చైనా టెలికం దిగ్గజం హువావీ టెక్నాలజీస్, దానికి అనుబంధంగా ఉన్న 70 సంస్థలను అమెరికా బ్లాక్ లిస్టులో చేర్చిది. దీంతో... ఇక ముందు హవావీ అమెరికా ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ దేశ కంపెనీలనుంచి పరికరాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందాలంటే హువావీ అమెరికా ప్రభుత్వం వద్ద లైసెన్సు పొందవలసి ఉంటుంది. హవావీ ప్రపంచంలోనే అతి పెద్ద టెలికం పరికరాల తాయారీదారు. ఆ తయారీకి అవసరమైన కొంత సామాగ్రిని అమెరికా కంపెనీల వద్ద కొనుగోలు చేస్తుంటుంది.
2019-05-16 Read Moreరాష్ట్ర అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు, ప్రధాన ఎన్నికల ఏజంట్లకు ఆ పార్టీ నాయకత్వం శిక్షణ ఇస్తోంది. గురువారం ఉదయం విజయవాడ ఎ1 కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైన శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, మరో రిటైర్డ్ అధికారి శామ్యూల్, పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బోధకులుగా వ్యవహరించారు. ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ఏజంట్ల విధులపై శిక్షణ ఇచ్చారు.
2019-05-16 Read Moreనైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళలో ప్రవేశిస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసిన ఒక రోజు తర్వాత భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఓ ప్రకటన చేసింది. కొద్దిగా ఆలస్యంగా జూన్ 6వ తేదీన (నాలుగు రోజులు ముందు లేదా వెనుకైనా కావచ్చు) రుతుపవనాలు కేరళకు వస్తాయని బుధవారం ఓ ప్రత్యేక బులెటిన్ ద్వారా తెలిపింది. ఈ ఏడాది దాదాపు సాధారణ వర్షపాతమే ఉంటుందని ఐఎండి అంచనా వేసింది. సాధారణం కంటే తగ్గుతుందని స్కైమెట్ అంచనాకు ఇది కూడా కాస్త భిన్నంగానే ఉంది.
2019-05-15 Read Moreమోదీ ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్రలో భాగంగానే.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. మొన్న అమిత్ షా ర్యాలీలో జరిగిన హింస నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రచార పర్వాన్ని ఈసీ కుదించడంపై మాయావతి మండిపడ్డారు. మమతకు మద్ధతుగా గళం విప్పారు. ‘‘ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో లోక్ సభ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరగడంలేదని ఇప్పుడు స్పష్టమైంది’’ అని మాయావతి వ్యాఖ్యానించారు.
2019-05-16 Read Moreజమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా పట్టణంలో గురువారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు తీవ్రవాదులు, ఒక జవాను, మరో పౌరుడు మరణించారు. పట్టణంలోని దాలిపొరా ప్రాంతంలో గురువారం వేకువజామున మిలిటెంట్లకోసం సోదాలు చేస్తున్నప్పుడు జవాన్లపై కాల్పులు మొదలయ్యాయి. సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో కొద్దిసేపు హోరాహోరీ పోరు జరిగింది. మిలిటెంట్లు దాగి ఉన్న ఇంటి యజమాని కుమారుడు రయీస్ అహ్మద్ దర్ కూడా ఈ కాల్పుల్లో చనిపోయినట్టు సమాచారం.
2019-05-16 Read Moreసిపిఎం కార్యకర్త పవిత్రన్ హత్య కేసులో ఏడుగురు బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు జీవిత ఖైదు విధిస్తూ కేరళలోని తలస్సెరి కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. హత్య, మారణాయుధాలతో అల్లర్లు సృష్టించడం సహా మొత్తం 6 సెక్షన్ల కింద నేరాన్ని నిర్ధారించింది. సికె ప్రశాంత్, లైజేష్ అలియాస్ లైజు, పరయక్కాండి వినీష్, ప్రశాంత్ అలియాస్ ముత్తు, కెసి అనిల్ కుమార్, కిజక్కయిల్ విజిలేష్, కె. మహేష్ లకు శిక్ష పడింది. 2007 నవంబర్ 6 వేకువజామున పాలకోసం ఇంటి బయటకు వచ్చిన పవిత్రన్ పై మారణాయుధాలతో దాడి చేయగా.. 10వ తేదీన కోజికోడ్ ఆసుపత్రిలో ఆయన మరణించారు.
2019-05-15 Read Moreమాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈసారి తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అస్సాంనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన్మోహన్ రాజ్యసభ సభ్యత్వం జూన్ 14తో ముగుస్తోంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం తగ్గడంతో మన్మోహన్ ఈసారి వేరే రాష్ట్రాన్ని చూసుకోక తప్పడంలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉన్న రాష్ట్రాల్లో ఇప్పట్లో ఖాళీ అయ్యే సీట్లు లేవు. తమిళనాట ఖాళీ అవుతున్న 6 రాజ్యసభ సీట్లలో 2 డిఎంకె గెలుచుకునే అవకాశం ఉంది. అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి డిఎంకె సిద్ధపడినట్టు సమాచారం.
2019-05-15 Read Moreబీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోల్ కతలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా ముగిసింది. విద్యాసాగర్ కళాశాల మీదుగా ర్యాలీ వెళ్తున్నప్పుడు కొంతమంది విద్యార్ధులు ‘‘అమిత్ షా గో బ్యాక్’’ అంటూ నినాదాలు చేశారు. వారిపైన దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు కళాశాల ఆవరణలోకి ప్రవేశించి మోటార్ సైకిళ్ళకు నిప్పు పెట్టారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ హింసకు బాధ్యత మీదేనంటూ అమిత్ షా, మమతా బెనర్జీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
2019-05-14 Read Moreఏప్రిల్ మాసంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య అగాథం పెరిగింది. బుధవారం విడుదలైన సమాచారం ప్రకారం.. ఏప్రిల్ నెలలో దేశంనుంచి ఎగుమతి అయిన సరుకుల విలువ 26 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 41.4 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటు 15.33 బిలియన్ డాలర్లు (రూ. 1,07,300 కోట్లు)గా నమోదైంది. 2018 నవంబర్ తర్వాత ఇదే పెద్ద లోటు. ఏప్రిల్ మాసంలో దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. గత నాలుగు నెలల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో ఎగుమతుల వృద్ధిరేటు కేవలం 0.64 శాతం.
2019-05-15 Read Moreభార్యపై అనుమానంతో మోటార్ సైకిల్ హ్యాండిల్ ప్లాస్టిక్ గ్రిప్ ఒకదాన్ని ఆమె మర్మాంగంలోకి చొప్పించిన ఓ మూర్ఖుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ప్రకాష్ భిల్ అలియాస్ రామా (35) అనే నిందితుడిని పోలీసులు మొన్న ఆదివారం అరెస్టు చేశారు. బాధితురాలికి ఇన్ఫెక్షన్ సోకి మర్మాంగం, మరికొన్ని భాగాలకు విస్తరించడంతో క్లిష్టతరమైన సర్జరీ ద్వారా ఆ ప్లాస్టిక్ గ్రిప్ ను తొలగించారు. ఇంతకాలం ఎవరికీ చెప్పని బాధితురాలు నొప్పి భరించలేని స్థితిలో ఆసుపత్రికి వెళ్లింది.
2019-05-14 Read More