చైనా అభివృద్ధి బ్యాంకు (సిడిబి) మాజీ ఛైర్మన్ ‘హు హుయిబాంగ్’ను ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ బహిష్కరించింది. పార్టీ, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిపై నిఘా పెట్టే సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ (సిసిడిఐ) శనివారం ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేసింది. హు తన స్థానాన్ని ఆర్థిక ప్రయోజనాలకోసం వాడుకున్నారని, నేరుగా... బంధువుల ద్వారా లంచాలు తీసుకున్నారని సిసిడిఐ నిర్ధారించింది. అతని అక్రమ ఆదాయాన్ని సీజ్ చేసి కేసును న్యాయస్థానాలకు అప్పగిస్తామని తెలిపింది.
2020-01-11తెలంగాణ బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై పార్టీ నేతలు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అరవింద్ పార్టీ టికెట్లు అమ్ముకున్నారని, ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని ఆరోపిస్తూ అసంతృప్త నేతలు హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఆందోళనకు దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కృష్ణదాస్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. లక్ష్మణ్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా నేతలు వినిపించుకోలేదు.
2020-01-11అమరావతిని మోసం చేసినవారు రేపు ఉత్తరాంధ్రను మోసం చేయరా? అనే ప్రశ్నను ప్రభుత్వానికి సంధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిని రాజధానిగా అంగీకరించి ఇప్పుడు మాట తప్పారని సిఎం జగన్ పై మండిపడ్డారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన వేలాది మందిని పట్టించుకోనివారు రేపు కొద్దిమంది వ్యక్తులను ఏం లెక్క చేస్తారని ఆయన ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలో పార్టీ సమావేశంలో పవన్ మాట్లాడారు. రైతులకు న్యాయం చేయకపోతే బలమైన ఉద్యమం చేస్తామన్నారు.
2020-01-11ముఖ్యమంత్రి మారగానే రాజధానిని చంకలో పెట్టుకొని పోవడానికి ఇది ఆయన పార్టీ కార్యాలయం కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలన్న బిజెపి వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. అందుకోసం పోరాడతామని ప్రకటించారు. బిజెపి కోర్ కమిటీ సమావేశం అనంతరం కన్నా, జీవీఎల్ నరసింహరావు, పురంధేశ్వరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
2020-01-11ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న వైఖరికి రాష్ట్ర బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మెజారిటీ నేతలు మద్ధతు తెలిపినట్టు సమాచారం. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ‘అమరావతి’కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మద్ధతు ఇచ్చామని, మంత్రివర్గ నిర్ణయాల్లోనూ భాగమయ్యామని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు వైఖరి మార్చుకోవడం సమంజసం కాదన్నది వారి అభిప్రాయంగా ఉంది.
2020-01-11చంద్రబాబును లం...కొడకా అని తిట్టాలని ఉందని, కొట్టాలని ఉందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నోరు చేసుకున్నారు. శనివారం ‘3 రాజధానుల’కు మద్ధతుగా జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు తిప్పి కొట్టారని, మళ్ళీ ఆ ‘ముసలోడు’ లేవకూడదని వ్యాఖ్యానించారు. ‘పప్పు లోకేష్ కొవ్వు కరిగేలాగా బుద్ధి చెప్పాల’ని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి ‘నువ్వ చేసే పనులు లం... చేసినట్టు చేస్తున్నావు దొంగ నా....కా’ అని ధూషించారు.
2020-01-11అమరావతి రైతు ట్రాన్స్ ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఓ వీడియో నిన్నటినుంచి సామాజిక మాథ్యమాల్లో పంపిణీ అవుతోంది. అది ఫేక్ అని తెలిసినవారు ఆపేశారు. అయితే, ఇప్పటికీ టిక్ టాక్ వంటి మాథ్యమాల్లో కనిపిస్తోంది. ఆ వ్యక్తి అమరావతి రైతు కాదు. తమిళనాడుకు చెందిన ఓ సైనికుడు మూడు రోజుల క్రితం మదురై జిల్లా కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్న చేశాడు. కుటుంబ వివాదంతో ముందు రోజే అతని భార్య ఆత్మహత్య చేసుకోవడం ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి.
2020-01-11ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం ఈ నెల 20వ తేదీన జరగనుంది. రాజధానిపై జి.ఎన్.రావు కమిటీ, బిసిజి సిఫారసుల పరిశీలనకోసం ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ తన నివేదికను నేరుగా అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని సమాచారం. ఆయా నివేదికలతో పాటు గతంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది.
2020-01-11ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ పౌర విమానాన్ని పొరపాటున తమ దళాలు కూల్చేశాయని ఇరాన్ ప్రకటించింది. తమ సైనిక కమాండర్ సులేమానీని అమెరికా హతమార్చిన తర్వాత తలెత్తిన పరిణామాల్లో ‘మానవ తప్పిదం’ జరిగిందని పేర్కొంది. ఈ నెల 8న ఉక్రెయిన్ బోయింగ్ 737 టెహ్రాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మరణించిన 176 మందిలో ఎక్కువమంది ఇరానియన్లు, కెనడియన్లు. సాంకేతిక లోపంతో విమానం కూలిందని గత మూడు రోజులుగా ఇరాన్ చెప్పింది.
2020-01-11రూ. 1.4 లక్షల కోట్ల మేరకు కార్పొరేట్ పన్ను రాయితీ ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు లోటు భర్తీ కోసం మరోసారి రిజర్వు బ్యాంకుపై పడుతోంది. చివరి త్రైమాసికంలో ప్రభుత్వం వ్యయంపై 25 శాతం పరిమితి పెట్టుకుంది. దీనివల్ల వ్యయం రూ. 2.2 లక్షల కోట్లు తగ్గుతుంది. అయినా చాలదు. అందుకే... బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని ఆర్.బి.ఐ.ని కోరబోతోంది. ఇప్పటికే రిజర్వు బ్యాంకు మిగులు నిధులు రూ. 1.48 లక్షల కోట్లను ప్రభుత్వానికి ఇచ్చింది.
2020-01-11