ఇండియాలో ‘కరోనా’తో మరణించిన తొలి వ్యక్తి కుమార్తెకు కూడా వైరస్ సోకినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కాలబురగికి చెందిన 76 సంవత్సరాల మహ్మద్ హుస్సేన్ సిద్దిక్ గత మంగళవారం మరణించారు. ఆయనకు ‘కరోనా’ సోకినట్టు మరణానంతరం నిర్ధారణ అయింది. దాంతో ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాలుగు నమూనాలను పరీక్షకోసం పంపారు. వారిలో మృతుడి కుమార్తెకు ‘కరోనా’ నిర్ధారణ అయింది. ఆమెను ప్రస్తుతం కాలబురగి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్టు చెబుతున్నారు.
2020-03-16‘కరోనా’ కారణంగా ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే.. దానిపై రాజకీయ రచ్చ నడుస్తోంది. అదే సమయంలో బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదాలు ఇండియాకే పరిమితం కాలేదు. సంపన్న దేశం ఫ్రాన్స్ మున్సిపల్ ఎన్నికల రెండో దశను జూన్ 21కి వాయిదా వేసినట్టు తాజా సమాచారం. ఆదివారం (మార్చి 15న) 35,000 కమ్యూన్లలో కౌన్సిళ్ల ఎన్నికకోసం పోలింగ్ నిర్వహించారు. అయితే, కేవలం 44 శాతం ఓట్లు నమోదయ్యాయి. దీంతో వచ్చే ఆదివారం జరగాల్సిన రెండో దశ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
2020-03-17‘కరోనా వైరస్’పై కొన్నిచోట్ల అతి భయాలు, మరి కొన్నిచోట్ల అసాధారణ నిర్లక్ష్యం చూస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) తాజాగా ‘కరోనా’ను ‘మన కాలపు ప్రపంచ ఆరోగ్య సంక్షోభం’గా నిర్వచించింది. ‘‘ఈ వైరస్ కొత్తది. దానిపై మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి’’ అని డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ సోమవారం చెప్పారు. అందుకే ధనిక దేశాల్లో కూడా ఆశ్చర్యకరమైన పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. వైరస్ నియంత్రణకు చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ అనుసరించిన వ్యూహాలు ఫలించాయని ఆయన ప్రశంసించారు.
2020-03-17సభ్య దేశాల మధ్య ప్రయాణానికి సరిహద్దులు లేకుండా చేసుకున్న యూరోపియన్ యూనియన్, ఇప్పుడు ‘కరోనా’ భయంతో వాటిని మూసివేస్తోంది. అత్యవసరం కాని అన్ని రకాల ప్రయాణాలపైనా ఆంక్షలు విధించింది. ప్రాథమికంగా 30 రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని, తర్వాత పొడిగించవచ్చని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సోమవారం చెప్పారు. యూరోపియన్ల కుటుంబ సభ్యులు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, సరుకులు రవణా చేసేవారికి మినహాయింపు ఉంటుంది. ‘‘తక్కువ ప్రయాణంతో వైరస్ ను ఎక్కువగా నియంత్రించగలం’’ అని ఉర్సులా పేర్కొన్నారు.
2020-03-17 Read Moreఇది మరో క్రూయిజ్ ఓడ కథ. 682 మంది ప్రయాణీకులు, 381 మంది సిబ్బందితో కూడిన బ్రిటిష్ ఓడ ‘ఎంఎస్ బ్రెయిమర్’లో ఐదుగురికి ‘కరోనా’ సోకింది. అంతే.. ఆ ఓడను తమ రేవుల్లో నిలపడానికి అగ్రరాజ్యం అమెరికాతో పాటు కరీబియన్ దేశాలు బార్బడోస్, బహమాస్ అనుమతి ఇవ్వలేదు. దిక్కు తోచక కరీబియన్ సముద్ర జలాల్లో బహమాస్ తీరానికి 25 మైళ్ళ దూరంలో నిలిచిపోయింది ఆ ఓడ. ఆహార పదార్ధాలను అక్కడికే పంపుతున్నారు. ఈ స్థితిలో ఆ ఓడలోని బ్రిటిషర్లకు ఆశ్రయమివ్వడానికి, వారిని తగిన జాగ్రత్తలతో స్వదేశానికి పంపడానికి క్యూబా అంగీకరించింది.
2020-03-16 Read Moreసుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రంజన్ గొగోయ్ పదవీ కాలంలో ‘బాబ్రీ మసీదు- రామ జన్మభూమి’ సహా వివాదాస్పద అంశాలపై అనూహ్యమైన తీర్పులు ఇచ్చారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కోగా, గొగోయ్ నాయకత్వంలోని ధర్మాసనం దాదాపు ‘క్లీన్ చిట్’ ఇచ్చింది. ఈ తీర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 2019 నవంబర్ 17న రిటైరైన గోగోయ్ ని నాలుగు నెలల్లోపు రాజ్యసభ సీటు వరించింది.
2020-03-16పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వచ్చే నెలలో నిర్వహించాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. ఎన్నికల కోసం ఈ రోజు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలువురు వాయిదా కోరారు. ‘కరోనా వైరస్’ వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు ఎన్నికల వాయిదా కోరాయి.
2020-03-16ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంత కుల పిచ్చి ఏమిటో అర్దం కావడంలేదని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై స్వయాన ముఖ్యమంత్రి మాటల దాడి చేయడాన్ని నరేంద్ర తప్పు పట్టారు. ‘‘మీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ ఏ కులం? పీవీపీది ఏ కులం? మీరు రాజకీయం కోసం వాటేసుకున్న వంశీది ఏ కులం? నిన్నగాక మొన్న చేరిన బలరాంది ఏ కులం?’’ అని సిఎంను ప్రశ్నించారు. ‘‘మీ ధనదాహం తీర్చడానికైతే కులాలు అక్కర్లేదు’’ అని నరేంద్ర మండిపడ్డారు.
2020-03-16స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంతకు ముందు ఇచ్చిన షెడ్యూలు ప్రకారమే ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని కోరింది. దీనిపై మంగళవారం వాదనలు విననున్నారు. ‘కరోనా వైరస్’ కారణంగా స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. రాష్ట్ర హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. స్థానిక ఎన్నికలను వెంటనే జరిపించాలని కోరుతూ ఇద్దరు వ్యక్తులు లంచ్ మోషన్ తెచ్చారు.
2020-03-16 Read More‘‘రాష్ట్రానికి వచ్చింది కరోనా వైరసా.. కమ్మ వైరసా?’’ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్న ఇది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై స్పీకర్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ లోనూ బ్లాక్ షీప్ప్ ఉన్నాయంటూ.. రాష్ట్రం రమేష్ కుమార్ అబ్బ జాగీరు అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములు వస్తే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రధాని, రాష్ట్రపతి స్పందించాలన్న తమ్మినేని, ఉద్యమాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
2020-03-16 Read More