ఇరాన్ ఎవరైనా అమెరికన్లపైనా లేదా అమెరికన్ ఆస్తులపైనా దాడి చేస్తే... ప్రతిదాడి చాలా వేగంగా, భీకరంగా ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తాము ఇరాన్ లోని 52 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని, వాటిలో చాలా ఉన్నత స్థాయివి, ఆ దేశానికి చాలా ముఖ్యమైనవి ఉన్నాయని ట్రంప్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. చాలా సంవత్సరాల క్రితం ఇరాన్ బంధించిన 52 మంది అమెరికన్లకు సూచికగా 52 ప్రాంతాలను ఎంచుకున్నట్టు ట్రంప్ తెలిపారు.
2020-01-05 Read Moreఅమెరికాలో ఉన్న చైనా ఎంబసీ తమ దేశీయులకు హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ కమాండర్ సులేమానీని అమెరికా అంతమొందించిన నేపథ్యంలో... భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని చైనా తమ దేశీయులను అలర్ట్ చేస్తోంది. ఇరాన్ నుంచి ఎలాంటి ప్రతి దాడి ఎదురైనా సిద్ధంగా ఉండేలా వాషింగ్టన్ సహా అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను అమెరికా కట్టుదిట్టం చేస్తోంది.
2020-01-05టి.ఆర్.ఎస్. కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావు మున్సిపల్ ఎన్నికల కసరత్తును ముమ్మరం చేశారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులతో ఆయన హైదరాబాద్ నగరంలోనే మంత్రి దయాకరరావు నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు పాల్గొన్నారు.
2020-01-04‘భీమ్ ఆర్మీ’ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ అనారోగ్యంతో బాధ పడుతున్నారని, ఆయనకు అత్యసవర వైద్య సాయం అవసరమని సంస్థ ప్రతినిధులు శనివారం చెప్పారు. ఆజాద్ రక్తానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని, ఆయనకు ప్రతి రెండు వారాలకు ఓసారి అదనపు ఎర్ర రక్త కణాలను తొలగించాల్సి ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు హర్జీత్ సింగ్ భట్టి చెప్పారు. అలా చేయకపోతే హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
2020-01-04 Read Moreఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీని హతమార్చిన అమెరికా, తమ చర్యను సమర్ధించుకునేందుకు అనేక సంఘటనలను ఆయనకు ఆపాదిస్తోంది. 2001 సెప్టెంబర్ 9న అమెరికాపై జరిగిన భయానక ఉగ్రవాద దాడితో సులేమానీకి సంబంధం ఉందని శనివారం ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పారు. ఆ దాడులు చేసిన 10 మంది ఉగ్రవాదులకు సులేమానీ సహకారం అందించాడన్నది పెన్స్ ఆరోపణ.
2020-01-04 Read Moreవిభజన రాజకీయాలు భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నాయని, ఇటువంటి విభజనలు దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ప్రపంచ బ్యాంకు మాజీ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ బసు ఉద్ఘాటించారు. "ఇక్కడ రాజకీయ పరిస్థితి చాలా విభజించబడింది. అది (విభజన) ఆర్థిక వ్యవస్థకు ఏమి చేస్తుందోనని నేను భయపడుతున్నాను’’ అని కోల్ కతలో ఏర్పాటు చేసిన ఫిక్కీ కార్యక్రమంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
2020-01-04 Read Moreఎన్నికలకు ముందు ‘‘ఆపరేషన్ గరుడ’’ వంటి సంచలనాలకు తెర లేపిన సినీ నటుడు శివాజీ మరోసారి రంగంలోకి దిగారు. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మారుస్తుంటే ఆంధ్రప్రదేశ్ యువత సిగ్గు, పౌరుషం లేకుండా చూస్తూ కూర్చుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం టీవీ ఛానళ్లతో మాట్లాడుతూ...కుల గజ్జి, కేసుల భయంతో ఆంధ్రులు మగ్గిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ ఫ్యాక్షనిజం అని వైసీపీపై ధ్వజమెత్తారు.
2020-01-04సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురం సినిమాలు ముందు అనుకున్న తేదీల్లోనే విడుదల కానున్నాయి. మహేష్ బాబు, రష్మికా మందన హీరో హీరోయిన్లగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరూ’ జనవరి 11న, అల్లు అర్జున్- పూజా హెగ్డే హీరో,హీరోయిన్లగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అల వైకుంఠపురంలో..’ జనవరి 12న విడుదలవుతున్నాయి. తేదీల్లో ఎలాంటి మార్పూ లేదని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
2020-01-04రాజధాని గ్రామాల ప్రజల ఆందోళనలపై ఎస్వీబీసీ ఛైర్మన్ ప్రుథ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తున్నవారంతా రైతులైతే వారికి ‘ఆడి’కార్లు, ఖద్దరు షర్టులు, చేతులకు బంగారు గాజులు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇది కార్పొరేట్ ముసుగులో సాగుతున్న ఉద్యమమని విమర్శించారు. పవన్ కల్యాణ్ కు ఇలాంటివి కనపడడం లేదా అని ప్రుథ్వి ప్రశ్నించారు.
2020-01-04టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 120 మున్పిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో టీఆర్ఎస్ గెలుపుపై సిఎం ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయన్నారు. బీజేపీని పోటీగా భావించొద్దని, టీఆర్ఎస్ కు ఎవరూ పోటీ కాదని కేసీఆర్ అన్నారు. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు.
2020-01-04