ప్రస్తుత పార్లమెంటు భవనానికి అభిముఖంగా ఉన్న స్థలంలోనే కొత్త పార్లమెంటు నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. పార్లమెంటు భవనం ఎదుట 9.5 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఆ స్థల వినియోగ ప్రయోజనాన్ని ‘‘వినోదం’’ నుంచి ‘‘పార్లమెంటు హౌస్’’గా మార్చారు. తాజా ఢిల్లీ మాస్టర్ ప్లాన్-2021లో ఈమేరకు మార్పు చేశారు. 92 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రస్తుత పార్లమెంటు భవనం స్థానంలో కొత్తదాన్ని నిర్మించడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది.
2020-01-01 Read Moreఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభం వాయిదా పడింది. జనవరి 1నే గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించాలనుకున్నా, అన్ని చోట్లా వసతుల కల్పన పూర్తి కాలేదు. దీంతో, ఈ నెల 26 నాటికి పూర్తి చేసి ఆ రోజే ప్రారంభించాలని సిఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అన్ని చోట్లా కంప్యూటర్లతో సహా కనీస సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినా, సుమారు సగం కార్యాలయాల్లో ఇంకా సమకూరలేదని సమచారం.
2020-01-01ఈ నెల 15వ తేదీన చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. స్వేతసౌధంలో జరిగే ఈ ఒప్పందం ‘‘చాలా పెద్దది, సమగ్రమైనది’’ అని ట్రంప్ మంగళవారం ట్వీటారు. ఈ కార్యక్రమానికి చైనా నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. తొలి దశ ఒప్పందంపై సంతకాలు ముగిశాక తాను చైనాకు వెళ్తానని, అక్కడ రెండో దశ ఒప్పందంపై చర్చిస్తామని వెల్లడించారు.
2020-01-01 Read Moreపదవీ బాధ్యతలు చేపట్టిన రోజే నూతన సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణె పాకిస్థాన్‌కు తీవ్రమైన హెచ్చరిక చేశారు. పొరుగు దేశం ‘ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని’ ఆపకపోతే, ఉగ్రవాద మూలాలపై ముందస్తు దాడి చేసే హక్కు ఇండియాకు ఉందని ముకుంద్ వ్యాఖ్యానించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని శిక్షించడానికి... ధృఢమైన కఠువైన స్పందన ఉంటుందని పి.టి.ఐ. వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
2020-01-01 Read Moreయువత కొత్త సంవత్సరం పార్టీలను వదిలేశారు.. పెద్దలు టీవీ చూడటం మాని వీధుల్లోకి వచ్చారు.. వేలాది మంది ఢిల్లీ వాసులు పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేక ఆందోళనతో 2020కి సరికొత్తగా స్వాగతం పలికారు. జాతీయ పతాకాలు చేతబూని షహీన్ బాగ్ వద్ద జాతీయ గీతాలాపన చేస్తూ ‘‘ఇంక్విలాబ్ జిందాబాద్‘‘, ‘‘ఆజాదీ‘‘ అంటూ నినదించారు. ‘‘దేశంలో సాధారణ స్థితి ఉంటే.. రాత్రంతా కొత్త ఏడాది ఉత్సవాల్లో పాల్గొనేవాడిని’’ అని 30 ఏళ్ళ ఓ యువకుడు వ్యాఖ్యానించాడు.
2020-01-01 Read More2019లో జీడీపీ వృద్ధి రేటు, వినిమయం తిరోగమించాయి. 2020లో ఈ స్థితి మరింత తీవరిస్తుందని ‘బిజినెస్ స్టాండర్డ్’ సర్వేలో మెజారిటీ సీఈవోలు అభిప్రాయపడ్డారు. 50 కంపెనీల సీఈవోలతో సర్వే నిర్వహించగా.. అందులో 52 శాతం 2020లో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని అంచనా వేశారు. అధ్వాన దశ ముగిసిందని 42 శాతం చెప్పారు. అయితే, కేంద్ర బడ్జెట్ తో పరిస్థితిని చక్కదిద్దవచ్చని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.
2020-01-01 Read Moreదేశ ప్రజలకు కొత్త సంవత్సర కానుకగా రైల్వే శాఖ ఛార్జీల షాక్ ఇచ్చింది. సాధారణ నాన్ ఎసి రైళ్ళలో ప్రయాణంపై కిలోమీటరుకు ఒక్క పైసా చొప్పున, మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణంపై కిలోమీటరుకు రెండు పైసల చొప్పున, ఎసి భోగీల్లో ప్రయాణంపై కిలోమీటరుకు నాలుగు పైసల చొప్పున ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు జనవరి 1వ తేదీనుంచే అమల్లోకి రానున్నాయి. సబర్బన్ రైళ్లలో ఛార్జీలు పెరగవు.
2019-12-31ఏపీలో ఆర్టీసీ పేరు మారింది. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ‘‘ప్రజా రవాణా శాఖ (పి.టి.డి)’’ ఉద్భవించింది. రాష్ట్ర రవాణా శాఖ, రోడ్లు -భవనాల శాఖల పరిపాలనా నియంత్రణలో పి.టి.డి. పని చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే ఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరి 1న ప్రభుత్వమే వేతనాలు చెల్లించనుంది.
2019-12-312020 చారిత్రాత్మక సంవత్సరం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామని, ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం’తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలతో ‘‘స్పందన’’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ జనవరి 3న, కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీ ఫిబ్రవరి 1న చేపట్టనున్నట్టు సిఎం చెప్పారు.
2019-12-31ఢిల్లీ ప్రగతి మైదాన్ మెట్రో స్టేషన్ పేరును మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపైన దాన్ని ‘‘సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్’’గా వ్యవహరించనున్నారు. పేర్లపై ఏర్పాటైన కమిటీ మంగళవారం తీసుకున్న నిర్ణయాలను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. ‘‘ముకర్బా చౌక్’’కు, అక్కడి ఫ్లై ఓవర్ కు కార్గిల్ యుద్ధ అమర వీరుడు ‘‘కెప్టెన్ విక్రమ్ బాత్రా’’ పేరు పెట్టగా, ఎంబి రోడ్ పేరును ‘‘ఆచార్య శ్రీ మహాప్రగ్య మార్గ్’’గా మార్చినట్టు చెప్పారు.
2019-12-31 Read More