సిఎఎకి కేరళలో వ్యక్తమైన నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర సిఎం పినరయి విజయన్ ఖండించారు. ‘‘సిఎఎ వ్యతిరేక ఆందోళన తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తోందని కేరళ సిఎం చెబుతుంటే సిపిఎం ఎందుకు సమర్ధిస్తోంది’’ అని మోడీ నిన్న రాజ్యసభలో ప్రశ్నించారు. ప్రధాని తన ప్రకటనను సవరించుకోవాలని విజయన్ డిమాండ్ చేశారు. సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్.డి.పి.ఐ), ఆర్ఎస్ఎస్... రెంటి మతతత్వాన్నీ వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
2020-02-072012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషులను వేర్వేరుగా ఉరి తీయాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని వచ్చే మంగళవారం (ఫిబ్రవరి 11న) వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. నలుగురు దోషులు శిక్ష అమలులో జాప్యానికి చేస్తున్న ప్రయత్నాల (క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాబిక్ష విన్నపాలు)తో దేశం సహనం కోల్పోతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. విడివిడిగా ఉరి తీయాలన్న కేంద్ర విన్నపాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించాయి.
2020-02-07విశాఖలో గత ప్రభుత్వం భూమి కేటాయించిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ బోగస్ అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటులో చెప్పడంపై టీడీపీ మండిపడింది. పనికిమాలిన ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’లో సిఎం జగన్మోహన్ రెడ్డికి షేర్లు ఎందుకు ఉన్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నించారు. రూ. 9 కోట్ల విలువైన షేర్లు ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’లో ఉన్నట్లు జగన్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న విషయాన్ని పట్టాభి వెల్లడించారు. డబ్బు సంపాదించుకోవడానికైతే ఆ కంపెనీ ఓకేనా? అని ప్రశ్నించారు.
2020-02-07‘కరోనా వైరస్’ మహమ్మారిలా విస్తరిస్తూనే ఉంది. ఒక్క చైనా మెయిన్ ల్యాండ్ లోనే గురువారంనాటికి 31,161 మంది బాధితులుగా నమోదయ్యారు. చైనా భూభాగాలైన హాంకాంగ్ లో 24 మంది, మకావులో 10 మంది, తైవాన్ లో మరో 16 మంది వైరస్ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 636కు పెరిగింది. మరోవైపు ఆసుపత్రులనుంచి దిశ్చార్జి అయినవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పటిదాకా 1504 మందికి వ్యాధి నుంచి విముక్తి లభించింది.
2020-02-07విమాన సర్వీసుల ఆలస్యం, దారి మళ్ళింపు, రద్దు, వాయిదాలలో ‘ఇండిగో’ను మించిన ఎయిర్ లైన్స్ లేదు. 2019 చివరి మూడు నెలల్లో ఈ సంస్థ ఏకంగా 2,963 విమాన సర్వీసులను ఆలస్యంగా నడపడమో లేక రద్దు చేయడమో జరిగింది. తర్వాత స్థానాల్లో ‘గో ఎయిర్’ సంస్థ (1289 సర్వీసులు), ఎయిర్ ఇండియా (676), విస్తారా (559), స్పైస్ జెట్ (495), ఎయిర్ ఆసియా (322) ఉన్నాయి. ట్రూజెట్ విమానాలు ఒక్కటి కూడా ఆలస్యం కాలేదు. ఈ వివరాలను కేంద్ర విమానయాన శాఖ గురువారం లోక్ సభలో వెల్లడించింది.
2020-02-06మాజీ సిఎం చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాసరావు, ఆయన సమీప బంధువుల ఇళ్ళలో గురువారం ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులను సైతం లోపలికి అనుమతించలేదని సమాచారం. శ్రీనివాస్ సుమారు రెండున్నర దశాబ్దాలు చంద్రబాబు వద్ద పని చేశారు. తొలుత పి.ఎ.గా, తర్వాత పి.ఎస్.గా పని చేసి 2019 ఎన్నికల తర్వాత ప్లానింగ్ శాఖకు వెళ్లిపోయారు.
2020-02-06గతంలో ఆర్ఎస్ఎస్ సమావేశాలకు వెళ్లిన తాను ఆ సంస్థనుంచి బయటకు రావడానికి కారణం ఏమిటో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకం చదివానని, మనుస్మృతినే రాజ్యాంగంగా భావించే ఆ సిద్ధాంతం సరి కాదని బయటకు వచ్చానని అరుణ్ కుమార్ చెప్పారు. ప్రజలను భయపెట్టే చట్టాలు, పాకిస్తాన్ వ్యతిరేకతతో ఎన్నికలు గెలవాలనే ప్రయత్నం మానాలని ప్రధాని మోడీకి సూచించారు.
2020-02-06అమరావతిని స్మార్ట్ సిటీలో రూ. 2,046 కోట్లు విలువైన 20 ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుంటూరు, నర్సరావుపేట ఎంపీలు గల్లా జయదేవ్, లావు శ్రీ కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు గురువారం లోక్ సభలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమాధానమిచ్చింది. ఆయా పనుల్లో స్మార్ట్ పోల్స్ ఫేజ్-1 (రూ. 204 కోట్లు), డిస్ట్రిక్ట్ కూలింగ్ (పిపిపి) (రూ. 201 కోట్లు), స్మార్ట్ సిటీ డక్ట్ ప్రాజెక్టు (పవర్, ఫైబర్, సిటీ గ్యాస్) ఫేజ్-1 (రూ. 270 కోట్లు), ఎజిసి సెంట్రల్ పార్క్ ఫేజ్-1 (రూ. 350 కోట్లు) ఉన్నాయి.
2020-02-06తల్లిని చంపి సోదరుడిని కత్తితో పొడిచి స్నేహితుడితో విహారానికి వెళ్లిన బెంగళూరు టెకీ అమృతా చంద్రశేఖర్ (33)ని బెంగళూరు పోలీసులు పోర్టు బ్లెయిర్ లో అరెస్టు చేశారు. సోమవారం వేకువజామున అమృత తన తల్లిని, తమ్ముడిని కత్తితో పొడిచింది. అప్పటికే 5 రోజుల అండమాన్ విహారానికి బ్యాగ్ సర్దుకొని ఉన్నఅమృత, ‘బాయ్ ఫ్రెండ్’ బైకుపై విమానాశ్రయానికి వెళ్లింది. ఉదయం 6.30 గంటల ఫ్లైట్లో పోర్టు బ్లెయిర్ వెళ్ళారు. కుటుంబ అప్పుల్లో ఉన్నందున అమృత ఒత్తిడికి గురైందని చెబుతున్నారు.
2020-02-06‘బిజిల్’ టీంపై నిన్న జరిగిన ఐటీ దాడుల్లో నగదుతో పాటు పెద్ద మొత్తంలో ఆస్తి పత్రాలు, ప్రామిసరీ నోట్లు, పోస్టు డేటెడ్ చెక్కులు దొరికాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది. దొరికిన ఆధారాల ప్రకారం దాచిన సొమ్ము విలువ రూ. 300 కోట్ల పైమాటేనని తెలిపింది. ఒకే సినిమా (బిజిల్)కు సంబంధించిన ప్రముఖ నటుడు, నిర్మాత, పంపిణీదారు, ఫైనాన్షియర్ లకు సంబంధించిన 38 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది.
2020-02-06