నిజం మాట్లాడినందుకు తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ‘‘మేకిన్ ఇండియా’’ అని చెప్పారని, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ‘‘రేప్ ఇన్ ఇండియా’’ కనిపిస్తోందని రాహుల్ గాంధీ నిన్న చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది. దీనికి రాహుల్ ‘‘నేను రాహుల్ సావర్కర్ కాదు... రాహుల్ గాంధీ’’ అని ఉద్ఘాటించారు. బ్రిటిషర్లను సావర్కర్ క్షమాపణ కోరిన ఉదంతాన్ని పరోక్షంగా గుర్తు చేశారు.
2019-12-14ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో... అత్యాచారాలకు మరణశిక్ష విధించాలని నిర్దేశిస్తూ ‘‘దిశ’’ బిల్లును ఆమోదించిన రోజే... హైదరాబాద్ హత్యాచార నిందితులను కాల్చి చంపిన పోలీసులను, అందుకు అనుమతించిన కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే ప్రశంసిస్తుండగానే... గుంటూరు నగరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. వాడ పేరు రామిరెడ్డి నగర్.. నిందితుడు లక్షణరెడ్డి.. ఇంటర్ విద్యార్థి. బాలిక అమ్మమ్మ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉల్లిపాయలకోసం వెళ్లి క్యూలో వేచి చూస్తున్న సమయంలో ఈ అత్యాచారం జరగడం గమనార్హం.
2019-12-13మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టాన్ని సవరించడంతో... ఈశాన్య భారతంలో వెల్లువెత్తిన నిరసనల సెగ ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. శనివారం బెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాలో లాల్గోలా రైల్వే స్టేషన్లో 5 ఖాళీ రైళ్లను ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఈ ప్రాంతం బంగ్లాదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. దక్షిణ, ఉత్తర బెంగాల్ ప్రాంతాలను కలిపే 34వ జాతీయ రహదారిని ముర్షీదాబాద్ జిల్లాలోనే నిరసనకారులు దిగ్బంధించారు.
2019-12-14ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ (యునైటెడ్) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో చేతులు కలిపారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి విజయవంతంగా వ్యూహాలు రచించిన ప్రశాంత్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. 2021 బెంగాల్ ఎన్నికలకోసం మమతా బెనర్జీతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ‘‘ఆప్’’తో కలసిన విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు.
2019-12-14 Read Moreపవన్ కళ్యాణ్ చెప్పే మాటలను నమ్మవద్దని, చేసే పనులను చూడాలని జనసేనకు రాజీనామా చేసిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ్ ప్రజలకు విన్నవించారు. జనసేన వ్యవస్థాపకుల్లో ఒకరైన రవితేజ్ రాజీనామా చేయగా.. ఆమోదిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రవితేజ్ విలేకరులతో మాట్లాడుతూ... పవన్ రాజకీయాలు కులం, మతం, హింస వైపు పయనిస్తున్నాయని విమర్శించారు. కుల, మత ప్రీతి లేని పవన్...వాటిని రాజకీయ సాధనాలుగా ఉపయోగించడం మరింత ప్రమాదకరమన్నారు.
2019-12-14‘‘స్పష్టంగా... ఇది సాధారణ మందగమనం కాదు. ఇది ఇండియా మహా మందగమనం. ఆర్థిక వ్యవస్థ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి వెళ్తోంది’’- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభిప్రాయం ఇది. హార్వార్డ్ యూనివర్శిటీలోని ‘సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్’ విశ్లేషణా పత్రంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పోగుబడ్డ నగదు బ్యాంకేతర ఆర్థిక సంస్థలకు, అక్కడినుంచి రియల్ ఎస్టేట్ సంస్థలకు చేరడాన్ని ఆయన విపులీకరించారు.
2019-12-14 Read More‘‘నమామి గంగె’’ ప్రాజెక్టుపైన సమీక్ష నిర్వహించడానికి శనివారం కాన్పూర్ వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ జారి పడ్డారు. గంగా ఘాట్ లోని మెట్లు ఎక్కుతుండగా తూలిపడిన ప్రధానిని ఆయన భద్రతా సిబ్బంది పట్టుకొని లేపారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో కూడిన గంగా కౌన్సిల్ తొలి సమావేశాన్ని మోదీ స్వయంగా నిర్వహించారు. చంద్రశేఖర్ ఆజాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని గంగా ఘాట్ ను సందర్శించారు.
2019-12-14సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్ చదివేవారికి ఏడాది పాటు శిక్షణ ఉండేలా కోర్సులలో మార్పులు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర యూనివర్శిటీ పూర్వ విద్యార్ధుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. డిగ్రీని ఇక ఆనర్స్ డిగ్రీగా మార్చి ఏడాది ప్రాక్టికల్ శిక్షణ అందిస్తామని సిఎం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేపట్టామని జగన్ చెప్పారు.
2019-12-13ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిపక్ష సభ్యులు శమంతకమణి, దీపక్ కుమార్, అశోక్ బాబుల ప్రశ్నకు ప్రభుత్వం శుక్రవారం శాసనమండలిలో రాతపూర్వక సమాధానమిచ్చింది. ‘‘అమరావతి నుండి రాజధానిని మార్చే ప్రతిపాదన ఏదైనా ఉందా?’’ అన్న ప్రశ్నకు ‘‘లేదండీ’’ అని, ‘‘ఇప్పటివరకు అమరావతి అభివృద్ధికోసం ఖర్చు చేసిన నిధుల వివరాలేమిటి?’’ అన్న ప్రశ్నకు ‘‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’’ అని పట్టణాభివృద్ధి శాఖ బదులిచ్చింది.
2019-12-13ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అనని బూతు మాటను అన్నట్టుగా చెప్పి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని తప్పు దోవ పట్టించారని తెలుగుదేశం పార్టీ మండిపడింది. దీనిపై సిఎంకు ‘‘సభా హక్కుల ఉల్లంఘన’’ నోటీసు ఇచ్చింది. శుక్రవారం శాసనసభకు గుంపుగా వస్తున్న టీడీపీ సభ్యులను గేటు వద్ద మార్షల్స్ అడ్డుకోవడంతో వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఒక అధికారిని ‘‘బాస్టర్డ్’’ అని తిట్టారని సిఎం సహా పలువురు మంత్రులు శాసనసభలో తప్పుపట్టారు.
2019-12-13