జిల్లా నేర గణాంకాల బ్యూరో (డి.సి.ఆర్.బి) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014, 19 మధ్య 1160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం శుక్రవారం శాసనమండలిలో తెలిపింది. అయితే, వారిలో 454 మంది మాత్రమే రైతులు అని జిల్లా స్థాయిలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీలు తేల్చాయని పేర్కొంది. మిగిలిన 706 మంది విషయంలో పున:పరిశీలన జరిపి అర్హులని తేలితే రూ. 7 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
2019-07-18కర్నాటక ప్రభుత్వ ‘విశ్వాసపరీక్ష’పై గవర్నర్ వాజూభాయ్ వాలా ఆదేశాలను ముఖ్యమంత్రి కుమారస్వామి, అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. రమేష్ కుమార్ పెద్దగా పట్టించుకోలేదు. విశ్వాస పరీక్షకోసం గవర్నర్ గురు, శుక్రవారాల్లో విధించిన మూడు ‘డెడ్ లైన్’లను వారు బేఖాతరు చేశారు. శుక్రవారం సభలో చర్చ తర్వాత స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. అదే రోజున ‘విశ్వాస పరీక్ష’ చేపట్టవచ్చని కాంగ్రెస్, జెడిఎస్ నేతలు సభాపతికి తెలియజేశారు.
2019-07-19ఆంధ్రుల నూతన రాజధాని ‘అమరావతి’ నిర్మాణానికి రుణసాయం చేస్తుందనుకున్న ప్రపంచ బ్యాంకు మొండిచెయ్యి చూపించింది. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికోసం $300 మిలియన్ల (సుమారు రూ. 2100 కోట్లు) మేరకు కేంద్రం ద్వారా పంపిన రుణ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ ప్రాజెక్టును వదిలేసినట్టు తన వెబ్ సైట్లో పేర్కొంది. రెండేళ్ళ క్రితమే ఆమోదించాల్సిన రుణ ప్రతిపాదనను కొందరి ఫిర్యాదుల కారణంగా పెండింగ్ లో పెట్టి..ఇప్పుడు నిర్ణయాన్ని వెల్లడించింది.
2019-07-1810 ట్రాక్టర్లలో మందితో వెళ్లి స్థానికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 9 మందిని బలితీసుకున్న దారుణమైన నేరం యూపీలో బుధవారం జరిగింది. సోంభద్ర జిల్లాలోని ఘోరవల్ గ్రామంలో భూవివాదం ఈ ఘటనకు మూలం. మరణించినవారిలో ముగ్గురు మహిళలు. మరో 19 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ రాక్షసత్వానికి పాల్పడింది ఓ గ్రామ పెద్ద (యగ్య దత్). గ్రామంలో 90 బిఘాల (సుమారు 30 ఎకరాల) భూమిలో అనుభవదారులను ఖాళీ చేయించడానికి యగ్యదత్ మారణకాండకు దిగారు.
2019-07-17 Read Moreఇండియాకు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జి.ఎస్.పి) కింద ఇచ్చే ప్రయోజనాలను అమెరికా ఉపసంహరించుకోవడం.. ఆభరణాలు, రత్నాల ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2018 జూన్ ($727.3 మిలియన్ల)తో పోలిస్తే 2019 జూన్ లో ($608.06 మిలియన్లు) అమెరికాకు ఆభరణాల ఎగుమతులు 16.4 శాతం తగ్గిపోయాయి. జి.ఎస్.పి. ప్రయోజనాలను 2019 జూన్ 5వ తేదీనుంచి ఉపసంహరించుకోగా.. కార్మిక శక్తి ప్రధానమైన రంగాలపై ఆ ప్రభావం గణనీయంగా ఉంది.
2019-07-162004 జనవరి 1 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో జాతీయ పెన్షన్ విధానం (ఎన్.పి.ఎస్)ను ఉపసంహరించుకునే ప్రతిపాదనేదీ లేదని మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వంపై పెరిగిన పెన్షన్ భారాన్ని తగ్గించుకునేందుకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోక్ సభలో చెప్పారు. దీంతో ఆర్థిక వనరులను సామాజికార్థిక అభివృద్ధికి వినియోగించే వీలు కలిగిందని పేర్కొన్నారు.
2019-07-15బీజేపీ సౌజన్యంతో కర్నాటక కాంగ్రెస్-జెడిఎస్ క్యాంపులో మొదలైన సంక్షోభం ఆదివారం మరింత ముదిరింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే ధ్యేయంగా రాజీనామాలు చేసిన 12 మంది కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేల క్యాంపులో.. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్. నాగరాజ్ కూడా చేరిపోయారు. రాజీనామాలకు సిద్ధపడినవారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఓవైపు ప్రయత్నిస్తుండగా, మరోవైపు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అంతకంటే తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2019-07-14 Read Moreప్రయోగానికి 56 నిమిషాల 24 సెకన్ల ముందు చంద్రయాన్-2 కౌంట్ డౌన్ నిలిచిపోయింది. ‘చంద్రయాన్-2’ను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి సోమవారం వేకువజామున 2.51 గంటలకు జి.ఎస్.ఎల్.వి. ఎం.కె.3-ఎం1ను ప్రయోగించాల్సి ఉంది. అయితే, ప్రయోగవాహనంలో సాంకేతిక లోపం కారణంగా ‘చంద్రయాన్-2’ వాయిదా వేస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చివరి గంటలో ప్రకటించింది. తిరిగి ఎప్పుడు ప్రయోగించేదీ తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.
2019-07-15 Read Moreరెండు వేర్వేరు క్రీడల్లో..రెండూ ఫైనల్ పోటీలు..ఒకే సమయంలో..ఒకే దేశంలోని వేదికలపై..చివరిదాకా ఉత్కంఠభరితంగా సాగిన రోజు 2019 జూలై 14. క్రికెట్ ప్రపంచ కప్ 2019 ఫైనల్ ఆదివారం రాత్రి న్యూజీలాండ్, ఇంగ్లండ్ మధ్య యు.కె.లోని లార్డ్స్ లో జరిగితే, అక్కడికి కేవలం 7 మైళ్ల దూరంలో వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ జరిగింది. క్రికెట్ ఫైనల్లో సూపర్ ఓవర్ లోనూ టై కాగా.. వింబుల్డన్లో 5వ సెట్ సుదీర్ఘంగా సాగింది. ‘తలపడ్డవారంతా విజేతలు’గా ప్రేక్షకుల జేజేలు అందుకున్న అరుదైన సందర్భమిది.
2019-07-14క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లండ్. కానీ, ఇంతవరకు ప్రపంచ కప్ కలగానే మిగిలింది. ఆదివారం లార్డ్స్ మైదానంలో ఆ కల నెరవేరింది. క్రికెట్ ప్రపంచ కప్ తొలిసారి ఇంగ్లండ్ వశమైంది. 2019 ప్రపంచ కప్ ఫైనల్లో తలపడిన న్యూజీలాండ్, ఇంగ్లండ్ తొలి 50 ఓవర్లలోనూ, ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్లోనూ సమంగా నిలిచాయి. మ్యాచ్ టై అయినా బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ ను విజేతగా ప్రకటించారు. రెండు జట్లూ 50 ఓవర్ల మ్యాచ్ లో చెరి 241 పరుగులు, సూపర్ ఓవర్లో 15 పరుగులు చేశాయి.
2019-07-14