అక్రమ ఆస్తుల కేసులో వచ్చే శుక్రవారం (జనవరి 10న) హాజరు కావాలని హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదేశించింది. జగన్ తండ్రి సిఎంగా ఉన్నప్పుడు ‘క్విడ్ ప్రోకో’ ఒప్పందాలతో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సీబీఐ కేసులు పెట్టింది. సిఎం కాక ముందు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైన జగన్, ఆ తర్వాత ఏదో ఒక కారణం చూపి మినహాయింపు కోరుతున్నారు. ఇప్పటికి 10 మినహాయింపులు తీసుకున్నారని కోర్టు శుక్రవారం గుర్తు చేసింది.
2020-01-04తమ దేశ సైన్యంలో టాప్ జనరల్ అయిన ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పౌరులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి అమెరికాకు నిరసన తెలిపారు. శుక్రవారం ప్రార్ధనల తర్వాత దేశ రాజధాని టెహ్రాన్, చారిత్రక కెర్మన్ సహా పలు నగరాల్లో భారీగా ప్రజలు రోడ్లపై ర్యాలీ అయ్యారు. సులేమానీని జాతీయ హీరోగా స్మరిస్తూ అమెరికా వ్యతిరేక నినాదాలను హోరెత్తించారు. కొంతమంది ప్లకార్డులపై ‘‘తీవ్ర ప్రతీకారం’’ అని రాసి ప్రదర్శించారు.
2020-01-04సచివాలయం, ముఖ్యమంత్రి, గవర్నర్ క్యాంపు కార్యాలయాలు, అత్యవసర అసెంబ్లీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బి.సి.జి) సూచించింది. రాజధాని, వికేంద్రీకృత అభివృద్ధిపై అధ్యయనం కోసం కాంట్రాక్టు పొందిన బి.సి.జి. తన నివేదికను శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేసింది. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, 15 శాఖాధిపతుల కార్యాలయాలు... కర్నూలులో హైకోర్టు, కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని బిసిజి సూచించింది.
2020-01-04కర్నాటక బిజెపి ఎమ్మెల్యే జి. సోమశేఖరరెడ్డి శుక్రవారం మైనారిటీలను బహిరంగంగా బెదిరించారు. ‘‘మేము 80 శాతం ఉన్నాం. మీరు కేవలం 17 శాతం. మేము మీకు వ్యతిరేకంగా రంగంలోకి దిగితే ఏమవుతుందో ఊహించుకోండి’’ అని ఓ సభలో సోమశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. అతి పెద్ద మైనింగ్ కుంభకోణంలో నిందితుడు గాలి జనార్ధనరెడ్డికి ఈయన అన్న. జనార్ధనరెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయనకు బెయిలుకోసం ఆంధ్రా సీబీఐ జడ్జికి లంచం ఇవ్వజూపిన కేసులో సోమశేఖరరెడ్డి నిందితుడు.
2020-01-04 Read Moreపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలలో తీర్మానం చేయాలని కేరళ సిఎం పినరయి విజయన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నవించారు. శుక్రవారం ఆయన 11 రాష్ట్రాల (బీజేపీయేతర) సిఎంలకు లేఖలు రాశారు. సిఎఎ ప్రాథమికంగా వివక్షాపూరితమని, భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విజయన్ తన లేఖలో పేర్కొన్నారు. సిఎఎ రద్దు కోరుతూ కేరళ అసెంబ్లీ గత నెల 31న తీర్మానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
2020-01-03 Read Moreతెలంగాణ వ్యాప్తంగా అన్ని వాగులపైనా అవసరమైనన్ని చెక్ డ్యాములు నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరం సగం ప్రాంతాల్లో నిర్మించి, వచ్చే ఏడాదికి మొత్తం పూర్తి చేయాలని సూచించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించిన చెరువులు పాడవకుండా చూడాలని చెప్పారు. కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో చిన్ననీటి వనరులపై సమీక్ష నిర్వహించారు.
2020-01-03ఆందోళనలతో ఆరంభమైంది 2020. తొలి రోజుల్లోనే దేశం నలుమూలలా ఏదో అంశంపైన నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. శుక్రవారం ‘‘ఆశ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్)’’ మహిళలు బెంగళూరు ఆనందరావు ఫ్లై ఓవర్ పై కథం తొక్కారు. తమకు ఇచ్చే రూ. 3,500 కూడా ప్రభుత్వం 15 నెలల నుంచి ఇవ్వకపోవడంపై మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నెలకు రూ. 12 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి ఫ్రీడం పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు.
2020-01-03 Read Moreనూతన సంవత్సరంలోకి ప్రవేశించే 24 గంటల్లో శుభాకాంక్షల మెసేజ్‌లలో వాట్సాప్ రికార్డు సృష్టిస్తోంది. ఒక్క రోజే 10,000 కోట్ల మెసేజ్‌లు వెల్లువెత్తాయి. అందులో భారతీయులవే 2000 కోట్లు ఉన్నట్టు చెబుతున్నారు. 10 వేల కోట్ల మెసేజ్‌లలో 1200 కోట్ల ఫొటోలు ఉన్నాయి.
2020-01-03రాజధాని సహా నగరాభివృద్ధి, వికేంద్రీకరణపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బి.సి.జి) శుక్రవారం తుది నివేదికను సమర్పించింది. రాజధానిని ప్రస్తుతం ఉన్న అమరావతినుంచి విశాఖపట్నానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం, ఈ నివేదికపై జరిపే పరిశీలన లాంఛనమే కానుంది. 10 మంది మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నెల 6న సమావేశం కానుంది. బిసిసి, జి.ఎన్. రావు కమిటీల నివేదికలపై చర్చించనుంది. తర్వాత 8న మంత్రివర్గం సమావేశమై ఓ నిర్ణయం తీసుకోనుంది.
2020-01-03ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చింది. శుక్రవారం వేకువజామున ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సులేమానీ దిగిన వెంటనే అమెరికా డ్రోన్ రాకెట్లు దాడి చేశాయి. ట్రంప్ ఆదేశంతోనే ఈ హత్య జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఇరాక్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ పెరిగింది. గత వారం జరిగిన అమెరికా వైమానిక దాడులకు ప్రతిగా కొందరు మంగళవారం ఆ దేశ ఎంబసీపై దాడి చేశారు.
2020-01-03 Read More