ప్రపంచ మిలిటరీ వ్యయం చరిత్రలో మొదటిసారిగా 2 ట్రిలియన్ డాలర్లు దాటింది. 2021 సంవత్సరంలో అన్ని దేశాలూ కలిపి $2113 బిలియన్లు మిలిటరీపై ఖర్చు చేశాయని స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తాజా నివేదికలో పేర్కొంది. ఈ మొత్తం భారత కరెన్సీలో 162,00,371 కోట్ల రూపాయలు. భారత దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో సుమారు 55 శాతం. ప్రపంచ మిలిటరీ వ్యయం పెరగడం వరుసగా ఇది ఏడో సంవత్సరం. కరోనా కాలంలో రికార్డు స్థాయిలో పెరిగింది.
2022-04-25ఆయిల్ కంపెనీల ఆట బాగుంది! 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను శనివారం రూ. 102.50 మేరకు తగ్గించాయి. వెంటనే.. ఈ నిర్ణయం హోటళ్ళకు, టీ స్టాళ్ళకు నూతన సంవత్సరాన ఉపశమనం అనే వార్తలు వచ్చాయి. ఈ ‘కథ’నానికి నేపథ్యంలో.. ఢిల్లీలో సిలిండర్ ధర డిసెంబర్ 1న రూ. 2,000.50 నుంచి 2,101కి పెరిగింది. అంతకు ముందు నవంబర్ 1న ఏకంగా రూ. 266 పెంచారు. అంటే రెండు నెలల్లో రూ. 366 పెంచి ఇప్పుడు 102 తగ్గించి నూతన సంవత్సర కానుక అంటున్నారు!
2022-01-01భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరిపించే కొన్ని ఆహ్లాదకర సన్నివేశాలు శనివారం కనిపించాయి. సరిహద్దుల పొడవునా పలుచోట్ల ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకొని నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. లడఖ్ లో గత 18 నెలలుగా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువులుగా ఉన్న హాట్ స్ప్రింగ్స్, డెంచోక్ లతో పాటు సిక్కింలోని నాథులా, కోంగ్రా లా బోర్డర్ పోస్టుల వద్ద భారత, చైనా సైనికులు స్వీట్లు పంచుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
2022-01-01వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉద్ఘాటించారు. తాను కాదంటే తప్ప ఎమ్మెల్యే సీటుకు ఎవరూ రారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటుకు వేరేవారు వస్తారని, తాను ఎంపీ సీటుకు పోటీ చేస్తానని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ నేతలకు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విన్నవించారు. ‘‘నా ఇష్టం తప్ప.. ఈ పార్టీలో నన్ను బలవంతంగా పంపిచేవాళ్లు లేరు’’ అని పుల్లారావు వ్యాఖ్యానించారు.
2022-01-01భారత దిగ్గజ బౌలర్ మహ్మద్ షమి ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ 3 పేసర్లలో ఒకరని స్కిప్పర్ విరాట్ కోహ్లీ చెప్పారు. దక్షిణాఫ్రికాపై సెంచూరియన్ టెస్టు మ్యాచ్ లో 113 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించడంలో షమి కీలక పాత్ర పోషించాక కోహ్లి స్పందించారు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 44 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టిన షమి... దక్షిణాఫ్రికా 197 పరుగులకే ఆలౌట్ కావడానికి ప్రధాన కారణమయ్యారు. రెండో ఇన్నింగ్స్ లోనూ 63 పరుగులకు మూడు వికెట్లు తీశారు. షమీ ప్రపంచ శ్రేణి బౌలర్ అని కోహ్లి ఈ విజయం తర్వాత ప్రశంసించారు.
2021-12-30దేశంలో కరోనా కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్క ముంబై నగరంలోనే 3,671 కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే ఇవి 46 శాతం ఎక్కువ. ఢిల్లీలో ఒక్క రోజులో కేసుల సంఖ్య 42 శాతం పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య ఏడు నెలల తర్వాత తొలిసారి 1000 మార్కు దాటింది. 24 గంటల్లో 1,313 కేసులు నమోదయ్యాయి. కోల్ కతాలో ఏకంగా 101 శాతం పెరుగుదలతో 1,090 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల్లో అత్యధికంగా మహారాష్ట్ర 24 గంటల వ్యవధిలో 5,368 కేసులను నమోదు చేసింది.
2021-12-30చైనా సారథ్యంలో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP) నూతన సంవత్సరం తొలి రోజున అమల్లోకి రానుంది. తొలుత ఈ ఒప్పందం 10 దేశాల్లో (చైనా, జపాన్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, ఆసియాన్ 6 దేశాల్లో) అమలు కానుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 15 దేశాలు 2020లో RCEPపై సంతకాలు చేశాయి. ఇండియా చర్చల దశలోనే వైదొలగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30 శాతం కలిగి.. 220 కోట్ల ప్రజలున్న ప్రాంతంలో అమలు కాబోతున్న RCEP అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.
2021-12-30అరుణాచల్ ప్రదేశ్ లోని మరో 15 ప్రాంతాలకు చైనా తన భాషలో పేర్లు పెట్టింది. గ్జిజాంగ్ దక్షిణ భాగంలోని ‘జాంగ్నాన్’లో 15 ప్రాంతాల పేర్లను చైనీస్ అక్షరాలు, టిబెటన్-రోమన్ వర్ణమాల ప్రకారం ప్రామాణీకరించినట్టు ఆ దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటిలో 8 నివాస ప్రాంతాలు కాగా నాలుగు పర్వతాలు, రెండు నదులు, ఒకటి పర్వత దారి. ఇవన్నీ చైనా దక్షిణ టిబెట్ గా భావించే భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లోనివే. గతంలో ఒకసారి 6 ప్రాంతాల పేర్లను ఇలాగే ప్రామాణీకరించింది చైనా.
2021-12-30ఇండియాలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. బుధవారం 13,154 కొత్త కేసులు నమోదయ్యాయి. 268 మంది మరణించారు. కొత్త కేసుల సంఖ్య సోమవారం 6,358గా ఉంటే మంగళవారానికి 9,195కి పెరిగింది. బుధవారం నమోదైన 13,154 కరోనా కేసుల్లో 961 మందికి ఒమిక్రాన్ సోకింది. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా ఢిల్లీ (263), మహారాష్ట్ర (252), గుజరాత్ (97)లలో నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 1ని దాటి 1.10కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
2021-12-30నాగాలాండ్ మొత్తంలో సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం (AFSPA) అమలును మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేేంద్ర హోం శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల నాగాలాండ్ లో కూలీలను ఉగ్రవాదులుగా భావించి ఆర్మీ జవాన్లు కాల్చి చంపడం తీవ్ర నిరసనలకు దారి తీసిన నేపథ్యంలో.. ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశాలను పరిశీలించడానికంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే చట్టం పొడిగింపు నిర్ణయం వెలువడటం గమనార్హం.
2021-12-30