సైనిక దళాలను ‘మోడీ సేనలు’గా అభివర్ణించినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు అందుకున్నారు. ముఖ్యమంత్రి గురువారం లోగా సమాధానం ఇవ్వాలని కోరినట్టు ఉత్తరప్రదేశ్ ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. మార్చి 31వ తేదీన గజియాబాద్ ర్యాలీలో ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ‘‘వాళ్ళు ఉగ్రవాదులకు బిర్యానీ పెడితే, మోదీ సేనలు బుల్లెట్లు, బాంబులతో బదులిచ్చాయి’’ అని యోగి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక నివేదిక పంపారు.
2019-04-04 Read Moreప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘ఫాసిస్టు’’, ‘‘మతోన్మాది’’, ‘‘అల్లర్ల కారకుడు’’, ‘‘పేదల వ్యతిరేకి’’ అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం సిలిగురిలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా స్పందించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ కాలపరిమితి ముగిసిన విషయాన్ని గుర్తు చేస్తూ... మోదీ ‘కాలం చెల్లిన బాబు’ అని మమత పదే పదే వ్యాఖ్యానించారు. అక్కడ సిలిగురిలో మోదీ ప్రసంగం సగంలో ఉండగానే ఉత్తర బెంగాల్ లోని దిన్హాతాలో తన ప్రసంగాన్ని మమత ప్రారంభించారు.
2019-04-03 Read Moreఅత్త, ఆమె మేనల్లుడు కలసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దుయ్యబట్టారు. బెంగాల్ లోని సిలిగురిలో మోదీ బీజేపీ ఎన్నికల సభలో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో వేగవంతంగా అభివృద్ధి చేసి చూపించగలిగానని, బెంగాల్ లో మాత్రం మమత ఆటంకంగా మారారని ప్రధాని ఆరోపించారు. మమతను ‘‘స్పీడ్ బ్రేకర్ దీదీ’’గా వ్యవహరించిన మోదీ, ఆమెను అధికారంనుంచి తొలగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
2019-04-03 Read Moreయుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలి (ఉత్తరప్రదేశ్) సీటును కాంగ్రెస్ రెబల్ ఎం.ఎల్.సి. దినేష్ ప్రతాప్ సింగ్ కు కేటాయించింది బీజేపీ అధిష్ఠానం. దినేష్ సింగ్ ఇంతకు ముందు గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా మెలిగారు. ఆ జిల్లాలో పార్టీకి బలమైన నేతగా పేరుంది. ఏడాది క్రితం సింగ్ బీజేపీలో చేరారు. దీంతో.. ఆయనపై గతంలో ఉన్న క్రిమినల్ కేసును యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రాయ్ బరేలిలో సోనియా గాంధీ 1999 నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు.
2019-04-03‘‘32 సంవత్సరాల తర్వాత... అరుణాచల్ ప్రదేశ్ లోని నాలుగు పోలీసు స్టేషన్ల పరిధిలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఆ పని చేస్తే అది దేశభక్తి. ఇతరులెవరైనా ఆ విషయమై ఆలోచన చేసినా, మాట్లాడినా వారు సాయుధ బలగాలకు వ్యతిరేకులు, జాతి వ్యతిరేకులు. అబద్ధాల ప్రపంచానికి స్వాగతం’’ అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా బుధవారం విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రత్యేక అధికారాల చట్టంపై పేర్కొన్న అంశాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టిన నేపథ్యంలో సిన్హా ట్విట్టర్ ద్వారా స్పందించారు.
2019-04-03’‘అన్నదాతా సుఖీభవ పథకం కింద తొలి విడతలో మిగిలిన రూ. 3000ను రైతుల ఖాతాల్లోకి ఈరోజు బదిలీ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1349.81 కోట్లు జమ చేశాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ట్విట్టర్ లో వెల్లడించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, రైతులపట్ల టీడీపీ ప్రభుత్వానికి ఉన్న బాధ్యతకు ఇదే నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.
2019-04-03అర్హతలున్న మాజీ సైనికులను సివిల్ సర్వీసులలోకి ‘లేటరల్ ఎంట్రీ’ ద్వారా అనుమతిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అలాగే 40 ఏళ్లలోపు వయసున్న మాజీ సైనికులకు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో అవకాశం కల్పిస్తామని బుధవారం ట్విట్టర్లో రాహుల్ పేర్కొన్నారు. ‘‘మన మాజీ సైనికులు ఇండియాకు గర్వకారణం. వారికి తగిన గౌరవం ఇవ్వాలి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
2019-04-03 Read Moreకేంద్ర సమాచార ప్రసార (ఐబి) శాఖ జాబితాలో లేకుండా.. ఎన్నికల ముందు దేశమంతా ప్రారంభమైన ‘నమో టివి’పై ప్రతిపక్షాల ఫిర్యాదులకు ఈసీ స్పందించింది. ఈ టీవీ విషయమై ఐబి శాఖ స్పందనను ఈసీ కోరినట్టు వార్తలు వచ్చాయి. ‘కంటెంట్ టీవీ’గా గత వారం ప్రారంభమైన ‘నమో టివి’ టాటా స్కై, డిష్ టివి, ఎయిర్ టెల్, సిటి నెట్ వర్క్ సహా డిటిహెచ్ లోనూ, బయటా ప్రసారమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలు, ప్రసంగాల ప్రసారానికి పూర్తిగా అంకితమైంది. ఈ టీవీ అనధికారిక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఛానలా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.
2019-04-03ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును, ప్రతిపక్ష నేత జగన్ ను తిరస్కరిస్తారని, ఎన్నికల తర్వాత జనసేన-బి.ఎస్.పి-వామపక్షాల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ధీమా వ్యక్తం చేశారు. కూటమి ఎన్నికల ప్రచారంకోసం రాష్ట్రానికి వచ్చిన మాయావతి, బుధవారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా మాయావతి చెప్పగా... సోదరి మాయావతి ప్రధానమంత్రి కావాలని పవన్ ఆకాంక్షించారు.
2019-04-03 Read Moreపురుష-పురుష లైంగిక సంబంధాలు, అక్రమ సంబంధాలలు పెట్టుకున్నవారిని రాళ్ళతో కొట్టి చంపేలా బ్రూనై దేశం కొత్త చట్టాలను బుధవారం ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా బ్రూనై శిక్షలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఆ దేశం పట్టించుకోలేదు. ఐక్యరాజ్యసమితి బ్రూనై శిక్షలను ‘‘క్రూరం, అమానవీయం’’ అన్నా, హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ బ్రూనైకి చెందిన హోటళ్ళను బహిష్కరించాలని పిలుపునిచ్చినా ఆ దేశ సుల్తాన్ వెనక్కు తగ్గలేదు. మానభంగం, దోపిడీ, మహ్మద్ ప్రవక్త ధూషణ వంటి నేరాలకు కూడా అక్కడ మరణశిక్షే అమలవుతుంది. దొంగలకు చేతులు, కాళ్ళు నరికి
2019-04-03 Read More