తెలుగుదేశం పార్టీ డేటా దొంగతనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తయారు చేసిన ప్రణాళిక వెల్లడైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శనివారం ఉదయం టెలికాన్ఫరెన్సులో పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు ‘‘దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్ళు అనుకుంటారు. కానీ ఎక్కడో ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన ఓ సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ వివరాలు వెల్లడిస్తా’’ అని చంద్రబాబు ఆసక్తికర ప్రకటన చేశారు.
2019-03-09సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఇ)ల ద్వారా కొత్తగా వచ్చిన ఉద్యోగాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. గత నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఇలలో నికరంగా 16,034 ఉద్యోగాలు కొత్తగా వచ్చినట్టు భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సర్వే తేల్చింది. దేశవ్యాప్తంగా కల్పించిన 3.32 లక్షల ఉద్యోగాల్లో ఏపీ వాటా 4.82 శాతంగా ఉంది. అదే సమయంలో తెలంగాణ వాటా 9.92 శాతం (32,982 ఉద్యోగాలు)గా ఉండటం విశేషం. అంతకు ముందు మూడేళ్ళతో పోలిస్తే 2015-16, 2018-19 మధ్య కాలంలో ఎంఎస్ఎంఇలలో కొత్త ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోయాయి.
2019-03-09 Read Moreచిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా గత నాలుగేళ్లలో (2015-16 నుంచి 2018-19 వరకు) కేవలం 3,32,394 ఉద్యోగాలు వచ్చినట్టు సిఐఐ సర్వే తేల్చింది. అంతకు ముందు 2014-15 వరకు గడచిన మూడేళ్ల కాలంలో 11,54,293 ఉద్యోగాలు ఎంఎస్ఎంఇ రంగంలో వచ్చాయని సర్వే నివేదిక పేర్కొంది. గత నాలుగేళ్లలో కల్పించిన ఉద్యోగాల్లో మూడు రాష్ట్రాల (మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ) వాటా 50 శాతంగా ఉన్నట్టు సిఐఐ తెలిపింది. కొత్త ఉద్యోగాల్లో 73 శాతం సూక్ష్మ తరహా పరిశ్రమల్లో కల్పించినవేనని సర్వేలో తేలింది.
2019-03-09 Read Moreపుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇండియా, పాకిస్తాన్ నిర్ణయించాయి. అందులో భాగంగా ఇండియాలో పాకిస్తాన్ హై కమిషనర్ సోహైల్ మహ్మద్, పాకిస్తాన్ లో భారత హై కమిషనర్ అజయ్ బిసారియా శనివారంనాడు తమ బాధ్యతలను తిరిగి చేపట్టనున్నారు. పుల్వామా దాడి తర్వాత ఇండియా, బాలాకోట్ వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ తమ దౌత్యవేత్తలను వెనక్కు పిలిచాయి. అజయ్ బిసారియా మార్చి 9న ఇస్లామాబాద్ వెళ్తారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ తెలిపారు. సోహైల్ మహ్మద్ కూడా శనివారమే ఢిల్లీకి తిరిగి వస్తారని సమాచారం.
2019-03-09 Read Moreరాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని, హిందూ పత్రిక కథనాలకు అవే ఆధారమని బుధవారం సుప్రీంకోర్టుకు చెప్పిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్.. శుక్రవారం మాట మార్చారు. పత్రాలు పోలేదని, సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష కోరిన పిటిషనర్లు సదరు పత్రాల ‘ఫొటో కాపీలు‘ ఉపయోగించారని శుక్రవారం చెప్పారు. ‘పరమ రహస్యం’గా చెబుతున్న పత్రాలు సాక్షాత్తు రక్షణ శాఖ నుంచి చోరీ అయ్యాయని సుప్రీంకోర్టుకు చెప్పడంపై దుమారం చెలరేగడంతో.. కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
2019-03-09 Read Moreపసుపు కుంకుమ పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని 97.8 లక్షల మంది మహిళలకు రూ. 3,500 చొప్పున మొత్తం రూ. 3,423 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొంది. మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగానే చెక్కులు ఇచ్చి శుక్రవారం నుంచే నగదు తీసుకునే అవకాశం కల్పించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
2019-03-08 Read Moreబాలాకోట్ ప్రాంతంలో బాంబులు వేసి 19 చెట్లను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ‘గుర్తు తెలియని’ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లపై పాకిస్తాన్ అటవీ శాఖ శుక్రవారం కేసు నమోదు చేసింది. జైష్ ఎ మహ్మద్ స్థావరంపై కొద్ది రోజుల క్రితం ఐఎఎఫ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారని ఇండియా ప్రకటించగా... ఐఎఎఫ్ బాంబు దాడిలో చెట్లు మాత్రమే కూలాయని, ఎవరూ మరణించలేదని పాకిస్తాన్ పేర్కొంది. ‘‘ఎకో టెర్రరిజం’’ ఆరోపణతో ఐక్యరాజ్యసమితికి పాకిస్తాన్ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.
2019-03-08 Read Moreకాలం చెల్లిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానాల్లో మరొకటి శుక్రవారం రాజస్థాన్ లోని బైకనూర్ జిల్లాలో కూలిపోయింది. బైకనూర్ పట్టణానికి సమీపంలోని నాల్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. అయితే, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద కారణాలపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ విచారణ జరుగుతుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మిగ్ 21 బైకనూర్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్టు ఆ జిల్లా ఎస్పీ ప్రదీప్ మోహన్ శర్మ తెలిపారు.
2019-03-08 Read Moreఅయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదానికి ‘శాశ్వతంగా పరిష్కారం’ కనుగొనే లక్ష్యంతో సుప్రీంకోర్టు ముగ్గురు మధ్యవర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్.ఎం.ఐ. కలీఫుల్లా నేతృత్వంలోని ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు ఉన్నారు. వివాదాస్పద స్థలం ఉన్న ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో జరిగే మధ్యవర్తుల కార్యకలాపాలను రహస్యంగా ఉంచాలని, మీడియాలో వార్తలు రాకుండా నిరోధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీకి 8 వారాల గడువు ఇచ్చింది.
2019-03-08 Read Moreపార్టీ ప్రెస్ మీట్లు, కార్యక్రమాలను కవర్ చేయకుండా టీవీ5ను నిషేధిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం శుక్రవారంనాడొక ప్రకటనలో తెలిపింది. ఆ ఛానెల్ నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ నేతలను ఆదేశించింది. ఇంతకు ముందే ‘ఏబీన్ ఆంధ్రజ్యోతి’ని నిషేధించిన విషయాన్ని ఆ ప్రకటనలో గుర్తు చేసింది. స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియాగా మారినవారిని బట్టబయలు చేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవలసి వస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది.
2019-03-08 Read More