‘వైఎస్ఆర్ రైతుభరోసా’ సాయాన్ని రూ. 1000 మేరకు పెంచనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కేంద్రం ఇచ్చే రూ. 6000తో కలిపి అర్హులైన రైతులకు రూ. 12,500 ఇవ్వాలని ఇదివరకు నిర్ణయించగా, ఇప్పుడా మొత్తం రూ. 13,500కు పెరుగుతోంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే రూ. 13,500 ఇవ్వనుంది. రైతు భరోసా తొలి విడతగా అక్టోబర్ 15న 40 లక్షల మందికి సాయం అందజేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు చెప్పారు. ఈ పథకానికి రైతులు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2019-10-14బీసీసీఐలో నాటకీయ పరిణామాల మధ్య... కొత్త అధ్యక్షుడిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు తెరపైకి వచ్చింది. గంగూలీపై ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. మరో విశేషం ఏమంటే... కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జే షా బీసీసీఐకి కొత్త కార్యదర్శిగా దర్శనమివ్వనున్నాడు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ కోశాధికారి కానున్నారు. గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
2019-10-14 Read Moreమెజారిటేరియనిజంతో జాతీయ భద్రత మెరుగుపడదని, నిజానికి అది బలహీనపరుస్తుందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. వాట్సన్ ఇనిస్టిట్యూట్ లో ఒపి జిందాల్ లెక్చర్ ఇచ్చిన రాజన్, ‘‘మెజారిటీ జాతీయవాదం దేశాన్ని అంతర్గతంగా విభజిస్తుంది. ఓ సమూహంలోని పౌరులను ‘ఇతరులు’ కింద పరిగణిస్తుంది’’ అని పేర్కొన్నారు. అంతర్గత సామరస్యం, ఆర్థికాభివృద్ధి మాత్రమే భారత జాతీయ భద్రతకు పునాధులు కాగలవని... విభజిత, జనరంజక మెజారిటీ వాదం కాదని రాజన్ ఉద్ఘాటించారు.
2019-10-14 Read Moreరామ మందిరం - బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు ఈ నెల 17వ తేదీన ముగుస్తున్న నేపథ్యంలో అయోధ్యలో 144వ సెక్షన్ విధించారు. అది డిసెంబర్ 10వరకు అమల్లో ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసేలోగా అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతుందన్న సంకేతాలు ఇదివరకే అందాయి. మధ్యవర్తిత్వం విఫలమయ్యాక జస్టిస్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు జడ్జిల బెంచ్ ఆగస్టు 6వ తేదీనుంచి రోజువారీగా ఈ కేసును విచారిస్తోంది.
2019-10-13 Read Moreదేశంలో టాప్ 10లో 8 కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ. 80,943 కోట్ల మేరకు పెరిగింది. ముఖేష్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్ విలువ ఏకంగా 28,494 కోట్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ముఖేష్ అంబానీ కంపెనీ మొత్తం విలువ రూ. 8,57,303 కోట్లకు చేరింది. టాప్ 10లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), ఐటిసి మినహా మిగిలిన 8 కంపెనీల మార్కెట్ విలువ పెరిగింది. టీసీఎస్ విలువ రూ. 34,372 కోట్లు తగ్గి రూ. 7,45,617 కోట్లకు చేరింది.
2019-10-13 Read Moreతెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అద్దె బస్సుల హవా పెరిగింది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఓ అద్దె బస్సు ఆదివారం బీభత్సం సృష్టించింది. ఓ కారును ఢీకొట్టి డివైడర్ మీదుగా దూసుకెళ్ళింది. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడిపినట్టు ప్రయాణీకులు చెప్పగా... స్థానికులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2019-10-13 Read Moreజమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని (ఆర్టికల్ 370ని) ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ సవాలు విసిరారు. దమ్ముంటే ఆ నిర్ణయాన్ని రివర్స్ చేయాలన్నారు. ఆదివారం మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మోదీ ‘‘దాన్ని (370ని) మళ్లీ తెచ్చే ధైర్యం ఎవరికైనా ఉందా? ఆ ధైర్యం చేస్తే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుందా’’ అని మోదీ ప్రశ్నించారు.
2019-10-13 Read Moreవైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘నవరత్నాలు’లో ఒకటైన ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పథకానికి రూ. 5,510 కోట్లు విడుదలయ్యాయి. ఈమేరకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బిఆర్ఒ) ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆదివారం జీవో ఆర్.టి. నెం. 1744 జారీ చేశారు. అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇస్తానన్న రూ. 6000తో కలిపి మొత్తం రూ. 12,500 నేరుగా ఖాతాలలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లా కాకుటూరులో ప్రారంభించనున్నారు.
2019-10-13 Read Moreఆర్థిక మందగమనం ఇండియాను తీవ్రంగా ప్రభావితం చేయగా... పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ మనకంటే వేగంగా ముందుకు వెళ్తున్నాయి. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘‘దక్షిణాసియా ఎకనామిక్ ఫోకస్’’ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ వృద్ధి కేవలం 6 శాతం కాగా, నేపాల్ 7.1 శాతం, బంగ్లాదేశ్ ఏకంగా 8.1 శాతం వృద్ధి చెందనున్నాయి. అంతే కాదు... వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కూడా ఇండియా కంటే బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధి మెరుగ్గా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.
2019-10-13 Read More2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇండియా స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 6 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2017-18లో 7.2 శాతం నమోదు కాగా 2018-19లో 6.9 శాతానికి తగ్గి ఈ ఏడాది మరింతగా పడిపోతోంది. ఆదివారం విడుదలైన ‘‘దక్షిణాసియా ఎకనమిక్ ఫోకస్’’లో బ్యాంకు తాజా అంచనాలను వెల్లడించింది. 2020-21లో వృద్ధి రేటు 6.9 శాతానికి, 2021-22లో 7.2 శాతానికి పెరుగుతుందని ఆ పత్రం అంచనా వేసింది.
2019-10-13 Read More