ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాలనుంచి పోటీ చేసి గెలిచిన మోదీ, సొంత రాష్ట్రం గుజరాత్ లోని వడోదర స్థానానికి రాజీనామా చేశారు. వారణాసి స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో కూడా అక్కడినుంచే పోటీ చేయాలని మోదీ నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 71 లోక్ సభ సీట్లు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ పైనే మోదీ ఎక్కువగా కేంద్రీకరించారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు కూడా ఆ రాష్ట్రంలో పలు ప్రారంభోత్సవాలు చేశారు.
2019-03-21బీజేపీలో కురువృద్ధుడు అద్వానీ శకం ముగిసింది. 2014 ఎన్నికల తర్వాత నామమాత్రంగా మిగిలిన అద్వానీకి 2019 ఎన్నికల్లో సీటు కూడా కేటాయించలేదు. ఆయన ప్రాతినిధ్యం వహించిన గాంధీ నగర్ లోక్ సభ స్థానం ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పరమైంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమిత్ షా ప్రత్యక్షంగా ఎన్నిక కావడం కోసం అద్వానీ సీటును ఎంచుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికలకోసం బీజేపీ గురువారం ప్రకటించిన తొలి జాబితాలో ఈ మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 184 మంది అభ్యర్ధుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
2019-03-21గాజువాక అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి ముందు జీవీఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ అభ్యర్ధి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సి.ఎస్. రామ్మోహన్ రావు, సీనియర్ నేత మాదాసు గంగాధరం పాల్గొన్నారు. జనసేనతో పాటు మిత్రపక్షాలైన వామపక్షాల కార్యకర్తలు కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు.
2019-03-21తాను ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, ఏ పార్టీ తరపునా ప్రచారం చేయడమూ లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ విషయంపై వస్తున్న రూమర్లకు భిన్నంగా ఆయన గురువారం ట్విట్టర్లో స్పందించారు. అంతకు ముందు ఓటు ప్రాధాన్యతపై నరేంద్ర మోదీ చేసిన ఓ ట్వీట్ ను సల్మాన్ ఖాన్ రీట్వీట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి ఒక్క ఓటరూ భాగస్వామి కావాలని సల్మాన్ చేసిన విన్నపాన్ని మోదీకి అనుకూలంగా ఆపాదిస్తూ చాలామంది స్పందించారు. కొంతమంది వ్యతిరేకంగానూ వ్యాఖ్యానించారు.
2019-03-21 Read Moreఫాల్ ఆర్మీ వార్మ్... ఒక సైన్యంలా పంటలను ఆక్రమించి తినే స్వభావం ఉన్నందున దానికా పేరు వచ్చింది. తెలుగులో కత్తెర పురుగుగా వ్యవహరిస్తున్నారు. లాటిన్ అమెరికా నుంచి ఆఫ్రికా మీదుగా గత ఏడాది ఆసియాలో ప్రవేశించిన ఈ మహమ్మారితో ఇండియా, థాయ్ లాండ్ రైతులకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఆఫ్రికా రైతులకు ఇప్పటికే 3 బిలియన్ డాలర్ల (రూ. 20 వేల కోట్లకు పైగా) నష్టం వాటిల్లినట్టు యుఎన్ తెలిపింది. బాధిత దేశాల ప్రతినిధులతో యుఎన్ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఒ) బ్యాంకాక్ లో మూడు రోజుల సదస్సును ఏర్పాటు చేసింది.
2019-03-21 Read Moreఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కోరుతున్నట్టు ఒక్కసారి అవకాశం ఇస్తే మొత్తం దోచుకుంటాడని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన రోజున కట్టుబట్టలతో వచ్చామని, ఐదేళ్ళలో రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేశామని చంద్రబాబు చెప్పారు. ఏపీ రానున్న రోజుల్లో గుజరాత్ రాష్ట్రాన్ని మించిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తూనే ఆడబిడ్డలకు, పెద్దవాళ్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
2019-03-21సూర్యుని ఒకసారి చుట్టడానికి భూమికి పట్టే కాలం 365 రోజులు. ఈ ఏడాది కాలంలో రెండే రోజులు పగలు, రాత్రి కచ్చితంగా సమాన సమయం (12 గంటల చొప్పున) ఉంటాయి. ఆ రెండు రోజుల్లో బుధవారం (మార్చి 20) ఒకటి. సూర్యుడు నేరుగా భూమధ్య రేఖపైన ప్రకాశించే రోజు ఇది. భూమి ఉత్తర, దక్షిణ భాగాలు రెంటిలోనూ పగటి వెలుతురు సమంగా పడేది కూడా ఈ రోజే. 2019లో చివరి సంపూర్ణ చంద్రుడు దర్శనమిచ్చేది కూడా ఈ రోజే కావడం విశేషం. సాధారణంగా ‘‘సమరాత్రి’’కి కొద్ది రోజులు ముందో.. తర్వాతో పూర్తి చంద్రుడు దర్శనమిస్తాడు. ఈసారి మాత్రం ‘‘సమరాత్రి’’కి నాలుగు గంటల వ్యవధిలో పూర్తి చంద్రుడు ఉదయిస్తున్నాడు.
2019-03-20 Read More‘చికెన్ పాక్స్ (ఆటలమ్మ లేదా తట్టు)’కు టీకా తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించిన ఇటలీ రాజకీయ నాయకుడు ఒకరికి ఆ వ్యాధి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటలీలోని ఓ ప్రావిన్సుకు గవర్నర్ అయిన మాస్సిమిలానో ఫెడ్రిగా స్వచ్ఛంద వ్యాక్సినేషన్ కు అనుకూలమే. అయితే, ‘వాక్సినేషన్ తప్పనిసరి’ చేస్తూ 2017లో ప్రభుత్వం జారీ చేసిన లోరెంజిన్ డిక్రీని ఆయన వ్యతిరేకించారు. ఈ మితవాద రాజకీయ నేత ఆ డిక్రీని ‘స్టాలినిస్టు’ చర్యగా అభివర్ణించారు. ఆయనకే ఇప్పుడు ఆటలమ్మ సోకడంతో నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు.
2019-03-20 Read Moreదేశాన్ని నడిపే కీలక రాజకీయ నిర్ణయాలను మనుషులతో కూడిన ప్రభుత్వం తీసుకోవడం కంటే ‘కృత్రిమ మేథ’కు వదిలేయడం మంచిదని సుమారు నాలుగో వంతు యూరోపియన్లు అభిప్రాయపడుతున్నారట! ఆశ్చర్యకరమైన ఈ అభిప్రాయం ‘సెంటర్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ ఛేంజ్’ అనే సంస్థ సర్వేలో వెల్లడైంది. నెదర్లాండ్స్, యుకె, జర్మనీలలో అయితే ఏకంగా ప్రతి ముగ్గురిలో ఒకరు ఇదే అభిప్రాయంతో ఉన్నారని సదరు సంస్థ తెలిపింది. వయసు, లింగ భేదాలు, రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాలూ ఒకే తరహాలో ఆలోచిస్తున్నారని పేర్కొంది.
2019-03-20 Read Moreభారత ఆర్థిక నేరగాడు నీరవ్ దీపక్ మోదీకి వెంటనే బెయిల్ ఇవ్వడానికి లండన్ కోర్టు నిరాకరించింది. బెయిల్ గడువు పూర్తయ్యాక లొంగిపోతారన్న నమ్మకం లేనందున ఈ నెల 29వ తేదీవరకు రిమాండ్ విధిస్తున్నట్టు అక్కడి జిల్లా జడ్జి మేరీ మల్లాన్ చెప్పారు. బుధవారం మోదీని అరెస్టు చేసిన లండన్ పోలీసులు వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఇండియాకు అప్పగించాలన్న ఈడీ వినతిని మోదీ ఆ కోర్టులోనే సవాలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పి.ఎన్.బి)ను రూ. 13,500 మేరకు ముంచిన కేసులో మోదీ ప్రధాన నిందితుడు.
2019-03-20 Read More