ఒకే తరగతి విద్యార్ధుల్లో మార్కుల ప్రాతిపదికన టాపర్లను ఒక సెక్షన్లో.. మిగిలినవారిని మరో సెక్షన్లో కూర్చోబెట్టడం విద్యకు సంబంధించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్-హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పోకడ... తక్కువ మార్కులు పొందిన విద్యార్ధుల్లో ఆత్మన్యూనతా భావాన్ని కలిగిస్తుందని జస్టిస్ సుధీర్ మిట్టల్ ఉద్ఘాటించారు. పంజాబ్ లోని ఫరీద్ కోట్ పట్టణ వాసి డాక్టర్ నీతు కుకర్ వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. తన కుమార్తె 6వ తరగతి నుంచి ఈ వివక్షను ఎదుర్కొంటోందని (ప్రస్తుతం 8వ తరగతి) ఆమె నివేదించారు.
2020-02-29 Read Moreప్రపంచంలో పేరెన్నికగన్న ‘అపాచీ’ వంటి హెలికాప్టర్లకు ధీటుగా 10-12 టన్నుల అటాక్ హెలికాప్టర్లను తయారు చేసేందుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ పూర్తయింది. త్రివిధ దళాలకు అవసరమైన సుమారు రూ. 4 లక్షల కోట్ల విలువైన హెలికాప్టర్ల దిగుమతిని నిరోధించడం ఈ మెగా ప్రాజెక్టు లక్ష్యమని హాల్ ఛైర్మన్ ఆర్. మాధవన్ ఆదివారం ‘పిటిఐ’ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2023 నాటికి మొదటి నమూనాను సిద్ధం చేస్తామని మాధవన్ పేర్కొన్నారు.
2020-03-01 Read Moreశివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ కొత్త సంపాదకురాలిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరే నియమితులయ్యారు. ఆదివారం ఆమె నియామకాన్ని ప్రకటించారు. ‘సామ్నా’, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే నుంచి ఆయన కుమారుడు ఉద్ధవ్ రెండు బాధ్యతలనూ స్వీకరించారు. సిఎం అయ్యాక పత్రిక బాధ్యత నుంచి తప్పుకున్న ఉద్ధవ్, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. థాకరే కుటుంబం నుంచి ఓ మహిళకు పత్రిక బాధ్యత అప్పగించడం ద్వారా.. ఆమె కీలక పాత్ర పోషిస్తారనే సంకేతాలను ఇచ్చినట్టు భావిస్తున్నారు.
2020-03-01 Read Moreకేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా ఆదివారం (మార్చి 1న) కోల్ కత నగర వీధుల్లో ‘గోలీమారో’ నినాదాలు మార్మోగాయి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేకులను దేశద్రోహులుగా పేర్కొంటూ వారిని కాల్చి చంపాలని బిజెపి నేతలు నినదించారు. షాహిద్ మినార్ మైదానంలో అమిత్ షా సభకు హాజరయ్యేందుకు వెళ్తూ బిజెపి నేతలు ఈ నినాదాలు ఇచ్చారు. ఢిల్లీలో సాక్షాత్తు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బిజెపి నేత కపిల్ మిశ్రా ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం, ఆ తర్వాత మతోన్మాద దాడులు జరగడం తెలిసిందే.
2020-03-01 Read Moreఏపీ ప్రభుత్వ పెట్రోలియం పన్నుల విధానం నెలలో రెండోసారి మారింది. లీటరు పెట్రోలుపై ‘31%+రూ.2’, డీజిల్ పైన ‘22.25%+రూ.2’గా ఉన్న పన్నులను.. ‘35.20%’, ‘27%’గా మారుస్తూ జనవరి 29న జీవో ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాత విధానానికి మళ్ళి.. పన్నులను పెంచింది. పెట్రోలుపై ‘31%+రూ 2.76’, డీజిల్ పైన ‘22.25%+రూ. 3.07’ పన్ను విధిస్తూ శనివారం (ఫిబ్రవరి 29న) జీవో ఎంఎస్ నెం. 68ని జారీ చేసింది. దీంతో ముడిచమురు ధరలతో నిమిత్తం లేకుండా పెట్రోలుపై లీటరుకు 76 పైసలు, డీజిల్ పై రూ. 1.07 చొప్పున ప్రభుత్వానికి అదనపు ఆదాయం రానుంది.
2020-02-29ఆప్ఘనిస్తాన్ నుంచి తన సేనలను పూర్తిగా విరమించుకునేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం శనివారం తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి ఇండియా ప్రతినిధి కూడా హాజరయ్యారు. ఇది జరిగిన కొద్ది గంటల తర్వాాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఏదైనా అనుకోనిది జరిగితే తిరిగి ఫుల్ ఫోర్సుతో వస్తాం’’ అని ట్రంప్ హెచ్చరించారు. తాను అతి త్వరలోనే తాలిబన్ నేతలను కలుస్తానని ఆయన ప్రకటించారు.
2020-03-01ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, వస్తువుల ఎగుమతిలో నెంబర్ 1 దేశం చైనాకు ‘కరోనా’ ఓ కాళరాత్రిలా మారింది. 2020 ఫిబ్రవరిలో చైనా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) అసాధారణంగా 35.7కి పడిపోయింది. ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం కుదిపేసినప్పుడు 2008 నవంబరులో చైనా పిఎంఐ 38.8కి దిగజారింది. ఇప్పుడు అంతకంటే తగ్గడం గమనార్హం. జనవరిలో పిఎంఐ 50.0గా నమోదైంది. ఫిబ్రవరిలో 46.0కి పడిపోతుందని ‘రాయిటర్స్’ సర్వేలో విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, అనూహ్యంగా రికార్డు స్థాయికి చైనా ఉత్పత్తి సూచీ పడిపోయింది.
2020-02-29 Read More‘కరోనా వైరస్’తో అమెరికాలో తొలి మరణం శనివారం (ఫిబ్రవరి 29న) నమోదైంది. వాషింగ్టన్ రాష్ట్రంలోని కింగ్ కౌంటీలో ఓ వ్యక్తి వైరస్ తీవ్రతతో చనిపోయినట్టు గవర్నర్ జే ఇన్స్లీ తాజాగా నిర్ధారించారు. ఆ వ్యక్తికి చైనాతో ఎలాంటి లింకూ లేదని చెబుతున్నారు. ‘కరోనా’పై మరి కొద్దిసేపట్లో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలోనే తొలి మృతి కేసు వెలుగులోకి వచ్చింది. కరోనా తాకిడికి గురైన దేశాల సంఖ్య శనివారం 57కి పెరిగింది.
2020-02-29లక్సెంబర్గ్ ... ఐరోపాలోనే ధనిక దేశం. ఇప్పుడు ప్రజా రవాణా మొత్తాన్ని ఉచితంగా అందించబోతున్న తొలి దేశం అవుతోంది. ఆదివారం నుంచి ఆ దేశం మొత్తంలో బస్సు, రైలు, ట్రామ్ ప్రయాణం ఉచితం. ఇప్పటికే ప్రయోగాత్మకంగా శనివారం మాత్రం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి, కార్ల వినియోగాన్ని తగ్గించడానికి లక్సెంబర్గ్ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని దేశాల్లోని కొన్ని నగరాల్లో ఉచిత ప్రయాణం ఉన్నా..దేశమంతా ఉచితం చేసింది మాత్రం లక్సెంబర్గ్.
2020-02-29 Read Moreప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టుకతోనే భారతీయుడని, అందువల్ల ఆయన పౌరసత్వపు పత్రం తీసుకున్నారా? అన్న ప్రశ్నే తలెత్తదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద శుభాంకర్ సర్కార్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు పిఎంఒ శుక్రవారం బదులిచ్చింది. ‘‘దయచేసి మన ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పౌరసత్వ సర్టిఫికెట్ చూపండి’’ అని సర్కార్ ఆర్.టి.ఐ. కింద పెట్టిన దరఖాస్తు జనవరి 17న పిఎంఒకు అందింది. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ప్రధాని మోడీ పుట్టుకతోనే భారతీయుడని పిఎంఒ బదులిచ్చింది.
2020-02-29