జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత తొలి లెఫ్టినెంట్ గవర్నరుగా ఐఎఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్మును కేంద్రం నియమించింది. ఆయనతోపాటు మరో ఐఎఎస్ ఆర్.కె. మాథుర్‌ను లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నరుగా నియమించింది. స్వయంప్రతిపత్తిగల ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి గవర్నరుగా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్ తాజాగా గోవాకు బదిలీ అయ్యారు. 1985 బ్యాచ్ గుజరాత్ కేడర్ అధికారి అయిన ముర్ము కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (వ్యయ విభాగం) కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
2019-10-25రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణాలు నిలిచిపోవడం కార్మికుల పాలిట శాపంగా మారింది. తెనాలి వద్ద సంగం జాగర్లమూడిలో బ్రహ్మాజీ అనే తాపీ మేస్త్రి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఐదు నెలలుగా పనులు లేక మానసిక వేధనతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన భార్య చెబుతున్నారు. తనకు పనులు లేకపోవడంతో తన భార్య కూలిపనికి వెళ్లవలసి వస్తోందని బ్రహ్మాజీ ఆవేదన వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.
2019-10-25హర్యానాలో తాతలు స్థాపించిన ఐ.ఎన్.ఎల్.డి.ని చీల్చి జన్ నాయక్ జనతా పార్టీ (జెజెపి)ని స్థాపించిన దుష్యంత్ చౌతాలా బీజేపీకి స్నేహహస్తం చాచారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన బీజేపీకి మద్ధతు ప్రకటించే అవకాశం ఉంది. చౌతాలాను హర్యానా డిప్యూటీ సిఎంగా ప్రకటించవచ్చని సమాచారం. 90 సీట్ల హర్యానా అసెంబ్లీలో ఎవరికీ మెజారిటీ రాని పరిస్థితుల్లో జెజెపి గెలిచిన 10 సీట్లు కీలకమయ్యాయి.
2019-10-25 Read Moreతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే (గన్నవరం) వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలసి వంశీ తాడేపల్లిలోని సిఎం నివాసానికి వెళ్ళారు. వంశీ నకిలీ ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారంటూ ఇటీవల కేసు నమోదైంది. సీఎంను ఈ కేసు విషయమై కలిశారా? అధికార పార్టీలో చేరతారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిఎంను కలవక ముందు వంశీ గుంటూరులో బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు.
2019-10-25మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెపి-శివసేన కూటమి 161 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్-ఎన్.సి.పి. కూటమికి 98 స్థానాలు దక్కాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమికి 185 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 83 సీట్లు లభించాయి. బీజేపీ కూటమి గతంకంటే 24 సీట్లు కోల్పోయినా అధికారానికి ఢోకా లేదు. ఎన్.సి.పి. గతం (41) కంటే సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది (54). మొత్తం 15 పార్టీలు, అదనంగా మరో 13 మంది ఇండిపెండెంట్లతో మహారాష్ట్ర అసెంబ్లీ వైవిధ్యభరితంగా మారింది.
2019-10-24కాషాయ కూటమి ఏకపక్ష విజయాలకు గండిపడింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్ల కంటే చాలా తక్కువ లభించాయి. మరాఠా నేలపై బిజెపి-శివసేన కూటమి విజయం సాధించినా 161 సీట్లకు పరిమితమైంది. హర్యానాలో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. మొత్తం 90 సీట్లలో బీజేపీ 40కి పరిమితమైంది. మహారాష్ట్రలో 2014 కంటే అధికార కూటమికి సీట్ల సంఖ్య బాగా తగ్గగా హర్యానాలో సొంతగా అధికారంలోకి రాలేని పరిస్థితి నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన చోట ఇప్పుడు కమలం కాస్త వాడినట్టు కనిపిస్తోంది.
2019-10-24‘‘ముగిసేది సమ్మె కాదు... ఆర్టీసీనే’’ అని తెలంగాణ సిఎం కేసీఆర్ గురువారం పదే పదే ప్రకటించారు. వచ్చే వారం 7000 ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తామనీ చెప్పారు. ఆ ప్రకటనల్లోని అంతరార్ధం... ఆర్టీసీ కార్మికులను మరింతగా భయపెట్టి సమ్మెను భగ్నం చేయడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తబస్సులకోసమని చెప్పిన కొద్ది రోజుల సమయం నిజానికి కార్మికులకు విధించిన ‘డెడ్ లైన్’గా భావిస్తున్నారు. 30న ‘సకలజనుల సమరభేరి’ జరగక ముందే సమ్మెను ముగించడమే అసలు లక్ష్యమట! కేసీఆర్ మాటలకు అర్ధాలే వేరు!!
2019-10-24ఆర్టీసీనే ముగుస్తుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు భయపడవద్దని కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు. గురువారం కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం ఆయన నాగర్ కర్నూలులో కార్మికులతో మాట్లాడారు. ఉద్యోగులను తీసేసే అధికారం ఎవరికీ లేదన్న అశ్వత్థామరెడ్డి, కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే న్యాయస్థానాలు ఊరుకోవని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన సరూర్ నగర్లో నిర్వహించే సకల జనుల సమరభేరిని విజయవంతం చేయాలని కోరారు.
2019-10-24ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనపైన ఏపీలో ఓ ప్రయోగం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. "ఏపీలో ఏ మన్నూ జరగలేదు. ఏం చేశారు? కమిటీ వేశారు. ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి" అని గురువారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అనేది భూగోళం ఉన్నంత వరకు జరగదని ఉద్ఘాటించారు. ఏపీలో ఏం జరుగుతుందో మూడు నెలలకో.. ఆరు నెలలకో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
2019-10-24హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఊపులో కేసీఆర్ ఆర్టీసీ ప్రైవేటీకరణపై సత్వర నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో 7000 (ప్రైవేటు) బస్సులకు రూటు పర్మిట్లు మూడు రోజుల్లో ఇస్తామని గురువారం ప్రకటించారు. దానికి కేబినెట్ నిర్ణయం కూడా అవసరం లేదని, తాను రవాణా శాఖ మంత్రితో చర్చించి ఒక్క సంతకం చేస్తే సరిపోతుందని కేసీఆర్ చెప్పారు. ఆర్టీసీ అయినా.. ప్రైవేటు అయినా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం ముఖ్యమని చట్టాలు చెబుతున్నాయని సిఎం పేర్కొన్నారు.
2019-10-24