ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం తిరుమల వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల శంఖారావాన్ని తిరుపతి నుంచి ప్రారంభించారు. అంతకు ముందు అమరావతిలోని ఆయన నివాసంలో సతీమణి భువనేశ్వరి లాంఛనంగా వీడ్కోలు పలికారు. సిఎంతోపాటే కుటుంబం కూడా తిరుమల వెళ్లింది. రంగనాయకులు మండపంలో వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం తిరుపతి ఎన్నికల సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత శ్రీకాకుళం ఎన్నికల శంఖారావంలో పాల్గొన్నారు.
2019-03-16వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్ధుల తొలి జాబితాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం విడుదల చేశారు. ఆ జాబితాలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (రాజంపేట), వైఎస్ అవినాశ్ రెడ్డి (కడప) ఇంతకు ముందు ఎంపీలు కాగా, మిగిలిన ఏడుగురు కొత్తవారు. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ (హిందూపురం), ఇంకా గొడ్డేటి మాధవి (అరకు), చింతా అనురాధ (అమలాపురం), తలారి రంగయ్య (అనంతపురం), నందిగం సురేష్ (బాపట్ల), రెడ్డప్ప (చిత్తూరు), సంజీవ్ కుమార్ (కర్నూలు) పేర్లు కూడా తొలి జాబితాలో ఉన్నాయి.
2019-03-16 Read Moreవైఎస్ వివేకానందరెడ్డి హత్యని గుండెపోటు మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని, సాక్ష్యాలను నాశనంచేసేందుకు పడకగదిలో రక్తాన్ని కడిగేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఉదయం 5.30కి పిఎ వచ్చి చూస్తే 6.40కి అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేసి వివేకా కింద పడి చనిపోయినట్టు చెప్పాడని, నుదురుపైన మెదడు బయటకు వచ్చేంత తీవ్రమైన గాయం ఉంటే తలకు గుడ్డ చుట్టి హత్య కాదని నమ్మించే ప్రయత్నం చేశారని సిఎం వివరించారు. నిందితులే సాక్ష్యాలను నాశనం చేస్తారన్న సిఎం, దారుణం చేసినవారే రాజకీయ ఆరోపణలకూ దిగారని మండిపడ్డారు.
2019-03-15వైఎస్ కుటుంబంలో అంతర్గత కలహాల నేపథ్యంలోనే వివేకానందరెడ్డి హత్య జరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వివేకాకు మనస్తాపం ఉందని, ఎంపీ సీటుకు ఎక్కడ అడ్డు వస్తాడోనని అనుమానం వీళ్లకు (జగన్ కుటుంబానికి) ఉందని, అకౌంట్ల విషయంలోనూ విభేదాలున్నాయని మంత్రి చెప్పారు. 1999, 2004లలో ఎంపీ సీటుకోసం జగన్ విఫల ప్రయత్నం చేసి చివరికి 2009లో సఫలమయ్యారని, వైఎస్ చనిపోయాక ఉప ఎన్నికల్లో విజయమ్మపైన వివేకా పోటీ చేశారని గుర్తు చేశారు.
2019-03-15తన బాబాయి వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. తన బాబాయి తలపైన ఐదుసార్లు గొడ్డలితో నరికారని, ఆ స్థితిలో ఆయన బెడ్ రూమ్ నుంచి బాత్ రూమ్ వరకు వెళ్లి కమోడ్ కు కొట్టుకొని చనిపోయినట్టుగా చిత్రీకరించారని జగన్ ఆరోపించారు. వివేకానందరెడ్డి రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖను పోలీసులు తనకు చూపించారన్న జగన్, అంతటి దాడి జరిగాక హంతకుల సమక్షంలోనే లేఖ ఎలా రాయగలరని ప్రశ్నించారు.
2019-03-15వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ సూత్రధారులుని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. వారి ప్రణాళికను మంత్రి ఆదినారాయణ రెడ్డి అమలుపరిచారని వ్యాఖ్యానించారు. ఆదినారాయణరెడ్డి ఒక హంతకుడని, ఎన్ని మర్డర్లు చేశాడో అందరికీ తెలుసని విజయసాయి వ్యాఖ్యానించారు. జగన్ తాత వైఎస్ రాజారెడ్డి 1998 ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యారని, 2009 ఎన్నికల తర్వాత రాజశేఖరరెడ్డి మరణించారని, ఇటీవల జగన్ పై హత్యాయత్నం జరిగిందని పేర్కొన్నారు.
2019-03-15న్యూజీలాండ్ మసీదులలో మారణకాండకు పాల్పడిన ముస్లిం వ్యతిరేక ఉన్మాదుల్లో ఒక వ్యక్తిని ఆస్ట్రేలియన్ జాతీయుడు బ్రెంటన్ టారంట్ గా గుర్తించారు. 28 సంవత్సరాల బ్రెంటన్ అల్ నూర్ మసీదులో సృష్టించిన నరమేథాన్ని ‘ఫేస్ బుక్’లో లైవ్ ద్వారా చూపించాడు. లైవ్ స్ట్రీమింగ్ కోసం ఒక గో ప్రో కెమేరాను బ్రెంటన్ ఉపయోగించాడు. 17 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో బ్రెటన్ కారు నడుపుతూ రావడంనుంచి, మారణాయుధాలు తీసుకొని మసీదులోని ఒక్కో గదిలోకి వెళ్లి కాల్పులు జరపడం వరకు రికార్డయింది.
2019-03-15ఉగ్రవాద దాడితో న్యూజీలాండ్ ఉలికిపడింది. క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదులో ముస్లిం వ్యతిరేక ఛాందసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 49 మంది మరణించారు. ఈ దాడికి సంబంధించి ఒక మహిళతో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక వ్యక్తిని ఆస్ట్రేలియాకు చెందిన శ్వేతజాతి తీవ్రవాది అని నిర్ధారించారు. అల్ నూర్ మసీదులో కాల్పులు జరిపిన వ్యక్తి ఆ మారణ కాండనంతా సామాజిక మాథ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. చనిపోయినవారిలో పిల్లలు కూడా ఉన్నారు.
2019-03-15బోయింగ్ 737 మ్యాక్స్ 800.. ఈ విమానం పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ లైన్స్, ప్రయాణీకులు భయపడుతున్నారు. ఇండియా, చైనా, అమెరికా సహా అనేక దేశాలు ఆయా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించాయి. ఈ భయాలను మరింత పెంచే సంఘటన ఒకటి శుక్రవారం రష్యాలో జరిగింది. 157 మంది ప్రయాణీకులతో వెళ్లున్న విమానాన్ని ఉత్తర రష్యాలో అత్యవసరంగా దించివేశారు. ఇంజన్ వైఫల్యమే ఇందుకు కారణమన్నది ప్రాథమిక సమాచారం.
2019-03-15 Read Moreవైఎస్ వివేకానందరెడ్డిది అనుమానాస్పద మరణంగా తొలుత భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డీజీపీ ఠాకూర్, ఇంటలిజెన్స్ అధికారులు, కడప జిల్లా ఎస్పీ తదితరులతో చర్చించారు. అయితే, ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘‘వైఎస్ వివేకానందరెడ్డి మరణం వెనుక కుట్ర కోణం దాగి ఉంది. వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
2019-03-15