఎక్కడైనా పూడ్చి పెట్టారా’’ అని ఫరూక్ ప్రశ్నించారు.
2019-03-26జనవరిలో ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత గత రెండున్నర నెలల్లో పాతిక లక్షలకు పైగా (25,20,924) పేర్లు వచ్చి చేరాయి. తొలగించిన 1,41,823 ఓట్లు పోగా తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 3,93,12,192గా తేలింది. ప్రత్యర్థి పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఓట్ల తొలగిపులు పరిమితంగా జరిగాయి. అదే సమయంలో చేర్పులు బాగా పెరిగాయి. జనవరి 11 నాటికి ఉన్న ఓట్ల సంఖ్య 3,69,33,091.
2019-03-25ఈ నెల 18వ తేదీన నామినేషన్ల గడువు ప్రారంభమయ్యాక తొలి 5 రోజుల్లో అసెంబ్లీకి 1419 నామినేషన్లు, లోక్ సభకు 199 నామినేషన్లు దాఖలయ్యాయి. 22వ తేదీ వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల వివరాలను అధికారులు సోమవారం వెల్లడించారు.
2019-03-25కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ. 72,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. సోమవారం సిడబ్ల్యుసి సమావేశం తర్వాత రాహుల్ ఎన్.వై.ఎ.వై. పేరిట కొత్త పథకాన్ని ప్రకటించారు. దేశ జనాభాలో 25 కోట్ల మంది ఈ పథకం ద్వారా నేరుగా లబ్ది పొందుతారని రాహుల్ గాంధీ చెప్పారు. కొత్త పథకానికి సంబంధించి లెక్కలన్నీ వేశామని, ఇలాంటి ఓ పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు.
2019-03-25భూతద్దం పెట్టి వెతికినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కు వెళ్లిందని దుయ్యబట్టారు. "పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని మీరు చెప్పలేదా చంద్రబాబూ.. నేటికీ అది పూర్తి కాలేదంటే మీ అసమర్ధత కాదా" అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి దిగుతున్న షర్మిల సోమవారం వివిధ అంశాలపై మాట్లాడారు.
2019-03-25ఐపిఎల్ 2019 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ కు తొలి ఎదురు దెబ్బ. నాలుగో ఓవర్లోనే విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. హర్బజన్ సింగ్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా క్యాచ్ పట్టగా కోహ్లీ పెవిలియన్ దారి పట్టారు. సీజన్ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య శనివారం ప్రారంభమైంది. టాస్ గెలిచి కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఛాలెంజర్స్ తరపున ఓపెనర్లుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్ రంగంలోకి దిగారు.
2019-03-23రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిచినట్టేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఎన్నికల సభలో మాట్లాడిన పవన్, ‘‘కేసీఆర్ గారూ.. మీరు తటస్థంగా ఉండాలి కదా! తెలంగాణలో ఆంధ్రావాళ్ళు రాజకీయం చేయకూడదుగాని మీరు ఇక్కడ చేయవచ్చా? మీరు చంద్రబాబుకు వ్యతిరేకమైతే మాకు అభ్యంతరం లేదు. ఆయనకు నేనూ వ్యతిరేకమే. కానీ, మీరు ఒకప్పుడు తరిమికొట్టిన జగన్ కు మద్ధతు ఇవ్వడం ఏమిటి’’ అని పవన్ తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
2019-03-23‘‘కేసీఆర్ ఓ నియంత.. నరేంద్ర మోదీ ఓ నియంత.. రాష్ట్రానికి రావలసినవి అడిగితే నాపై దాడులు చేస్తున్నారు. ఈడీ కేసులు పెడుతున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.కేసీఆర్ పోలవరంపై కేసులు వేశారని, అడిగితే ఆర్ధిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. శనివారం కృష్ణా జిల్లా నాగాయలంకలో ఎన్నికల సభలో మాట్లాడిన చంద్రబాబు ‘‘జగన్ పై తెలంగాణలో కేసులున్నాయి. ఈయన గెలిస్తే ఆయనకు ఊడిగం చేస్తాడని మద్ధతు ఇస్తున్నారు. మీకు రోషం లేదా? కేసీఆర్ పైన కోపం ఉందా లేదా?’’ అని ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు.
2019-03-23