జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలు చకచకా జరుగుతున్నాయి. మొదటిగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను మార్చారు. చంద్రబాబు హయాంలో ఉన్న సిఎంఒ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, కార్యదర్శులు ఎం. గిరిజా శంకర్, అడుసుమిల్లి రాజమౌళిలను బదిలీ చేస్తూ గురువారమే జీవో ఆర్.టి. నెంబర్ 1170 జారీ అయింది. వారికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.
2019-05-30ప్రమాణ స్వీకారోత్సవ వేదికనుంచే నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 మీడియా సంస్థలకు గట్టి హెచ్చరిక చేశారు. తమ ప్రభుత్వంపై దురుద్ధేశంతో వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేసి శిక్షలు విధించాలని హైకోర్టును కోరతామని చెప్పారు. ‘‘ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 సంస్థలకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగిలినవాళ్ళను ఎప్పుడెప్పుడు దింపాలి.. అనే ఆలోచనతో వారి రాతలు ఉంటాయి’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
2019-05-30విభజిత ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నతికి కలసి పని చేద్దామని మోదీ సూచించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కూడా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న ఆశాభావాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
2019-05-30 Read Moreప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రెండవ ప్రభుత్వం కొలువుదీరింది. మోదీతో పాటు ఒకేసారి 57 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ప్రమాణ స్వీకార కార్యక్రమం రెండు గంటలకు పైగా కొనసాగింది. తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి ఒక్కరికే ఛాన్స్ దక్కింది. మంత్రివర్గంలో తన పేరు చేర్చవద్దని అరుణ్ జైట్లీ నిన్న లేఖ రాయగా.. సుష్మాస్వరాజ్, మేనకాగాంధీ, ఉమా భారతిల పేర్లు కూడా మిస్సయ్యాయి. సీనియర్లలో రాజ్ నాథ్ సింగ్ కొనసాగుతుంటే..బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొత్తగా చేరారు.
2019-05-30ఉభయ రాష్ట్రాల్లోనూ, దేశవిదేశాల్లోనూ ఉన్న తెలుగువారంతా పరస్పర గౌరవంతో, ప్రేమతో మెలగాలని తెలంగాణ సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంకోసం విజయవాడ వచ్చిన కేసీఆర్... ఇప్పుడు రెండు రాష్ట్రాలు చేయవలసింది ఖడ్గచాలనం కాదని, కరచాలనమని ఉద్ఘాటించారు. ప్రజలిచ్చిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గోదావరి జలాల సంపూర్ణ వినియోగం జగన్ కర్తవ్యం కావాలని కేసీఆర్ ఉద్భోదించారు.
2019-05-30ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర మంత్రివర్గ సభ్యుల పదవీ స్వీకార ప్రమాణోత్సవానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ హాజరు కాలేదు. గురువారం మధ్యాహ్నం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో అతిధులకు ఇచ్చిన విందు ఆలస్యం కావడమే ఇందుకు కారణం! అతిధుల్లో తెలంగాణ సిఎం కేసీఆర్, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ఉన్నారు. లంచ్ ముగిసేసరికి మధ్యాహ్నం 2.30 కాగా... 3.30 గంటల తర్వాత ఢిల్లీలో ప్రత్యేక విమానం దిగడానికి అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు.
2019-05-30 Read Moreతాము కేంద్ర మంత్రివర్గంలో చేరబోవడంలేదని జనతాదళ్ (యునైటెడ్) అధికార ప్రతినిధి గురువారం చెప్పారు. మంత్రి పదవుల సంఖ్య విషయంలో భేదాభిప్రాయల నేపథ్యంలో జెడి (యు) ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి కొద్దిగా ముందు జెడి(యు) తమ నిర్ణయాన్ని ప్రకటించింది. జెడి(యు)కు ఒకే ఒక్క మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్టు సమాచారం. దానికి తోడు తమకు ప్రతిపాదించిన మంత్రిత్వ శాఖ పట్ల కూడా నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
2019-05-30నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గురువారం రాత్రి 7.00 గంటలకు రాష్ట్రపతి భవన్ లోని ప్రెసిడెన్షియల్ ప్యాలస్ ఎదుట జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో.. మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన గడ్కరీ, సదానందగౌడ, నిర్మలా సీతారామన్, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, హరిసిమ్రత్ కౌర్, థావర్ చంద్ గెహ్లాట్, సుబ్రహ్మణ్యం జయశంకర్, రమేష్ పోఖ్రియాల్, అర్జున్ ముండా ఇప్పటిదాకా ప్రమాణం చేసినవారిలో ఉన్నారు.
2019-05-30విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బహిరంగ వేదికపై జగన్ ప్రమాణం చేశారు. గవర్నర్ కెఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ అతిధులుగా హాజరయ్యారు. జగన్ తల్లి విజయలక్ష్మి, భార్య భారతి, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
2019-05-30విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రమాణం చేయించడానికి గవర్నర్ నరసింహన్ బుధవారమే విజయవాడ వచ్చారు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, డిఎంకె అధినేత ఎం.కె. స్టాలిన్ రావలసి ఉంది.
2019-05-30