‘‘నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే నేను దేశం వదిలి వెళ్ళిపోతా’’ అని సినీ నటి షబానా ఆజ్మీ అన్నట్లుగా ఫేస్ బుక్ లో ఓ పోస్టు వైరల్ అయింది. పలు ఫేస్ బుక్ పేజీలు, గ్రూపులతో పాటు అనేక మంది వ్యక్తిగత ఖాతాల్లోనూ షేర్ అయింది. దీనిపై నిజనిర్ధారణ వెబ్ సైట్ ‘ఆల్ట్ న్యూస్’ షబానా ఆజ్మీని వివరణ కోరినప్పుడు, ‘అది పూర్తిగా కల్పితం. దేశం వదిలివెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు. నేను పుట్టింది ఇక్కడే. చనిపోయేదీ ఇక్కడే. నాకు ఆపాదించిన ఈ ప్రకటన నేనెప్పుడూ చేయలేదు’ అని స్పష్టం చేశారు.
2019-05-18 Read Moreఅమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఇండియాలాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ‘‘ఇండియా రేటింగ్స్ (ఇండ్-ర)’’ సంస్థ అంచనా వేసింది. అమెరికా ఆంక్షలతో ఆ దేశానికి వెళ్ళవలసిన ఎగుమతులను ఇండియాకు, ఇతర వర్ధమాన దేశాలకు చైనా మళ్లించవచ్చని శుక్రవారం పేర్కొంది. చైనా డంప్ చేసే చౌక వస్తువులు భారత మార్కెట్లలో డిమాండ్-సరఫరాను ప్రభావితం చేస్తాయని హెచ్చరించింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇనుము, ఉక్కు, ఆర్గానిక్ కెమికల్స్ పెద్ద ఎత్తున వస్తాయని అంచనా.
2019-05-18 Read Moreఅదో కుందేలు.. కానీ, ప్రాణమున్నది కాదు! స్టెయిన్ లెస్ స్టీలుతో తయారైన ఓ శిల్పం. అమెరికన్ ఆర్టిస్టు జెఫ్ కూన్స్ 1986లో రూపొందించిన ఈ చిరు శిల్పం బుధవారంనాడు న్యూయార్క్ నగరంలో వేలానికి వచ్చింది. ధర ఎంతో తెలుసా? సుమారు రూ. 640 కోట్లు (91.1 మిలియన్ డాలర్లు). బతికి ఉన్న ఓ కళాకారుడు రూపొందించిన కళాఖండాల్లో అత్యంత ధర పలికింది ఈ కుందేలుకే! డేవిడ్ హాక్నీ 1972లో వేసిన ఒక పెయింటింగ్ ఇటీవల 90.2 మిలియన్ డాలర్లు పలికింది.
2019-05-16 Read Moreఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఎలా నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో 19వ తేదీన రీపోలింగ్ చేపట్టాలని ఈసీ నిర్ణయించడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. తాము తొమ్మిది కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరితే పట్టించుకోని ఈసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే ఆగమేఘాలపైన స్పందించిందని శుక్రవారం విమర్శించారు.
2019-05-17 Read More‘‘టైమ్’ విదేశీ పత్రిక. వ్యాస రచయిత కూడా తాను పాకిస్తానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పాడు. అదిచాలు.. అతని విశ్వసనీయతను తెలుసుకోవడానికి’... తనపై టైమ్ మ్యాగజైన్ లో వచ్చిన కథనానికి భారత ప్రధాని స్పందన ఇది. ‘‘భారత ప్రధాన విభజనకారుడు’’ అనే శీర్షికన ‘‘భారతదేశం మరో ఐదేళ్ళు మోదీని భరించగలదా?’’ అని ప్రశ్నిస్తూ ఇటీవల వెలువడిన కథనం దేశంలో సంచలనం రేపింది. ఆ కథనం రాసిన ఆతిష్ తశీర్ తండ్రి పాకిస్తానీ, తల్లి భారతీయ జర్నలిస్టు. ఈ విషయాన్నే ప్రధాని మోదీ శుక్రవారం ప్రస్తావించారు.
2019-05-17 Read Moreతన భార్య పేరిట స్విస్ బ్యాంకులో రూ. 7 కోట్ల డిపాజిట్లు, కోటిన్నర విలువైన ఆభరణాలు ఉన్నట్టు గురుదాస్ పూర్ సిటింగ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సునీల్ కుమార్ జాకర్ ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. సునీల్ మాజీ గవర్నర్ బలరాం జాకర్ కుమారుడు. తనకు వివిధ బ్యాంకుల్లో రూ. 1.23 కోట్ల మేరకు డిపాజిట్లు ఉన్నాయని, భార్య సిల్వియా జాకర్ పేరిట స్విట్జర్లాండ్ లోని జుర్చెర్ కాంటోనల్ బ్యాంకులో రూ. 7.37 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని సునీల్ వెల్లడించారు. ఆయనపై బీజేపీ అభ్యర్ధిగా సినీ నటుడు సన్నీ డియోల్ పోటీ చేస్తున్నారు.
2019-05-17 Read More2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. మొత్తం 7 దశల ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ 19వ తేదీన జరగనుంది. చివరి దశలో 59 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏడో దశ పోలింగ్ ప్రచార సరళి మిగిలిన దశలకు కాస్త భిన్నంగా సాగింది. 71 సంవత్సరాల క్రితం హత్యకు గురైన జాతిపిత మహాత్మాగాంధీ పేరు, ఆయనను హత్య చేసిన నాథురాం గాడ్సే పేరు ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. కమలహాసన్ నుంచి ప్రధాని మోదీ వరకు ఆ వివాదంపై మాట్లాడారు.
2019-05-17సొంత మెజారిటీతోనే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం చివరి దశ పోలింగ్ ప్రచారాన్ని ముగించుకొని ఢిల్లీ వచ్చిన ప్రధాని, బీజేపీ కేంద్ర కార్యాలయంలో అమిత్ షాతో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘‘నా అభిప్రాయంలో...పూర్తి మెజారిటీతో మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది. దేశంలో ఇలాంటి పరిణామం చాలా కాలం తర్వాత జరగబోతోంది’’ అని మోదీ పేర్కొన్నారు. బీజేపీకి 300 సీట్లు వస్తాయని అమిత్ షా చెప్పారు.
2019-05-17ఐదేళ్లలో తొలిసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో కనిపించిన మోదీ, ఒక్క ప్రశ్నకు కూడా బదులివ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యబాణం సంధించారు. ‘‘అభినందనలు మోదీ జీ. అద్భుతమైన ప్రెస్ కాన్ఫరెన్స్!.. ఇంకోసారి మీరు రెండు ప్రశ్నలకు బదులివ్వడానికి మిస్టర్ షా అవకాశం ఇవ్వొచ్చు. వెల్ డన్’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. శుక్రవారం తుది దశ పోలింగ్ ప్రచార గడువు ముగిశాక నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోదీని అడిగిన ప్రశ్నలకూ అమిత్ షా బదులిచ్చారు.
2019-05-17 Read Moreవెటరన్ సినిమా నటుడు రాళ్ళపల్లి నర్సింహారావు (73) శుక్రవారం హైదరాబాదులో కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రాళ్ళపల్లి ఆరోగ్యం విషమించడంతో, కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం ఆయనను మాదాపూర్ లోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాళ్ళపల్లి మరణించారు. 1955 అక్టోబర్ 10న తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన రాళ్ళపల్లి నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చారు. సుమారు 850 సినిమాలలో నటించారు.
2019-05-17 Read More